Electric eel చేపలు అత్యంత ప్రమాదకరమైనవి. ఈ Electric eel చేపలు ఎక్కువుగా అమోజన్ అడవుల్లో ఉంటాయి. Electric eel చేపలు ఉత్పత్తి చేసే విద్యుత్ షాక్ వల్ల ఒక గుర్రం చనిపోయేంత డేంజరస్ ఫిష్‌లు. Electric eel చేపలు అనేక జాతులు ఉన్నాయి. వాటిలో ప్రమాదకరమైనది Electric eel ఫిష్‌లు.
ప్రపంచంలో మానవుని మొదలుకొని సకల జీవరాసులకు విద్యుత్ ఎంత అవసరమో! అంతే ప్రమాదం కూడా! మానవుని శరీరంలో కూడా విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొంత మంది శరీరంపై బల్బులు పెట్టి వెలిగించి అబ్బుర పరిచిన వీడియోలు, ఫొటోలు చూసే ఉంటాం. ఇది శరీరంలో జరిగిన జీవ రసాయనక చర్యలో భాగంగా ప్రకృతి అందించిన ఒక అద్భుతంగా చెప్పవచ్చు. ఇక అచ్చం కరెంటు ముట్టుకుంటే షాక్ కొట్టేంత విద్యుత్ ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ ఈల్ అనే విద్యుత్ చేప ఒకటి ఉంది. అది దాదాపు 650 ఓల్టుల విద్యుత్ శక్తిని విడుదల చేయడం ఆ చేప ప్రత్యేకత.
అత్యంత ప్రమాదకరమైన Electric eel చేపలు
ఈ ఎలక్ట్రిక్ ఈల్ చేపను మొట్టమొదటిగా E.Voltai (Alessandro Volta) అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. ఈ ఎలక్ట్రిక్ ఈల్ చేపలు కనుగొనే పరిశోధకుల బృదం 100కు పైగా ఎలక్ట్రిక్ ఈల్స్ చేపలు ఉన్నట్టు గుర్తించింది. వీటిలో మూడు జాతులు ఉన్నాయని కనుగొన్నారు. ఈ మూడు జాతుల్లో ఒకటి మాత్రం బలమైన విద్యుత్ శక్తిని విడుదల చేస్తుందని పరిశోధనల ద్వారా వెల్లడైంది. వీటి కుటుంబం ఎక్కువుగా అమోజన్ అడవుల్లో విస్తరించడంతో పాటు బ్రెజిల్, సురినామ్, ఫ్రెంచ్ గయానాలో కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ జాతుల చర్మం ఎక్కువుగా గోధుమ వర్ణంలో ఉంటాయి. తల భాగం చాలా ధృఢంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఈల్ చేపలు నది దిగువ భాగంలో ఉంటాయి. ఆహారం కనుగొనడానికి నది అడుగు భాగంలోనూ, వేగంగా ప్రవహించే ప్రవాహాలలో ఈత కొడుతుంటాయి.
శాస్త్రవేత్తలు ఎలక్ట్రిక్ ఈల్ చేపలో ఉన్న విద్యుత్ శక్తి షాక్ బలాన్ని కొలవడానికి గాలి తో కూడాన ఈత కొలనులో ఉంచారు. బ్యాటరీ ఆవిష్కర్త అలెశాండ్రో వోల్టా పేరు పిలిచే E.Voltai అనే ప్రమాదకరమైన ఎలక్ట్రిక్ ఈల్ చేప 860 వోల్టుల షాక్ ఇవ్వగలదని నిర్థారించారు. మూడు మిలియన్ల సంవత్సరాల క్రితం నుండి అమోజన్ అడవుల్లో వీటి అభివృద్ధి అధికంగా ఉంది. ఒకదానికొకటి వరద ప్రవాహం వల్ల విడిపోయాయి. ప్రస్తుతం ఆ జాతులు సంతానోత్పత్తి చేయగలవా లేదా అని మాత్రం పరీక్షించలేదు.

Electric eel చేప యొక్క విశేషాలు!
