effects of cool drinks | ఈ ఎండా కాలంలో చల్లగా, తియ్యగా, రుచిగా ఉండే శీతల పానియాలను ఇష్టంగా తాగుతాం. పుట్టిన రోజు, పెళ్లిరోజు వేడుకల్లో కూలడ్రిక్స్ ఉండాల్సిందే!. అయితే, కూల్ డ్రింక్స్(cool drinks) తాగడం ద్వారా మన శరీరానికి ఎలాంటి పోషకాలు అందకపోగా అవి తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మాత్రం బోలెడన్ని ఉన్నాయి. శీతల పానీయాల్లో ఉండే అలాంటి ప్రమాదకర రసాయనాలు గురించి అవి కలిగించే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం!.
కూల్ డ్రింక్‌లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుందట. ఇంత మోతాదులో చక్కెర తీసుకుంటే వాంతులు వాంతులు వస్తాయి. కానీ కూల్ డ్రింక్స్‌లో ఉండే ఫాస్పోరిక్ ఆమ్లం వల్ల మనకు వాంతులు రావు. కూల్ డ్రింక్స్ వల్ల షుగర్స్ లెవల్స్ బాగా పెరిగిపోయి, కొవ్వుగా మారి బరువు బాగా పెరుగుతారంట. కూల్‌డ్రింక్స్‌లో ఉండే కెఫిన్ వల్ల రక్తపోటు పెరుగుతుందట. అలాగే ఇది పెద్ద వారికి అంతగా హాని చేయదు. కాని చిన్నపిల్లలకు చాలా హాని చేస్తుంది. అందుకే చిన్న పిల్లలకు కూల్ డ్రింక్స్ ఇవ్వకూడదు అంటారు.
కూల్ డ్రింక్స్ వల్ల మూత్ర విసర్జన తో పాటు, డీహైడ్రేషన్, దాహం ఎక్కువగా వేయడం జరుగుతుంది. ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఎందుకంటే కూల్ డ్రింక్స్ వల్ల శరీరంలో కాల్షియం లెవల్స్ బాగా తగ్గిపోతాయి. మధుమేహం, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ.లివర్, గుండె సంబధిత వ్యాధులకు కారణాలలో కూల్ డ్రింక్స్ ఒకటి.

effects of cool drinks | కూల్‌డ్రింక్స్‌లో రసాయనాలు!
ఫాస్ఫరిక్ యాసిడ్: ఇది ఎముకలను, దంత మూలాలను బలహీనపరుస్తుంది.
క్యారమెల్ రంగు: రసాయన క్యారెమెల్ నుంచి తయారయ్యే ఈ రసాయనం డ్రింక్‌కు రుచినివ్వకపోగా క్యాన్సర్‌కు గురిచేస్తుంది.
ఫార్మల్ డిహైడ్: ఇది క్యాన్సర్ కారకం. శరీరంలోకి ప్రవేశించినప్పుడు 2 ఆమీనో యాసిడ్లు మిథనాల్‌గా విడిపోతుంది(ఫార్మిక్ యాసిడ్ + ఫార్మాల్డిహైడ్ = డైట్ సోడాలు).
అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్: మొక్కజొన్న నుంచి తీసిన కాన్సెన్ట్రేటెట్ షుగర్..ఫ్రక్టోజ్. ఇది శరీరంలో కొవ్వు, కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచడంతో పాటు ఆకలిని పెంచుతుంది.
పొటాషియం బెంజోయేట్: పానీయం నిల్వ ఉండటం కోసం దీన్ని కలుపుతారు. ఇది శరీరంలోకి చేరగానే బెంజీన్ గా విడిపోతుంది. ఇది కూడా క్యాన్సర్ కారకమే!
కృత్రిమ రంగు: దీని వల్ల మెదడు పనితీరు తగ్గుతుంది. ఏకాగ్రతను తగ్గిస్తుంది. హైపర్ యాక్టివ్‌గా మారుస్తుంది.
ఇన్ని దుష్ప్రభావాలున్నాయి కాబట్టి, దాహం వేయగానే కూల్‌డ్రింక్ జోలికి వెళ్లకుండా మంచినీరు, కొబ్బరినీరు, మజ్జిగలను తాగండి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!