emotional control tips : ఆడ‌వారి బాధ‌ల‌కు అర్థాలే వేరులే..కానీ త‌ప్ప‌దు మ‌రి!

emotional control tips ఇంటిప‌నీ…వంట‌ప‌నీ..పిల్ల‌ల పెంప‌కం, కుటుంబ స‌భ్యులంద‌రి అవ‌స‌రాలు తీర్చ‌డం..ఇంట్లో ప‌నివాళ్ల‌తో స‌మ‌న్వయం… ఇలాంటివ‌న్నీ మ‌హిళ‌ల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తుంటాయి. ఇన్ని ర‌కాల ప‌నుల‌తో ఉక్కిరిబిక్కిరైపోతూ అప్పుడ‌ప్పుడూ స‌హ‌నం కోల్పోవ‌డం స‌హ‌జం. కోపం పొంగుకొస్తుంది. కొన్నిసార్లునియంత్రించుకోలేక మ‌హిళ‌లు ఏడ్చేస్తుంటారు. కోపం అలా హ‌ద్దులు దాట‌కుడ‌దంటే ఏం చేయాలో ఈ క్రింది విధంగా (emotional control tips)తెలుసుకోండి.

ఆక‌లిగా అనిపించిన‌ప్పుడు ప‌నుల ఒత్తిడిలో ప‌డ‌కండి. ఆక‌లి ఆవేశాన్ని పెంచుతుంద‌ని అమెరికాకు చెందిన ఓ తాజా అధ్య‌య‌నం చెబుతుంది. ఇందు వ‌ల్ల ర‌క్తంలోని చ‌క్కెర స్థాయులు మ‌రింత త‌గ్గి ఆరోగ్యానికి హాని జ‌ర‌గొచ్చు.

నిద్ర‌లేమి కూడా అస‌హ‌నాన్ని పెంచుతుంది. రోజులో క‌నీసం ఏడెనిమిది గంట‌ల పాటు హాయిగా నిద్ర‌పోతే… చిన్న విష‌యానికే భావోద్వేగాల‌పై (emotional control tips) నియంత్ర‌ణ కోల్పోరు. చ‌క్క‌ని నిద్ర‌తో సేద‌తీరిన మ‌న‌సు ఎక్కువ సంయ‌మ‌నంతో ఉంటుంది. ఎన్ని ప‌నులున్నా నిద్ర‌కు నిర్ణీత వేళ‌లు ఉండితీరాల్సిందే.

ఇబ్బందులు అన్ని చోట్లా ఉంటాయి. వాటిని సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాలే త‌ప్ప‌.. కోపంతో ఊగిపోతే ఏ ఉప‌యోగం ఉండ‌దు. ఎదుటివారి ప్ర‌వ‌ర్త‌న‌, మీరున్న ప‌రిస్థితుల్లో ఏ అంశ‌మైనా మీకు కోసం తెప్పించ‌డానికి కార‌ణం కావ‌చ్చు. ప్ర‌తిదీ మీరు కోరుకున్న‌ట్టు ప‌రిపూర్ణంగా ఉండ‌క‌పోవ‌చ్చు. దాన్ని మార్చాల‌ని మీరు ఒత్తిడికి గురికావ‌డం, ఆందోళ‌న చెంద‌డం కంటే అక్క‌డి నుంచి కాసేపు బ‌య‌టికి వెళ్ల‌డం మంచింది. కోపం అదుపులోకి వ‌స్తుంది.

న‌చ్చ‌ని విష‌యం జ‌రిగిన‌ప్పుడు మ‌న‌సు గ‌జిబిజిగా త‌యార‌య్యేవాళ్లూ ఉంటారు. ఈ త‌ర‌హా మ‌న‌స్త‌త్వం ఉన్న‌వారికి ధ్యానం ఎంతో మేలు చేస్తుంది. ఉద‌యాన్నే లేచి దీర్ఘంగా గాలిపీల్చుకుని నోటితో వ‌ద‌లాలి. ఇలా ప‌దిసార్లు చేస్తే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి.

న‌డ‌క కూడా తీవ్ర భావోద్వేగాల‌ను అదుపుచేస్తుంద‌ని ఎన్నో ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. కుదిరితే రోజు క‌నీసం రెండు కిలోమీట‌ర్ల‌యినా న‌డ‌వండి. ప్ర‌తి రోజూ ఇలా చేసినా మీ మ‌న‌సుపై చ‌క్క‌టి అదుపాజ్ఞ‌లు ఉంటాయంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.

Share link

Leave a Comment