Effect of traffic challans | Number plates problem | బండి ఒక‌రికి..బాదుడు మ‌రొక‌రికి

Special Stories

Effect of traffic challans | Number plates problem

Hyderabad: ఏపీ 28 బిటి 4041. ఇది ఇక్క‌డ పార్క్ చేసి ఉన్న హోండా యాక్టివా టూ వీల‌ర్ నెంబ‌ర్‌. ఇది 2012 మోడ‌ల్ అయిన ఈ బండిని 2014లో ఖ‌మ్మం న‌గ‌రానికి చెందిన మారెడ్డి సీత అనే మ‌హిళ స్థానికంగా ఉన్న ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. అప్ప‌టి నుంచి ఆ బండిపై ఖ‌మ్మం దాటి వెళ్లింది లేదు. కానీ ఈ మ‌ధ్య కాలంలో ఈ బండి ఓన‌ర్‌కు చ‌లాన్ల మీద చ‌లాన్లు వ‌స్తున్నాయి. ఈ బండి సైబ‌రాబాద్‌, రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ల ప‌రిధిల‌లోని ఎల్భీన‌గ‌ర్‌, ఆల్వాల్‌ల‌లో ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు పేర్కొంటూ బండిఫొటోతో స‌హా చ‌లాన్లు పోస్టులో వ‌స్తున్నాయి. ఓరి నాయ‌నో! అంటూ ఖంగుతిన్న బండి య‌జ‌మాని భ‌ర్త నాగేంద‌ర్ రెడ్డి త‌న‌కున్న పూర్వ ప‌రిచ‌యంతో రాచ‌కొండ క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు.

Effect of traffic challans

స్పందించిన రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేష్ భ‌గ‌వ‌త్ విచార‌ణ జ‌రిపించారు. అదే నెంబ‌రుతో మ‌రో ద్విచ‌క్ర‌వాహ‌నం తిరుగుతున్న‌ట్టు తేల్చారు. అదేలా సాధ్యం? అనే ప్ర‌శ్న ఇప్పుడు బండి ఓన‌ర్ త‌ల‌ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ మ‌ధ్య కాలంలో ఇదో ప్రాక్టీస్‌గా మారింది నెంబ‌రు ప్లేట్లు మార్చే ముఠాల‌కు . ఏదో రాంగ్ పార్కింగో, హెల్మెట్ లేద‌నో, రూ.500, రూ.1000 ఫైన్ వేస్తే ఈ సారి జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త‌ప‌డొచ్చు. కానీ ఏదైనా అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డితే ప‌రిస్థితి ఏంట‌న్న‌దే ఇప్పుడు సొంత వాహ‌న‌దారుల‌లో మెదులుతున్న భ‌యం.

ఇలాంటి మ‌రో విచిత్ర‌మైన క‌థ‌. ఇలాగే భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణానికి చెందిన ఓ కారు నెంబ‌ర్‌తో టేకుల‌ప‌ల్లి పోలీసుస్టేష‌న్ లిమిట్స్‌లో ఆటో తిరుగుతోంది. స‌ద‌రు ఆటో డ్రైవ‌ర్ పాల్ప‌డిన ట్రాఫిక్ అతిక్ర‌మ‌ణ‌ల‌న్నీ భ‌ద్రాచ‌లం లో ఉన్న కారు ఓన‌ర్కు నోటీసుల రూపంలో వెళుతున్నాయి. తాను తిర‌గ‌ని ప్రాంతాల‌లో తిరిగిన‌ట్టు, అదీ ట్రాఫిక్ అతిక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు నోటీసులు రావ‌డంతో త‌ల‌ప‌ట్టుకోవ‌డం ఆ కారు ఓన‌ర్ వంతైంది.

