exam stress: పరీక్షల సమయం కావడంతో కొందరు పిల్లలు అదే పనిగా చదువుతూ ఉంటారు. అలా చదవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లో మానసికంగా, శారీరకంగా పిల్లలకు కొంత విశ్రాంతి అవసరం. ఎక్కువ సమయం పుస్తకాలతో కుస్తీ పట్టకుండా మధ్య మధ్యలో కుటుంబ సభ్యులతో గడిపేలా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేస్తే కొంత మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అలా అని మరీ ఎక్కువ కాలక్షేపం (exam stress)చేయకూడదు.

విశ్రాంతి అవసరం!
ప్రతిసారి చదుతూ ఉండటం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కండ్లకు విశ్రాంతి అవసరం కనుక మధ్యలో చల్లని నీటిలో కండ్లను కడుక్కుంటూ ఉండాలి. పిల్లలు ఏ విషయాల్లో ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారో గుర్తించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. చదివేటప్పుడు ఎదుటివారితో పోలుస్తూ నసగొద్దు. ఇలాంటి సమయాల్లో అలా నసిగితే వారిలో ఒత్తిడి మరింత పెరిగే ప్రమాదం ఉంది. చదివేటప్పుడు వారికి మీరిచ్చే స్వేచ్చ వారి విజయానికి బాసటా నిలుస్తుంది.
ఓపిక ఉండాలి!
పెద్ద పిల్లలకి ఒకసారి చెబితే అర్థమవుతుంది. అదే చిన్న పిల్లలకు చెప్పగానే అర్థం కాదు. చెప్పే దాన్నీ వారు శ్రద్ధగా వినరు. అలాంటి వారికి మనం ఏం నేర్పాలన్నా ముందు ఓపిక ఉండాలి. చెప్పే, నేర్పే పద్ధతి లోనూ కొంత వినోదం ఉండాలి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న పిల్లల్ని నిర్భంధంగా చదవమంటే కుదరదు. మీరు వారి పక్కన కూర్చుని చదివించాలి. లెక్కలు నేర్పాలనుకుంటూ పుస్తకాన్ని ఎదురుగా పెట్టి వారితో చేయించేకన్నా నాలుగు బొమ్మల్ని(drawing education) చూపించి వాటిని లెక్క పెట్టమని చెప్పండి.

వీటిల్లోంచి రెండు బొమ్మల్ని తీసేస్తే ఇంకా ఎన్ని మిగిలాయి.. అని అడగండి. ఇలా వాళ్లు ఆసక్తిగా నేర్చుకునే పద్ధతిలో లెక్కలూ, అంకెలూ నేర్పితే చిన్న పిల్లలు మొదట్లోనే చదువుని భారంగా చూడరు. పలకపై చేత్తో దిద్దించే కన్నా.. చిన్న బ్లాక్‌బోర్డు కొనిదానిపైన రాయించండి. చాలా మంది పిల్లలకి బోర్డుపై రాయడం ఇష్టమైన పని. నర్సరీ పిల్లలతో అయితే మీరే చేయి పట్టుకుని బోర్డుపై రాయించొచ్చు. ఆలోచిస్తే పిల్లలకి సరదాగా చదువకుని చేరువ చేసే మార్గాలెన్నో కనిపిస్తాయి.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి