Elections of local bodies | yanamala ramakrishnudu | స్థానిక సంస్థల ఎన్నిలకు నిర్వహించాల్సిందే: యనమల
Elections of local bodies | yanamala ramakrishnudu | స్థానిక సంస్థల ఎన్నిలకు నిర్వహించాల్సిందే: యనమలAmaravati: ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.ఈ మేరకు సోమవారం ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఏపిలో పరిణామాలపై గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని, తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్243ఏ, ఆర్టికల్ 243కె(1) ప్రకారం ఎన్నికల నిర్వహణ అధికారం ఈసిదేనని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నిలకు కావాల్సిన ఉద్యోగులను కేటా యించేలా చూడాల్సింది గవర్నరేనని తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు సహకరించేది లేదని మంత్రులు చెప్పడం దేశ చరిత్రలోనే లేదని యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఎన్నికలకు సహకరించబోమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం ఏ రాష్ట్రంలోనైనా ఉందా? అని ప్రశ్నించారు. మద్యం కోసం క్యూల నిర్వహణకు లేని అభ్యంతరాలు, పంచాయతీ ఎన్నిలకు ఉంటాయా? అని ప్రశ్నించారు. కోవిడ్ ప్రభావం ఉందని 2022 జూన్ దాకా స్థానిక సంస్థల ఎన్నికలు జరపరా?అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎదుర్కొనే ధైర్యం లేకనే…
స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డికి లేకనే ఈ జగన్నాటకం అని మాజీ మంత్రి యనమల రామకృష్ణ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ రాజ్యాంగ ధ్వంసం ను అడ్డుకోవాలని పేర్కొన్నారు. చట్ట నిర్మాణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, మీడియా, పోలీసు వ్యవస్థ అన్నింటిని నాశనం చేసే దిశగా సిఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం మేరకు ఒక రాష్ట్రంలో పరిస్థితులు ప్రభుత్వ నిర్వహణకు, పరిపాలనకు అనుకూలంగా లేన ప్పుడు తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాల్సింది గవర్నరేనని పేర్కొన్నారు.
ఎక్కడా అడ్డురాని కరోనా ఏపిలో అడ్డొస్తుందా?
అమెరికా ఎన్నికలు, బీహార్ ఎన్నికలతో పాటు అనేక ఉప ఎన్నికలు జరిగాయని కానీ అక్కడ అడ్డు రాని కరోనా కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే అడ్డొస్తుందా? అని యనమల రామకృష్ణ ప్రశ్నించారు. పాఠశాలలు నడపడానికి, ముఖ్యమంత్రి పుట్టిన రోజు, మంత్రుల పెళ్లి రోజులు చేసుకునేందుకు అడ్డం రాని కరోనా స్థానిక ఎన్నికలకు అడ్డమా? అంటూ విమర్శించారు. మద్యం దుకాణాల వద్ద క్యూ కట్టడం, వైసీపీ సంబరాలు నిర్వహించడం, పట్టాల పండుగలకు అడ్డం రాని కరోనా పంచాయతీ ఎన్నికలకు అడ్డమా? అంటూ యనమల ఆరోపించారు. ద్వంద్వ ధోరణితో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కోవిడ్ పోతే నిర్వహిస్తారా, ఈసి పోతే నిర్వహిస్తారా? అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది చదవండి: కొమురవెల్లి మల్లన్నపై ఎందుకు ఇంత వివక్ష?