- ఈ ఎలక్ట్రిక్ ఈల్ చేప శరీరం నుంచి సుమారు 650 నుంచి 800 వోల్టుల విద్యుత్ ను విడుదల చేస్తుంది. అంటే ఇంత కరెంట్ ప్రభావంతో ఒక గుర్రం లాంటి పెద్ద జంతువులు సైతం కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది.
- ఈ ఎలక్ట్రిక్ ఈల్ చేపలు ముఖ్యంగా శత్రువుల నుండి కాపాడుకునేందుకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటాయి. వాటిపై దాడికి వచ్చిన శత్రువు జీవుల నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపి వాటి కండరాల్ని సైతం స్థంభింప చేస్తాయి.
- ఎలక్ట్రిక్ ఈల్ చేపలకు ఈ విద్యుత్ ఒక రిమోట్‌లా పనిచేస్తూ ఉంటుంది. దూరం నుంచి శత్రువులను పసిగట్టి విద్యుత్ సంకేతాలు పంపి వాటి ఆధీనంలోకి శత్రువులను తీసుకొచ్చుకుంటాయి. ఈల్ చేపల్లో ఎలక్ట్రిక్ షాక్‌ను విడుదల చేసే వ్యవస్థ గురించి పరిశోధన చేసినప్పుడు ఈ విషయం బయట పడింది. అత్యాధునిక కెమెరాల్ని, విద్యుత్ ఉనికిని పసిగట్టే సున్నితమైన పరికరాలను వాటి ఈ విషయాలు కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

- ఇంచుమించుగా 8 అడుగులు పొడువు ఉండే ఎలక్ట్రిక్ ఈల్ చేపల్లో మూడు రకాల వోల్టేజ్ ఆర్గాన్స్ ఉంటాయి. మొదటి రెండు అవయావాలు మాత్రం తక్కువ వోల్టేజీ విద్యుత్‌ను ప్రసరింప జేస్తే, మూడోది మాత్రం ఎక్కువ వోల్టేజీని విడుదల చేయగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఏ శత్రుజీవి అయినా దాడికి వచ్చినప్పుడు ఇవి దీన్ని ఉపయోగిస్తాయిన్నమాట. ఈల్ చేపకు మొదటి, రెండు అవయవాలతో చుట్టుప్రక్కల దాగున్న శత్రు జీవుల్ని పసిగట్టేసి మూడో అవయవంతో వేడాడేస్తాయి.
- మనం ఇంటిలో వాడే సుమారు 12 పెద్ద పెద్ద బల్బులు వెలగడానికి సరిపోయేంత విద్యుత్‌ను విడుదల చేస్తాయి. ఈ చేపల్లో దాదాపు 6,000 వేలకు పైగా ఎలక్ట్రిక్ కణాలుంటాయి. ఈ కణాలే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో కణం 0.1 వోల్టేజీ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. కొన్ని ఎలక్ట్రిక్ ఈల్స్ 50 కార్లను స్టార్ట్ చేసే సామర్థ్యమున్న విద్యుత్‌ను పుట్టించగలవు. ఈ ఎలక్ట్రిక్ ఈల్ చేపలు ఎక్కువుగా మట్టి నీళ్లలో ఉండే ఇవి పది నిమిషాలకోసారి బయటకొస్తాయి.
ఇది చదవండి: అన్నపై ఎంత అభిమానమో!
ఇది చదవండి: విషాదం: యువ జంట ఆత్మహత్యాయత్నం..యువకుడు మృతి!
ఇది చదవండి: family health optima insurance plan: తెలుగులో తెలుసుకోండి!
ఇది చదవండి:నిఘా నీడన పంచాయతీ ఎన్నికలు!
ఇది చదవండి:జగ్గయ్యపేటలో కొనసాగుతున్న పోలింగ్
ఇది చదవండి:అటవీ శాఖకు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జరిమానా!
ఇది చదవండి:ఎన్నికల వేళ ఏపీలో భారీగా మద్యం స్వాధీనం!
ఇది చదవండి: మంత్రి పువ్వాడపైన నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క
ఇది చదవండి:పదేళ్లు నేనే సీఎంను! ఇది పక్కా!
ఇది చదవండి:మరో పవన్ కళ్యాణ్ లా వస్తున్న ఉప్పెన వైష్టవ్ తేజ్