Eturnagaram: వర్షాకాలం రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నేలంతా చిత్తడి చిత్తడిగా మారింది. మైదాన ప్రాంతంలో కన్నా నది పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతి నిధులు ప్రజల వద్దకు వెళుతున్నారు. తెలంగాణలో కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు గ్రామాలకు వరద ప్రభావం భయాందోళన గురి చేస్తుంది.
తెలంగాణలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా తన నియోజకవర్గ ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వారి వద్దకు వెళ్లింది. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకాన్ని అడిగి తెలుసుకున్నారు. ఏఏ ప్రాంతాల్లో వరద ప్రభావం ఉందో, ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో గోదావరి నదీ వరద ఉధృతి ములుగు నియోజ కవర్గం(Eturnagaram)పై తప్పకుండా ప్రభావం చూపుతుంది. దీంతో ముందస్తుగా వరద సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే సీతక్క ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Eturnagaram ఐటిడిఎ పీవో అంకిత్ బాధత్యలు చేపట్టారు. దీంతో ఎమ్మెల్యే వారిని కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు, ఏజెన్సీ గిరిజన ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఐటిడిఎ పీవో దృష్టికి తీసుకెళ్లారు సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరిగిందన్నారు.Godavari ప్రాంత ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని ఉన్నారని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.


ఆదుకోండి పీవో గారూ!
ములుగు నియోజకవర్గం(Eturnagaram)లో కొన్ని గ్రామాలకు రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పరిస్థితులు తెలుసుకునేందుకు పడవలు ఏర్పాటు చేయాలని పీఓను కోరారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బందిని గ్రామాల్లోకి మోహరించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా Eturnagaram ఐటిడిఎ పీవోకు సమస్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బ్లాక్, మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల జిల్లా మండల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.