Engineering Student Murdered

Engineering Student Murdered:ఎట్ట‌కేల‌కు నిందితుడు దొరికాడు..పోలీసుల‌ను చూసి బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మ‌హ‌త్య‌య‌త్నంకు ప్ర‌య‌త్నం!

Spread the love

Engineering Student Murdered:గుంటూరులో బి.టెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసులో నిందితున్ని అరెస్టు చేసిన‌ట్టు డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ అన్నారు. హ‌త్య జ‌రిగిన 24 గంట‌ల్లోపే గుంటూరు అర్బ‌న్ పోలీసులు వేగంగా స్పందించి కేసును చేధించార‌ని తెలిపారు. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించామ‌ని తెలిపారు. ఈ కేసు ద‌ర్యాప్తులో స్థానికులు అత్యంత కీల‌క స‌మాచారాన్ని పోలీసుల‌కు అందించార‌న్నారు. హ‌త్య‌కు పాల్ప‌డిన యువ‌కుడిని గుంటూరు అర్బ‌న్ పోలీసులు అదుపులోకి తీసుక‌న్నారు. నిందితుడ్ని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని తెలిపారు.

సోష‌ల్ మీడియా ప‌రిచ‌యాల ప‌ట్ల యువ‌త అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని డీజీపీ సూచించారు. యువ‌తులు, మ‌హిళ‌ల‌పై దాడుల‌కు య‌త్నిస్తే క‌ఠిన శిక్ష‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. జ‌రిగిన ప్ర‌తి సంఘ‌ట‌న‌ను రాజ‌కీయ కోణంలో చూడ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. స‌మాజంలో జ‌రుగుతున్న వికృత పోక‌డ‌ల‌ను స‌మిష్టిగా ఎదుర్కోవాల‌ని తెలిపారు. ఘ‌ట‌న జ‌రిగిన త‌క్ష‌ణం వేగంగా స్పందించి కేసును చేధించిన గుంటూరు అర్బ‌న్ పోలీసుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఇన్వెస్టిగేష‌న్ త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసి నిందితుడ్ని స‌త్వ‌రం క‌ఠిన శిక్ష ప‌డేలా చూడాల‌ని ఆదేశాలు జారీ చేశామ‌న్నారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ మా ప్ర‌థ‌మ క‌ర్త‌వ్య‌మ‌ని ఇందుకోస‌మై అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తామ‌ని డీజీపీ పేర్కొన్నారు.

ర‌మ్య హ‌త్య ఘ‌ట‌న అత్యంత బాధాక‌రం: హోం మంత్రి

బీటెక్ విద్యార్థి(Engineering Student Murdered)ని ర‌మ్య హ‌త్య ఘ‌ట‌న అత్యంత బాధాక‌ర‌మ‌ని ఏపీ హోం శాఖ మంత్రి మేక‌తోటి సుచ‌రిత అన్నారు. మీడియాతో మాట్లాడుతూ… గుంటూరు జిజిహెచ్‌లో ర‌మ్య మృత‌దేహాన్ని ప‌రిశీలించామ‌ని అన్నారు. ఇప్ప‌టికే నిందితుడుని అదుపులోకి తీసుకున్న‌మాని తెలిపారు. మ‌హిళ‌ల‌ను చంపే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని, ఏదైనా స‌మ‌స్య‌లు ఉంటే మాట్లాడి ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు. ఉన్మాదుల్లా హ‌త్య చేయ‌డం అత్యంత దారుణ‌మ‌న్నారు. చ‌ట్టాలు ఎంత క‌ఠినంగా ఉన్నా ఉన్మాదంతో దారుణాల‌కు తెగ‌బ‌డుతున్న ఇలాంటి వాళ్ల‌ను ఏ విధంగా శిక్షించాలో, ఉరిశిక్షే స‌రైన శిక్ష‌లా అనిపిస్తోంద‌ని పేర్కొన్నారు. ఈ సంఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశార‌న్నారు.

కాగా బీటెక్ విద్యార్థిని న‌ల్ల‌పు ర‌మ్యశ్రీ ని కిరాత‌కంగా క‌త్తితో పొడిచి చంపిన నిందితుడు న‌ర‌స‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం ప‌మిడిపాడు గ్రామంలో ఉన్న‌ట్టు స‌మాచారం పోలీసులకు అందింది. అక్క‌డికి హుటాహుటిన పోలీసులు వెళ్ల‌డంతో వారిని గ‌మ‌నించిన శ‌శికృష్ణ వెంట‌నే త‌న దెగ్గ‌ర బ్లేడుతో గొంతు, చేయి కోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు చేసుకోబోయాడు. హుటాహుటిన పోలీసులు ద‌గ్గ‌ర‌లో ఉన్న న‌ర‌స‌రావుపేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. శ‌శికృష్ణ మెడ‌కు నాలుగు గాట్లు ప‌డ‌గా, చేతికి స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం గుంటూరు త‌ర‌లించారు.

Kurnool News: కర్నూల్ జిల్లాలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం

Kurnool News: క‌ర్నూల్ జిల్లా కౌతాళం మండ‌ల ప‌రిధిలోని కామవ‌రం గ్రామంలో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఓ భూవివాదంలో వైసీపీ, బిజేపీ వ‌ర్గీయులు ప‌ర‌స్ప‌రం దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. Read more

Thota Chandraiah Murder: ఏక‌ద‌శి రోజున‌ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ర‌క్తంతో ఎగిసిప‌డ్డ వేట‌కొడ‌వ‌ళ్లు!

Thota Chandraiah Murder: మాచ‌ర్ల: పండుగ వేళ ఏపీలో రాజ‌కీయ హ‌త్య చోటు చేసుకోవ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. గుంటూరు జిల్లాలోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి నేత Read more

teacher murderd: క‌దిరిలో బ‌రితెగించిన దొంగ‌లు..ఉపాధ్యాయురాలు హ‌త్య‌

teacher murderd: అనంత‌పురం: క‌దిరిలో దొంగ‌ల బీభ‌త్సం అక్క‌డ ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. ఓ ఇంట్లోకి ప్ర‌వేశించి ఓ ఉపాధ్యాయురాల‌ని చంపారు దుండ‌గులు. క‌దిరి ప‌ట్ట‌ణంలోని మంగ‌ళ‌వారం Read more

BTech Student Murdered: బైక్ ఎక్క‌నందుకే పొడిచి చంపాడా? న‌డిరోడ్డుపై బీటెక్ విద్యార్థిని హ‌త్య‌!

BTech Student Murdered: గుంటూరు: న‌గ‌రంలోని బీటెక్ విద్యార్థిని ర‌మ్య దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం ఇప్పుడు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. కాకాని రోడ్డులోని ప‌రామ‌య‌కుంట వ‌ద్ద Read more

Leave a Comment

Your email address will not be published.