egypt new cairoఈజిప్ట్ కొత్త రాజధానిని నిర్మించనుంది. ప్రస్తుతం రాజధాని కైరోకు తూర్పుగా 35 కి.మీ దూరంలో నిర్మించనున్న ఈ నగరానికి న్యూకైరో అని పేరు పెట్టారు. ప్రస్తుతం నగరం కిక్కిరిసిపోవడంతో కొత్త నగరానికి శ్రీకారం చుట్టారు. 2015 లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాసిసి నూతన రాజధానిని నిర్మించాలని ఆదేశించారు. తొలిదశలో భాగంగా 168 చ.కి.మీ విస్తీర్ణంలో నగరాన్ని నిర్మించేందుకు సన్నహాలు(egypt new cairo) జరుగుతున్నాయి.
6.5 మిలియన్ల మంది ఆవాసం..
కొత్త నగరంలో 6.5 మిలియన్ల మంది ప్రజలు నివాసానికి అనువుగా గృహ నిర్మాణంతో పాటు వసతులు కల్పిస్తారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా స్మార్ట్ ట్రాఫిక్ విధానంలో భాగంగా రహదారుల నిర్మాణం జరగనుంది. విద్యుత్ సరఫరా, గ్యాస్ తదితర సరఫరాలు ఏఐ టెక్నాలజీ ఆధారంగా జరుగుతుంది. నగరంలో వేల సంఖ్యలో సీసీ కెమెరాలను అమర్చనున్నారు. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు తెలిసి పోతుంది. ఆప్టికల్ ఫైబర్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. 21 సెక్టార్లుగా నగరం విభజన జరగనుంది. 650 కి.మీ రోడ్లు నగరంలో వేయనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నారు.


- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!