Ettari Antayya | వడ్డెర సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని రాష్ట్ర Shrama Sakthi అవార్డు గ్రహీత, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి అంతయ్య అన్నారు. ఖమ్మం నగరంలోని ఆదివారం జిల్లా పరిషత్ హాల్‌లో వడ్డెర సంఘం తెలంగాణ గన్ను దెబ్బ రాష్ట్ర కమిటీ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా నాయకులు కుంచపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Vaddera సంఘం రాష్ట్ర అధ్యక్షులు, శ్రమ శక్తి అవార్డు గ్రహీత Ettari Antayya హాజరయ్యారు. అనంతరం ఆయనను గజమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు Ettari మాట్లాడుతూ Vaddera Sangam అభివృద్ధి కొరకు అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు. రాష్ట్రంలో వడ్డెరలు అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడి ఉన్నారని, రాజకీయంగా అంటరాని వారివల్లే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. ముఖ్యంగా ఉమ్మడి Khammam జిల్లాలో పోడు భూముల సమస్య ఎక్కువుగా ఉందని, రాష్ట్రంలో వడ్డెరలకు గుర్తింపు రావాలంటే ఐక్యంగా ఉండాలని పిలుపు నిచ్చారు.


ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారుడు డాక్టర్ Orsu కృష్ణయ్య, సంఘం రాష్ట్ర నాయకులు పీట్ల స్వర్ణ కుమార్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు శ్రీరాములు, రాయల చంద్రరావు, చల్లా హన్మంతు, దేవుళ్ల సీరబాబు, గుంజ వెంకటేశ్వర్లు, బి.నాగేశ్వరరావు, పల్లపు రాము, చల్లా నాగులు, ఇడగొట్టి హన్మంతు, ఉప్పుతోళ్ల కొండల్, బత్తుల అంజిబాబు, షకీన తదితరులు పాల్గొన్నారు.

