Erich Maria Quotes:జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత చెప్పిన జీవిత ర‌హ‌స్య స‌త్యాలు

Erich Maria Quotes: జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత చెప్పిన జీవిత ర‌హ‌స్య స‌త్యాలు కింద ఇవ్వ‌బ‌డినాయి. ఒక మ‌గ వ్య‌క్తికి, ఆడ వ్య‌క్తికి సంబంధించిన అన్ని నిత్య స‌త్యాల‌ను ఇక్క‌డ ఎరిచ్ మారియా (Erich Maria Quotes) తెలిపిన‌వి ఇచ్చాము. నిజంగా ఇవి మ‌న నిజ‌జీవితంలో జ‌రిగిన‌, జ‌ర‌గ‌బోయే నిత్య స‌త్యాల‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తి కొటేష‌న్ మ‌న జీవితానికి అనుక‌రించుకుంటే భ‌విష్య‌త్తు లో మ‌నం ఎలా ఉండాలో, ఉండ‌కూడ‌దో నిర్ణ‌యించుకోవ‌డానికి దోహ‌దం చేస్తాయి.

Erich Maria Quotes: జీవిత ర‌హ‌స్య స‌త్యాలు

ఒక స్త్రీ మ‌రొక పురుషునికి చెందిన‌ది అయితే,
నువ్వు సుల‌భంగా పొంద‌గ‌లిగే దానికంటే
ఆమె ఐదు రెట్లు ఎక్కువుగా కావాల‌నిపిస్తుంది.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

నీకు ఏది జ‌రిగినా,
వ్య‌క్తిగ‌తంగా తీసుకోకు.
ఈ ప్ర‌పంచంలో ఏదీ
అంత ముఖ్య‌మైన‌ది కాదు.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

ఒక పూర్తి వెధ‌వ మాత్ర‌మే
ఆడ‌దానికితో వాదించి
ఆమె కార‌ణాన్ని అడుగుతాడు.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

ఒక‌రితో క‌లిసి
ముస‌లి వాడివి కావాల‌నుకున్న‌ప్పుడే
నువ్వు ప్రేమ‌లో ఉన్న‌ట్టు.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

ప్ర‌తి ఒక్క‌రూ క‌నీసం ఒక్క‌సారైనా
ఎవ‌రినో కాపాడి ఉంటారు.
అలాగే క‌నీసం ఒక్క‌సారైనా
ఎవ‌రినో చంపి ఉంటారు.
అది వారికి తెలియ‌క‌పోయి ఉండ‌వ‌చ్చు అంతే.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

ఒక ఆడ‌ది కోపంగా ఉంది అంటే,
ఆమె త‌ప్పు చేసేసి
తెలియ‌న‌ట్టు న‌టిస్తుంది అని అర్థం.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

ఒక ఆడ‌ది ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు
ఆమె తెలివిగా మారుతుంది,
కానీ మ‌గాడు తెలివి కోల్పోతాడు.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

ఒక్క లోప‌మైన లేని మ‌నిషి
నీకు బ‌య‌ట దొర‌క‌డు.
అలా ఉంటే వాళ్లు ఇక్క‌డ కాదు
మ్యూజియంలో ఉండాలి.

Erich Maria Quotes

న‌మ్ర‌త‌కు మ‌రియు మ‌న‌స్సాక్షికి ప్ర‌తిఫ‌లం
కేవ‌లం న‌వ‌ల‌ల్లో మాత్ర‌మే ల‌భిస్తుంది.
నిజ జీవితంలో వాటిని వాడుకొని
ప‌క్క‌న ప‌డేస్తారు.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

డ‌బ్బుతో ప‌రిష్క‌రించ‌గ‌లది
ఏదైనా చౌకే.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

క‌ల‌లు ఉండ‌టం మ‌న‌కు అవ‌స‌ర‌మే.
ఎందుకంటే అవి లేకుండా
మ‌నం నిజాన్ని భ‌రించ‌లేము.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

ఉద‌యాన్నే నువ్వు ఆలోచించే మొద‌టి వ్య‌క్తి
మ‌రియు రాత్రి నువ్వు ఆలోచించే చివ‌రి వ్య‌క్తి
నీ ఆనందానికి లేదా బాధ‌కు
కార‌ణం అవుతారు.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

స‌ర‌ళ‌మైన ప‌నిని సంక్లిష్టంగా చేయ‌కు.
ఇది జీవితంలోని అత్యంత‌
ముఖ్య‌మైన ర‌హ‌స్యాల‌లో ఒక‌టి.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

మ‌న భావాల‌ను చూప‌కుండా ఉండేందుకు
మ‌నం విష‌యాల‌ను ఎంత క్లిష్టంగా మార్చేస్తామో
నిజంగా విచిత్రం!.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

ఒక వ్య‌క్తి దూర‌మైన త‌రువాతే
విలువింప‌బ‌డుతాడు.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

నువ్వు పొంద‌లేనిది ఎల్ల‌ప్పుడూ
నీ వ‌ద్ద ఉన్న‌దాని కంటే
మెరుగ్గా క‌నిపిస్తుంది.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

చాలా మంది ఆడ‌వాళ్ల‌తో గ‌డిపిన నాడు
ఆడ‌దాన్ని తెలుసుకుంటాడు.
ఒకే భార్య ఉన్న‌వాడు
ప్రేమ‌ను తెలుసుకుంటాడు.

Erich Maria Quotes

ఎదురుగా ఉన్న శ‌త్రువు కంటే
వెనుక ఉన్న స్నేహితుడితో
జాగ్ర‌త్త‌గా ఉండు.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

30 ఏళ్ల‌కి మ‌గాడికి ఇంకా
పెళ్లి కాలేదు అంటే,
అత‌న్ని ఇంకా చేసుకోమ‌ని ఎవ‌రూ
బ‌ల‌వంతం చేయ‌లేద‌ని అర్థం.
మ‌గాడు వాడికి కావాల‌ని పెళ్లి చేసుకోడు.
ఆడ‌ది కావాలంటుంది కాబ‌ట్టి
చేసుకోవాల్సి వ‌స్తుంది.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

ప్రేమ‌ను స్నేహంతో
క‌లుషితం చేయ‌కూడ‌దు.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

దేనినైనా కొంచెం దూరంగానే ఉంచు.
ద‌గ్గ‌రికి రానిస్తే,
దాన్ని ప‌ట్టుకోవాల‌నుకుంటావు.
కానీ మ‌నిషి ప‌ట్టుకోగ‌లిగేది ఏదీ లేదు.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

ఒక స్త్రీని కోల్పోవ‌డానికి
ఉత్త‌మ మార్గం ఏమిటంటే,
ఆమెకు కొన్ని రోజులు మాత్ర‌మే అందించ‌గ‌లిగే
జీవితాన్ని ఆమెకు చూపించ‌డం.

Erich Maria Quotes

కాంతి వెలుగులో కాదు,
చీక‌టిలో ప్రకాశిస్తుంది.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

భ‌విష్య‌త్తు గురించి ఆలోచించే వాడికి,
త‌న వ‌ర్త‌మానాన్ని ఎలా ఎదుర్కోవాలో
తెలియ‌దు.

ఎరిచ్ మారియా (జ‌ర్మ‌న్ న‌వ‌లా ర‌చ‌యిత‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *