employee biometric attendance | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యుల విషయంలో కీలక నిర్ణయం ఒకటి తీసుకుంది. అది ఏమిటంటే ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే వైద్యులు తదితర సిబ్బంది బయోమిట్రిక్ హాజరు విధానాన్ని పాటించాలని నిర్ణయించింది. ఈ విధానం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు అవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఈ నిర్ణయంపై ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యుల విషయంలో కీలక నిర్ణయం ఒకటి తీసుకుంది. అది ఏమిటంటే ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే వైద్యులు తదితర సిబ్బంది బయోమిట్రిక్ హాజరు విధానాన్ని పాటించాలని నిర్ణయించింది. ఈ విధానం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు అవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఈ నిర్ణయంపై ఆదేశాలు(employee biometric attendance) కూడా జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరు(biometric attendance)ను ప్రతి ఒక్క ప్రభుత్వ వైద్యుడు, సిబ్బంది పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధానం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా, బోధన, ప్రాంతీయ ఆస్పత్రుల్లో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అంతే కాకుండా బయోమెట్రిక్ హాజరు అమలు పటిష్టంగా జరిగేందుకు ఆస్పత్రుల్లో సీసీ టీవీలను ఏర్పాటు చేసింది. ఆస్పత్రుల్లో డ్యూటీకి వచ్చి పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తే సెలవుల్లో కోత ఉంటుందని జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతోనే!
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది విధి విధానాలు పాటించడం లేదని, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో ఎవ్వరూ అందుబాటులో ఉండటం లేదని ప్రజల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు ఎక్కువుగా అందుతున్నాయట. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం డాక్టర్లతో పాటు సిబ్బంది డ్యూటీ సమయంలో ఆస్పత్రుల్లో ఉండకుండా సొంత పనులపై బయట తిరుగుతున్నారని తెలుసుకొని ఈ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఇక వైద్య సిబ్బందికి ఈ బయోమెట్రిక్ హాజరు విధానం కాస్త ఇబ్బంది కరంగా ఉన్నట్టు వస్తున్న నేపథ్యంతో తాజాగా ఆస్పత్రిలో ఉన్నామని గంట గంటకూ సెల్ఫీ తీసి సంబంధిత వెబ్సైట్ లో ఫొటోలు అప్లోడ్ చేయాలని ఆరోగ్య శాఖ కమిషనర్ కంఠమనేని భాస్కర్ ఇచ్చిన ఆదేశాలతో వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ఈ బయోమెట్రిక్ విధానంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని కొందరు పేర్కొంటుండగా, వైద్యులకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