exam preparation tips

exam preparation tips: సైకాల‌జీ చ‌దివే ప‌ద్ధ‌తి ఎలా?

Spread the love

exam preparation tips మీరు నాలుగైదు పుస్త‌కాలు చ‌దివే కంటే ఒకే పుస్త‌కాన్ని నాలుగైదు సార్లు చ‌ద‌వ‌డం ఉత్త‌మం, మీరు నోట్స్ త‌యారు చేసుకుని చ‌ద‌వాలా? లేదా అకాడ‌మీ బుక్స్‌నే నేరుగా చ‌ద‌వాలా? బ‌య‌ట దొరికే బుక్స్ చ‌ద‌వాలా? అనే అంశాన్ని మీరు నిర్ణ‌యించుకున్న త‌ర్వాత మీరు ఏ బుక్ చ‌ద‌వాలి? అని అనుకున్నారో మీరు ప్రిప‌రేష‌న్ ప్రారంభించిన మొద‌టి రోజు నుండి టెట్(TET) లేదా డి.ఎస్‌.సి(DSE) ఎగ్జామ్ వ్రాసే వ‌ర‌కూ కూడా అదే(exam preparation tips) బుక్స్ చ‌ద‌వాలి.

మీరు చ‌ద‌వే ప‌ద్ధ‌తిని ఒక టాపిక్‌లోని చిన్న అంశాన్ని తీసుకున్న దానిని మీకు ఉదాహ‌ర‌ణ‌తో వివ‌రిస్తాము. మీరు వికాస సూత్రాలు అనే టాపిక్‌లో – వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది… అనే సూత్రాన్ని చ‌దువుతున్నారు అనుకుంటే అక్క‌డ ఉన్న విష‌యం – వికాసం నిరంత‌రం కొన‌సాగే ప్ర‌క్రియ‌..అని చ‌ద‌వినప్పుడు దానికి మీ మైండ్‌లో ఇలా ఇమాజినేష‌న్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఉన్న విష‌యం – ఒక సూక్ష్మ క‌ణంగా మొద‌ల‌య్యే మ‌నిషి జీవితం కాలంతో పాటు అనేక మార్పులు చెందుతూ అవిచ్ఛిన్నంగా కొన‌సాగుతుంది. అప్పుడు మీరు చ‌దివిన‌ప్పుడు ఆ విష‌యాన్ని ఇమాజినేష‌న్ చేసుకోవాలి. మ‌న సైకాల‌జీలో చాలా వ‌ర‌కు అంశాలు ఇలా ఇమాజినేష‌న్ చేసుకుని చ‌దువుకోవ‌చ్చు. ఇంకొన్ని అంశాలు మెమోరీకి సంబంధించిన‌వి ఉంటాయి. వాటిని అవ‌గాహ‌న‌తో చ‌ద‌వ‌డం సాధ్యం కాదు. కాబ‌ట్టి వీటిని చ‌ద‌వ‌టానికి రిపిటేష‌న్ మించిన ప‌ద్ధ‌తి మ‌రొక‌టి లేదు. వీటికి ఉదాహ‌ర‌ణ కొన్ని నిర్వ‌హ‌చ‌నాలు, ప్ర‌జ్ఞా ప‌రీక్ష‌ల పేర్లు.. ఇలాంటివి.

సాధార‌ణంగా మ‌న ఎడ్యుకేష‌న్ సైకాల‌జీలో 90% అంశాలు మ‌న చుట్టూ ఉండే పిల్ల‌లు, వ్య‌క్తులు, ప‌రిస‌రాల‌కు అన్వ‌యించి చ‌దువుకుని గుర్తు పెట్టుకోగ‌లిగేలా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు పూర్వ‌బాల్య ద‌శ‌లో ఉన్న పిల్ల‌ల వివిధ వికాసాల‌ను చ‌దువుతున్న‌ప్పుడు పూర్వ బాల్య‌ద‌శ వ‌య‌స్సులో ఉన్న మ‌న ఇంట్లో గానీ మ‌న చుట్టు ప్ర‌క్క‌ల గానీ పిల్ల‌ల‌కు ఆ వికాస ల‌క్ష‌ణాలు అన్వ‌యించుకొని చ‌దివితే ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఎందుకంటే బుక్‌లో ఉన్న వికాస ల‌క్ష‌ణాలు మ‌న చుట్టూ ఉన్న పిల్ల‌ల ప్ర‌వ‌ర్తించే విధానానికి ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. ఇలా చ‌దువుకోవ‌డానికి అవ‌కాశం ఉన్న అంశాల‌ న్నింటినీ ఇలా చ‌దువుకోవ‌డం మంచిది. దీని వ‌ల్ల మ‌నం ఆ అంశాల‌ను శాశ్వ‌తంగా గుర్తుపెట్టుకునే అవ‌కాశం ఉంటుంది.

మ‌రో ముఖ్య విష‌యం మీరు చ‌దివేట‌ప్పుడు ఒక చిత్తు నోట్స్‌ను ప్ర‌క్క‌న పెట్టుకుని చ‌ద‌వండి. ఈ చిత్తునోట్స్ ఎందుకు అంటే మ‌నం చ‌దువుతున్న టాపిక్‌లో కీల‌క ప‌దాలు, శాస్త్ర‌వేత్త‌ల పేర్లు, గ్రంధాల పేర్లు, మ‌నం మొద‌టిసారిగా ఇప్పుడే చ‌దువుతున్న, చూస్తున్న ప‌దాలు, నెంబ‌ర్స్‌తో లింక్ అయ్యి ఉన్న అంశాలు మ‌రియు బిట్స్ ఆన్స‌ర్‌గా వ‌చ్చే ప‌దాలు ఇలాంటివి త‌ప్ప‌ని స‌రిగా ఒక‌టికి రెండు సార్లు చిత్తునోట్స్‌లో వ్రాసుకుని చ‌ద‌వ‌డం వ‌ల్ల ఆ ప‌దాలు మ‌న మెద‌డులో త్వ‌ర‌గా ప్రింట్ అవుతాయి.

మ‌రియు మ‌న‌కు ఎగ్జామ్‌లో వ‌చ్చే ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్స్ స్వంతంగా వ్రాయాల్సిన ప‌నిలేదు అక్క‌డ ఇచ్చిన ఆప్ష‌న్‌లో ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాబ‌ట్టి అలా చిత్తు నోట్స్‌లో వ్రాసుకుంటూ ఉంటే ప్ర‌శ్న‌కు మ‌నం నేరుగా స‌మాధానం చెప్ప‌లేక‌పోయి న‌ప్ప‌టికీ కూడా అక్క‌డ ఇచ్చిన ఆప్ష‌న్స్ ద్వారా మ‌న బ్రెయిన్ ఒకప్పుడు అలా చిత్తునోట్స్‌లో వ్రాసిన ప‌దాల‌కు మ్యాచ్ చేసి స‌రైన స‌మాధానం ఎంపిక చేసుకునేలా చేస్తుంది. ఇంకో విష‌యం అలా చిత్తునోట్స్‌లో వ్రాసుకుంటూ చ‌దువుతుంటే ఏకాగ్ర‌త‌గా చ‌దవ‌వ‌చ్చు.

don’t compare with others:ఇత‌రుల‌తో పోల్చుకోకు..ఒక వేళ పోల్చుకుంటే ఇది చూడు!

don't compare with othersకొంద‌ర‌మ్మాయిలు అందం, చ‌దువు, ఉద్యోగం.. ఇలా ఇత‌ర‌త్రా విష‌యాల్లో ఇత‌రుల‌తో పోల్చుకొని ఆత్మ‌న్యూన‌త‌కు లోన‌వుతుంటారు. ఇలాంటి ఆలోచ‌న‌లు ఉంటే ఏ రంగంలోనూ రాణించ‌లేర‌ని Read more

Importance of Social Norms: మ‌నం ప‌ట్టించుకోని సోష‌ల్ రూల్స్‌

Importance of Social Norms క్రింద తెలిపిన కొన్ని అముల్య‌మైన వాఖ్యాలు ఎవ‌ర్నీ త‌క్కువ చేసి కాదు ఎక్కువ చేసి చెప్ప‌డం లేదు. జీవితంలో ప్ర‌తిఒక్క‌రికీ తెలియాల్సిన Read more

Intermediate education:ఇంట‌ర్మీడియ‌ట్ గ్రూపు కెరీర్‌ను నిర్థేశిస్తుందా? విద్యార్థులు తెలుసుకోవాల్సిన విష‌యాలు!

Intermediate education ప్ర‌త్యేక నైపుణ్యాల‌తో కూడిన మెడిక‌ల్ కోర్సులు చేయాల‌న్నా, ఇంజ‌నీరింగ్ లాంటి సాంకేతిక కోర్సులు చ‌ద‌వాల‌న్నా, సాంప్ర‌దాయ‌క డిగ్రీల‌లో చేరి ఉన్న‌త విద్య‌లో రాణించా ల‌న్నా Read more

School Timetable: ఉద‌యం 8 గంట‌ల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు పాఠ‌శాల‌లు! 10 గంట‌ల పాటు క్లాసులు!

School Timetable: అమ‌రావ‌తి: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల స‌మ‌యాన్ని పొడిగించారు. ప్రారంభానికి ముందు గంటా 45 నిమిషాలు, త‌ర‌గ‌తుఉల ముగిసిన త‌ర్వాత గంటా 15 నిమిషాలు పెంచారు. ఉన్న‌త Read more

Leave a Comment

Your email address will not be published.