Elon Musk Memes | ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫ్లామ్ ట్విట్టర్‌ను కొన్న ఎలన్ మస్క్‌పై ట్విట్టర్‌లో ఖాతాదారులు తమ మద్దతను విచిత్ర మీమ్స్‌తో ఫన్నీగా అభినందనలు తెలుపుతున్నారు. మరికొందరు ఎలన్ మాస్క్ ఫేస్ పెట్టి ట్విట్టర్‌లో వందల కొలది మీమ్స్‌ను తయారు చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. ట్విట్టర్‌పై కన్నేసిన ప్రముఖ Tesla కంపెనీ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎన్ మస్క్ ఎట్టకేలకు సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ సంస్థను మస్క్ రూ.44 బిలియన్ల డాలర్లతో కొనుగోలు చేశాడు.
ఇప్పుడు ట్విట్టర్ మస్క్ సొంత అయ్యింది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా పొలిటికల్ లీడర్లు, ప్రముఖ సెలబ్రిటీలు ఎలన్ మస్క్(Elon Musk Memes)ను పొగడ్తతో ముంచెతున్నారు. ఇదిలా ఉండగా అమెరికా మాజీ ప్రెసిడెంట్ Donald Trump ట్విటర్ Account ఇప్పటి వరకు హోల్డ్‌లో ఉండిపోయింది. ఎప్పుడైతే ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాడో అప్పటి నుంచి నెటిజన్లు ఎలన్‌పైనా, ట్రంప్ పైన విచిత్రగా మీమ్స్ పెడుతున్నారు. ఇందులో ‘How did you get my twitter account back?’ అని ట్రంప్ అడిగినట్టు అందుకు ‘I bought Twitter‘ అని సమాధానం మస్క్ ఇచ్చినట్టు మీమ్స్ పెడుతున్నారు.


ట్విట్టర్ ను కొన్న ఎలన్ ఇప్పుడు అమోజన్‌ను కూడా కొనుగోలు చేస్తాడేమో? అని Memes పెడుతున్నారు. వెంటనే ఎలన్ తన ఫొన్ ఒపెన్ చేసి Amozon ఖాతాలోకి వెళ్లి cart యాడ్ చేసినట్టు ఫన్నీ మీమ్స్ అప్‌లోడ్ చేస్తున్నారు. కొంత మంది ఇక ట్విట్టర్ Logoను మార్చి దానికి ఎలన్ మస్క్ face యాడ్ చేసి పెడుతు న్నారు. ఇప్పుడు ట్విట్టర్ ఖాతాలో అన్నీ కూడా #elonmusk hashtagతో నిండిపోయింది. అయితే ట్విట్టర్ ను కొన్న మస్క్ వెంటనే ఒక ట్విట్ చేశాడు. ఇక నుంచి కొత్త Future Applicationsతో రాబోతుందని, ఇందులో ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ఉంటుందని ట్వీట్ చేశాడు.అదే క్రమంలో తనను విమర్శించే వారిని కూడా గుర్తు చేసుకుంటూ వారికి కూడా ట్విట్టర్ అకౌంట్‌లో భావ స్వేచ్ఛ ఉందని ట్వీట్ చేశారు.


ఇక ఇండియా విషయానికి వస్తే Kangana Ranaut ట్విట్టర్ అకౌంట్ గురించి చర్చలు జరుపుతున్నారు. ఇక కంగనా అకౌంట్ కూడా ఓపెన్ కావొచ్చనే ఊహాగానాలు చేస్తున్నారు. మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసే ఆలోచన ఇప్పటిది కాదంట. అతనికి 2017 లోనే ఈ ఆలోచన వచ్చినట్టు ఒక నెటిజన్ తన ఖాతాలో వివరించాడు. ఆ సందర్భంలో మస్క్ తో తాను ట్వీట్ చేసి ట్విట్టర్ ను కొంటారా? అని ప్రశ్నించగా మస్క్ ఎంత ధర అవుతుందని బదులిచ్చినట్టు స్క్రీన్ షాట్ ఒకటి viral అవుతోంది. ఇక నుంచి ట్విట్టర్ అకౌంట్‌లో పాత నిబంధనలు కొనసాగుతాయా? లేదా ఎవరు ఇష్టమొచ్చినట్టు వారు ట్విట్టర్‌ను వాడవచ్చా? అనేది ముందుముందు ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇక నుండి ట్విట్టర్‌కు మస్క్ ఓనర్ కదా!







