Email Marketing | కస్టమర్స్ నుండి ఈమెయిల్స్ సేకరించి మీ యొక్క ప్రొడక్ట్స్‌ను ఈమెయిల్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవడాన్నే ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. మీరు కస్టమర్స్ నుండి ఈమెయిల్స్ సేకరించే ముందు వాళ్లకు ఉపయోగపడే మంచి కంటెంట్‌ను, ఇన్ఫర్మెషన్ ఫ్రీగా ఇవ్వాలి. వారికి మీ వెబ్సైట్ లేదా బ్లాగ్ ద్వారా ఉపయోగపడే ఫ్రీ కంటెంట్‌ను ప్రతి రోజూ షేర్(share) చేయాలి. అంతేకాకుండా ఒక సమాచారంపై ఈ-బుక్(e book)ను తయారు చేసి వారికి పంపించాలి. అదే విధంగా ఏదైనా ఫ్రీ కోర్సు వీడియోను తయారు చేసి వారికి ఇవ్వాలి. అలా ఇస్తే కచ్చితంగా వారు మీకు ఈమెయిల్ ఐడిని ఇవ్వడానికి ఇష్టపడతారు. ఇలా కస్టమర్ల నుండి ఈమెయిల్స్(Email Marketing) సేకరించిన తర్వాత నుంచి మీ యొక్క పెయిడ్ ప్రొడక్ట్స్‌ను వాళ్ల ఈమెయిల్స్‌కు సెండ్ చేయవచ్చు.
కొంత మంది యూట్యూబర్స్కు వారి ఛానెళ్ళకు 10 వేల మంది సబ్స్క్రైబర్స్ ఉండవచ్చు లేదా 20 వేల మంది సబ్స్క్రైబర్స్ ఉండవచ్చు. అయితే ఆ సబ్స్క్రైబర్స్ అంతా ఆర్గానిక్ అని చెప్పలేము. కాబట్టి మీరు వీడియో చేసే ముందే ఇలా ఈమెయిల్స్‌ను కలెక్ట్ చేసుకొని వారికి వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన తర్వాత వారికి సెండ్ చేస్తే చాలా వరకు మీకు వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. మీ ఛానెల్‌కు ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. బిజినెస్ చేసే వారికి ఈమెయిల్ మార్కెటింగ్‌పై అవగాహన కలిగి ఉంటే కచ్చితంగా మీ ప్రొడక్ట్స్‌ను సేల్స్ చేసుకోవచ్చు. మంచి ఆదాయం పొందవచ్చు. మీ దగ్గర ఉన్న ఈమెయిల్స్ కు కేవలం పెయిడ్ ప్రొడక్ట్స్ మాత్రమే సెండ్ చేయకుండా అప్పుడప్పుడు ఫ్రీ ప్రొడక్ట్స్(products), ఏమైనా ఉపయోగపడే టిప్స్ కూడా సెండ్ చేస్తూ ఉండాలి.
ఈమెయిల్ ఆటోమేషన్ అంటే ఏమిటి?
మీ దగ్గర ఉన్న ఈమెయిల్స్ కస్టమర్లకు మీరు మోటివేటర్‌గా ఉండాలి. ఒకేసారి ఈమెయిల్స్ అన్నింటికీ ఆటోమెటిక్ షేరింగ్ ద్వారా మీ ప్రొడక్ట్స్‌ను సెండ్ చేయవచ్చు. ఒక యూజర్ మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత అతనికి వరుసగా 10 రోజులు పాటు ప్రొడక్ట్స్‌ను సెండ్ చేయవచ్చు. ఆ యూజర్ మీ ఈమెయిల్ మార్కెటింగ్‌కు సైన్ ఇన్ అవుతారో అప్పటి నుండి ఆటో మెటిక్ గా రోజుకో ఈమెయిల్ ఆ యూజర్‌కు సెండ్ చేయవచ్చు. దీనినే ఈమెయిల్ ఆటోమేషన్ అంటారు. మీ ప్రొడక్ట్‌ను ఒక యూజర్ కొనుగోలు చేస్తే అతను మీ కస్టమర్ లిస్టులో యాడ్ చేసుకోవచ్చు. 10 రోజులు అయినా కూడా ఆ యూజర్ మీ ప్రొడక్ట్ కొనుగోలు చేయకపోతే అతన్ని ప్రత్యేక ఎడ్యుకేట్ లిస్టులో యాడ్ చేసి ఆ యూజర్‌కు మీ ప్రొడక్ట్ గురించి ఎడ్యుకేట్ చేస్తూ ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రొడక్ట్ గురించి యూజర్‌కు వివరించడం అయిన తర్వాత మళ్లీ ప్రొడక్ట్‌ను ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రతి యూజర్‌ను అశ్రద్ధ చేయకుండా మన ప్రొడక్ట్ కొనే వరకు వారిని మోటివేట్ చేస్తూ ఉండాలి.
ఈ విధంగా ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మీ బిజినెస్‌ను అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఈమెయిల్ మార్కెటింగ్ నుంచి స్పీడుగా రిజల్టు వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా ద్వారా ఒక ప్రొడక్టను సేల్స్ చేయాలంటే ప్రత్యేకంగా వారికి చెప్పలేము. కానీ ఈమెయిల్ ద్వారా అయితే ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఒక పోస్టు ద్వారా మీ ప్రొడక్ట్ గురించి వివరించవచ్చు, సేల్స్ కూడా చేయవచ్చు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి