egg parotta recipe:ఎగ్ ప‌రోటా త‌యారు చేయు విధానం!

Spread the love

egg parotta recipe:ఎగ్ ప‌రోటా చేసుకోవ‌డం ఇప్పుడు చాలా సింపుల్‌. కింద తెలిపిన విధంగా ఒక‌సారి చ‌ద‌వండి. కింద తెలిపిన విధంగా ఎగ్ ప‌రోటా చేయ‌డం (egg parotta recipe)నేర్చుకోండి.

కావాల్సిన‌వి

గుడ్లు – 5, మిరియాల పొడి-1 టీ స్పూన్‌, ఉల్లిపాయ‌ల ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు -3 టీ స్పూన్లు, ఉల్లికాడ ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు- త‌గినంత క్యారెట్ తురుము -2 టేబుల్ స్పూన్లు, జీల‌క‌ర్ర‌- పావు టీ స్పూన్‌, కొత్తిమీర తురుము – అర క‌ప్పు, క‌రివేపాకు- 3 రెమ్మ‌లు, గోధుమ పిండి – పావు కిలో, నూనె – స‌రిప‌డా, నీళ్లు – త‌గిన‌న్ని.

త‌యారీ చేయు విధానం

ముందుగా కోడిగుడ్ల‌ను ఉడికించి, స‌న్న‌గా తురుముకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసుకుని పాత్ర‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఉల్లికాడ‌ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు, క్యారెట్ తురుము, క‌రివేపాకు, జీల‌క‌ర్ర ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి వేసుకుని గ‌రిటెతో తిప్పుతూ గుడ్లు త‌రుగు, మిరియాల పొడి, కొత్త‌మీర తురుము, ఉప్పు వేసి బాగా క‌లుపుతూ రెండు నిమిషాల పాటు ఉడ‌క‌నిచ్చి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు క‌లుపుతూ చ‌పాతీ పిండిలా చేసుకుని, అర‌గంట సేపు ప‌క్క‌న పెట్టుకోవాలి. త‌ర్వాత చ‌పాతీలు చేసుకుని, మ‌ధ్య‌లో గుడ్డు మిశ్ర‌మాన్ని వేసి అంచులు మ‌డ‌వాలి. ఇప్పుడు నూనె వేసి రెండు వైపులా దోర‌గా కాల్చుకోవాలి. వీటిని వేడి వేడిగా తింటే బాగుంటాయి.

Mutton Recipes: మ‌ట‌న్ కూరల వెరైటీలు- మ‌ట‌న్ కూర‌లు త‌యారు చేసే విధానం!

Mutton Recipes | ఆదివారం వ‌స్తే ప్ర‌తి ఇంటిలోనూ మ‌ట‌న్ కూర వండి తీరాల్సిందే. Mutton Curry మ‌సాలా వాస‌న వ‌స్తుంటేనే ఎప్పుడు తినాలా? అనిపిస్తుంటుంది. అయితే Read more

Home Tips 2022: మ‌న ఇంటి చిట్కాలు తెలుసుకోండి పాటించండి!

Home Tips 2022 | మ‌న ఇంట్లో ప్ర‌తి రోజూ పాటించే చిట్కాలు ఇక్క‌డ తెలుసుకోండి. ఆరోగ్యానికి, డ‌బ్బు ఆదా చేయ‌డానికి ఈ చిట్కాలు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. Read more

kitchen Tips: తెలుగు ఇంటి ఆడ‌ప‌డుచుల‌కు వంటింటి చిట్కాలు!

kitchen Tips | తెలుగింటి ఆడ‌ప‌డుచులు వంటింట్లో ఎక్కువుగా స‌మ‌యం కేటాయిస్తారు. వారి కుటుంబానికి ఏది కావాల‌న్నా క్ష‌ణాల్లో వండి వ‌డ్డిస్తారు. వారు ఎన్నో ఆహార ప‌దార్థాలు Read more

upma recipe: ఇంట్లో సులువుగా త‌యారు చేసుకునే ఉప్మా గురించి తెలుసుకోండి!

upma recipe | ఉప్మా త‌క్కువ స‌మ‌యంలో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన అల్పాహార‌ము. ఈ ఉప్మాను బియ్యం ర‌వ్వ‌తో, అటుకుల‌తో, సేమ్యాల‌తో, గోధుమ నూక‌తో చేసుకోవ‌చ్చు. ఉప్పు మ‌రియు Read more

Leave a Comment

Your email address will not be published.