Elephant : ఒంటరి ఏనుగు మృతి

By | May 24, 2021

Elephant : గుంపు నుంచి త‌ప్పించుకొని వ‌చ్చిన ఓ ఒంట‌రి ఏనుగు విద్యుద్ఘాతంతో మృతి చెందింది. ఈ సంఘ‌ట‌న చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అట‌వీ శాఖ అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే ఏనుగు మృతి చెందింద‌ని రైతులు ఆరోపిస్తున్నారు.


Elephant : చిత్తూరు : విద్యుదాఘాతంతో ఒంట‌రి ఏనుగు మృతి చెందిన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా నారాయ‌ణ మండ‌లం అర‌ణ్యం కండ్రిగ పంచాయ‌తీలో చోటు చేసుకుంది. గ‌త 15 రోజులుగా మండ‌లంలోని తుంబురు అర‌ణ్యం కండ్రిగ పాల‌మంగ‌ళం ఉత్త‌రం పంచాయ‌తీలో హ‌ల్ చ‌ల్ చేస్తూ పంట పొలాల‌ను నాశ‌నం చేస్తూ ధ్వంసం చేసిన ఒంట‌రి ఏనుగు శ‌నివారం సుబ్బా నాయుడు కండ్రిగ పంట పొలాల్లో విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. పంట పొలం వ‌ద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మ‌ర్ తీగ‌లు త‌గ‌ల‌డం వ‌ల్ల ఏనుగు మృతి చెందింద‌ని స్థానిక రైతులు తెలిపారు. గ‌త మూడు నాలుగు నెలల ముందు దిగువ క‌న‌కం పాల్యం మిట్ట‌, బొబ్బ‌రాజుపాలెం, కైలాస‌కోన త‌దిత‌ర ప్రాంతాల్లో ఏనుగులు వ‌రి, చెరుకు, అరటి తోట‌ల‌ను ధ్వంసం చేసి తీవ్ర న‌ష్టం క‌లిగించినా త‌మ‌కు ఏమీ తెలియ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన‌ పుత్తూరు అట‌వీశాఖ అధికారులు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉండ‌టంతో పాటు నిర్ల‌క్ష్యం చేయ‌డంతోనే ఒంట‌రి ఏనుగు ప్రాణం కోల్పోయింద‌ని రైతులు ఆరోపిస్తున్నారు. మండ‌లంలోని రైతుల పొలాల్లో పంట‌ల‌ను ధ్వంసం చేస్తున్నా చూసి చూడ‌న‌ట్టు ఉండ‌టంతోనే రైతుల‌కు తీవ్ర న‌ష్టం క‌ల‌గ‌డంతో పాటు ఏనుగు మృతికి అట‌వీ శాఖ అధికారులు కార‌ణం అని రైతులు, మ‌హిళ‌లు మండిప‌డుతున్నారు. జిల్లా ఉన్న‌తాధికారులు పుత్తూరు అట‌వీశాఖ అధికారుల‌పై విచార‌ణ జ‌రిపించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రైతులు, ప్ర‌జ‌లు కోరుతున్నారు.

చ‌ద‌వండి :  Rajamahendravaram: Rowdy sheeter brutally murdered in Rajamahendravaram :రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో  రౌడీ షీట‌ర్ దారుణ హ‌త్య‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *