Endometrial Cancer Symptoms: స్త్రీలలో గర్భసంచి ముఖద్వారం సంబంధించిన క్యాన్సర్, ఒవేరియన్ (ovarian) క్యాన్సర్ తర్వాత ఎక్కువుగా కనిపించేంది గర్భాశయ క్యాన్సర్. దీనినే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని కూడా అంటారు. గర్భసంచిలో ఒక పొరమాదిరిగా ఉండి గర్భం దాల్చనప్పుడు మందంగా తయారైతుంది. గర్భం ధరించకపోతే నెలసరిలో స్రవించబడేదే ఎండోమెట్రియం. సగటున ఎండోమెట్రియం 6-7 మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది. మనోపాజ్ దశలో ఎంటోమెట్రియం పలుచగా మారుతుంది. గర్భధారణ సమయంలో మందంగా తయారయ్యే ఎండోమెట్రియం (Endometrial Cancer) ద్వారానే పిండానికి పోషకాలు, ఆక్సిజన్ అందుతాయి.
ఎండో మెట్రియం ఉండాల్సిన దానికంటే ఎక్కువ మందంగా ఉండటం లేదా పలుచగా మారడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఫైబ్రాయిడ్, సిస్ట్, ఎండోమెట్రియాసిస్, ఎండోమెట్రియక్ క్యాన్సర్ (Endometrial Cancer Symptoms) వంటి సమస్యలు తలెత్తుతాయి.
Endometrial Cancer: కారణాలు ఇవే
ఈస్ట్రోజన్ లెవెల్స్‌లో అసమానతలు చాలా కాలంగా ఉన్నవారిలో, సంతానం లేని వారిలో, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వారిలో, అధిక బరువు ఉన్న మహిళల్లో, మెనోపాజ్ దశకు ఆలస్యంగా చేరుకునేవారిలో ఎండోమెట్రిల్ క్యాన్సర్ ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంటుంది.
లక్షణాలు ఇవే
అధికంగా పెరిగిన ఎండోమెట్రియం వల్ల పొత్తికడుపులో నొప్పి వస్తుంది. మూత్రం అదుపులో లేకపోవడం,
అజీర్తీ, అలసట, కలయికలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎండోమెట్రియాసిస్ ఉన్న వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. అంతేకాకుండా నాన్‌హడ్ కిన్స్‌లింఫోమా, పిట్యూటరీ, థైరాయిడ్ గ్రంథి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తక్కువుగా ఉంటుంది. కాబట్టి ఎండోమెట్రియాసిస్‌తో బాధపడేవారు ఈ విషయాలపై అవగాహన పెంచుకోవాలి.
ఎండోమెట్రియల్ పైబ్రాయిడ్స్ లేదా యుటరైన్ ఫైబ్రాయిడ్స్ చిన్నగా చాలా మందిలో ఉంటాయి. వీటి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇవి పెద్దగా మారితే పొత్తి కడుపు బరువుగా ఉండటం, నెలసరిలో రక్తస్రావం ఎక్కువుగా కావడం, మూత్రం అదుపులో లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. చాలా వరకు మందులతో సమస్య పరిష్కారం అవుతుంది. కొంత మందిలో సర్జరీ అవసరం కావచ్చు.


ఎండోమెట్రియాసిస్, యుటరైసిసిస్ట్, ఫైబ్రాయిడ్, గర్భసంచి క్యాన్సర్ లక్షణాలు ఒకేలా ఉంటాయి. అంతే కాకుండా గర్భసంచికి సంబంధించిన ఈ సమస్యలు తలెత్తడానికి కూడా కారణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకేలా ఉంటాయి. అందుకనే పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. నెలసరి మధ్యలో రక్తస్రావం కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకూడదు.