Electric Rice Cooker | ఇటీవల ఎక్కువ మంది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లోనే అన్నం వండుతున్నారు. ఒకప్పుడు పట్టణంలో ఉన్న ఈ అలవాటు ఇప్పుడు పల్లెలకు కూడా తాకింది. అయితే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్(Electric Rice Cooker)లో వండిన ఆహారం తింటే అనర్థాలు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు.
వంటలో అల్యూమినియం పాత్రలు వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తినడం వల్ల అతి చిన్న వయసులోనే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. Electric Rice Cooker పాత్ర Toxin మెటల్‌తో తయారవుతుంది. ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు కనుమరుగవుతాయి. నాన్ సిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దని వైద్యు నిపుణులు చెబుతున్నారు.
నాన్ స్టిక్ వస్తువులను వినియోగించి వంట చేసే సమయంలో అందులోంచి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్‌కు దారి తీస్తాయి. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌ను వాడకపోవడం మంచిది. రాగి సంకటి, రాగి జావ, జొన్న రొట్టెలు, కొర్రలతో అల్పాహారం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్నం త్వరగా వండాలనుకున్నప్పుడు Pressure Cookerలో వండితే ఆరోగ్యానికి మేలు.
కరెంట్ ఆధారంగా ఉడికిన ఆహారం తీసుకోకపోవడమే మంచిది. మట్టి పాత్రలు, లేదా Steel పాత్రల్లో అన్నం ఉడికించుకుని తీసుకోవడం మేలు. మట్టిపాత్రల్లో అన్నం ఉడికించడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచిని ఇస్తాయి. ప్రెజర్ కుక్కర్‌లో అన్నం ఉడికించడం వల్ల పోషకాలు ఆవిరి రూపంలో కరిగిపోకుండా ఉంటాయి.


వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వల్ల సమయం కలిసి వస్తుందని అందరూ దీనిని ఇష్టపడతారు. సులువుగా వంట అయిపోతుందని కూడా భావిస్తారు. సమయం కలిసి వస్తుంది, వంట కూడా సులువుగా అయిపోతుంది. ఇది సరే కానీ తక్కువ కాలంలోనే మనకు ప్రాణపాయం కూడా తెచ్చిపెడుతుంది ఈ పరికరం. ఇది విద్యుత్ ప్రసరణ వల్ల వచ్చే ఉష్ణోగ్రతపై ఆధారపడి పని చేస్తుంది. ఇది శరీరానికి అంత మంచిది కాదు. ఇప్పటికే మనం ఉపయోగించే Android Phones వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనికి తోడు ఇలా ఆహారం కూడా ఇలాంటి ఎలక్ట్రిక్ పరికరాలను వాడితే ఇబ్బందులు కొని తెచ్చుకున్నవారమవుతాము. కాబట్టి సాధ్యమైనంత వరకు పొయ్యి మీద, ప్రెజర్ కుక్కర్ పైన వంటలు చేసుకోవడం మంచిది.