Etela Rajender press meet హుజూరాబాద్: నా చర్మం ఒలిచి, వాళ్లకు చెప్పులు కుట్టించినా నేను వారి రుణం తీర్చుకోలేను అంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.హుజురాబాద్ ఉప ఎన్నిక అనంతరం హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విలేకర్ల సమావేశం మధువని గార్డెన్స్‌లో ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో చాలా ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఈ విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. నాలాంటి కష్టం శత్రువుకు కూడా రావొద్దని, కుట్రదారుడు కుట్రలలోనే నాశనం(Etela Rajender press meet) అయిపోతాడని పేర్కన్నారు.
2 గుంటల భూమి ఉన్న మనిషి 4 వందల కోట్ల డబ్బును ఎలా ఖర్చు పెట్టాడని ప్రశ్నించారు. కేసీఆర్ మొఖంతో కంటే ఇప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చాయని, తాను పార్టీలు మారేవాడిని కాదని, తన చరిత్ర తెరిచిన పుస్తకమని ఈటెల అన్నారు. సీఎం కేసీఆర్ అహంకారాన్ని, బెదిరింపులను లెక్క చేయకుండా హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ చెంప చెల్లు మనిపించారన్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి ప్రలోభాలతో కూడిన ఎన్నిక ఎక్కడా జరగలేదని అన్నారు. హుజూరాబాద్ ప్రజలు గుండెను చీల్చి తమ ఆత్మను ఆవిష్కరించి నన్ను గెలిపించారన్నారు.
కులాల పరంగా చీలిక తెచ్చినా అనే ప్రలోభాలకు గురిచేసినా హుజూరాబాద్ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని, భారీ విజయాన్ని అందించారన్నారు. తనని టిఆర్ఎస్ నుంచి వెల్లగొట్టిన తర్వాత తనను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ అని అన్నారు. అమిత్‌షా తనకు సంపూర్ణ సహకారం అందించారన్నారు. జెపి నడ్డా కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌తో తగు సూచనలు చేశారన్నారు. నా గెలుపుకోసం వందలాది మంది కనపడకుండా పనిచేశారన్నారు. హుజూరాబాద్‌లో ఈటెల గెలవడం అంటే అందరూ గెలిచినట్టేనని వివిధ వర్గాల వారు, ఉద్యోగులు భావించరన్నారు.


ఎప్పుడూ బయటకు రాని దత్తాత్రేయ లాంటి వాళ్లూ కూడా ఇక్కడికి వచ్చారన్నారు. ఓయు, కేయు తో పాటు ఎందరో విద్యార్థులు నాకు సహకరించారన్నారు. ప్రపంచంలో తెలుగు వారంతా కూడా నా గెలుపును కోరుకున్నారన్నారు. నిజంగా దీపావళి ఈ నెల 4న అయితే నా గెలుపుతో ప్రజలంతా నిన్ననే దీపావళి చేసుకున్నారన్నారు. గతంలో నాకు వచ్చిన ఓట్ల కంటే ఈ సారి ఎక్కువే ఓట్లు సాధించానన్నారు. రాబోయే కాలంలో ప్రజల గొంతుకగానే ఉండానని, తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడే ఒకసారి నా జన్న ధన్యమైందని పేర్కొన్నారు. ఈ మొత్తం విజయాన్ని హుజూరాబాద్ ప్రజలకే అంకితం చేస్తున్నానన్నారు. చచ్చేవరకూ మీతోనే ఉంటానని హుజూరాబాద్ ప్రజల నుద్దేశించి మాట్లాడారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?