Effect of traffic challans

ఖ‌మ్మంలో ఉన్న బండికి హైద‌రాబాద్ ట్రాఫిక్ చ‌లాన్‌

నోపార్కింగ్ జోన్‌లో వాహ‌నం పార్కు చేయ‌డం, రాంగ్ రూటులో వెళ్ల‌డం, ఓవ‌ర్ స్పీడు, రెడ్ సిగ్న‌ల్ క్రాసింగ్‌,హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయ‌డం ఇలా ఈ మ‌ధ్య కాలంలో మాస్క్ లేకుండా బండి న‌డ‌ప‌డం ఉల్లంఘ‌న ఏదైనా ఫైన్ మామూలే. ఒక్కో ఉల్లంఘ‌న‌కు ఒక్కో ర‌క‌మైన ఫైన్ త‌ప్పు చేసిన వారికి ఫైన్ వేయాల్సిందే. చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకో వాల్సిందే. మ‌ళ్లీ మ‌ళ్లీ త‌ప్పు చేయ‌కుండా గ‌ట్టిగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే. దీన్లో ఎలాంటి బేధాలు ఉండ‌వు. వేర్చ‌కు తావేలేదు. కానీ వాహ‌న య‌జ‌మానుల‌కు సంబంధం లేకుండా ఇవి జ‌రుగుతుంటేనే బాధ ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌న్న‌ది బాధితుల మాట‌.

ఆ ముఠాలు రూటు మార్చారు

ఇది ఫైన్ల చెల్లింపుల‌కు ప‌రిమితం కావ‌డం లేదు. ఈ మ‌ధ్య కాలంలో న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు దాటి గ్రామీణ ప్రాంతాల‌కు విస్త‌రించిన చైన్ స్నాచింగ్‌ల‌కు పాల్ప‌డే ముఠాలు ముందుగానే తాము వినియోగించే వాహ‌నాల‌కు నెంబ‌ర్లు మారుస్తున్నారు. దీంతో పాటు గుట్కాలు, గంజాయి ర‌వాణాకు ఉప‌యోగించే వాహ‌నాల‌కు సైతం నెంబ‌ర్లు మారుస్తున్న ఉదంతాల‌ను చూస్తున్నాం. కొద్ది రోజుల క్రింతం ఓ ఆస్తి వివాదంలో సాక్షాత్తూ సీఎం కేసీఆర్ స‌మీప బంధువుల‌ను కిడ్నాప్‌చేసిన ఘ‌ట‌న‌లోనూ నిందితులు తాము ఉప‌యోగించిన వాహ‌నాల‌కు నెంబ‌ర్లు మార్చివేశారు. ఇలాంటి సీరియ‌స్ అఫెన్స్‌ల‌లో ఒక్కోసారి అమాయ‌కులు చిక్కుకుంటున్న దుస్థితి ఉత్ప‌న్న‌మ‌వుతోంది. స‌మ‌గ్ర విచార‌ణ అనంత‌రం అమాయ‌కులంటూ తేలినా, ఎలాంటి త‌ప్పు చేయ‌కుడా అప్ప‌టిదాకా పోలీస్స్టేష‌న్ల చుట్టూ తిర‌గ‌డం ఎవ‌రికైనా తీవ్ర మ‌నోవేద‌న‌కు గురిచేస్తుంది.

Effect of traffic challans

ట్రాఫిక్ కెమెరాల‌తో చిక్కులు..

గ‌త‌కొన్నేళ్లుగా ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌ను సాక్ష్యాల‌తో ప‌ట్టుకోవ‌డానికి డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్ల‌కు కెమెరాల‌ను ఇచ్చారు. కూడ‌ళ్ల‌లో ఉంటూ అతిక్ర‌మణ‌ల‌కు పాల్ప‌డిన వాహ‌నాల‌ను ఫొటోలు తీయ‌డం, కంట్రోల్ రూంకు పంప‌డం, అక్క‌డ ఉన్న వారు ఆర్టిఏ వెబ్‌సైట్ ద్వారా ఓన‌ర్ ఇవ‌రాలు తీసుకొని నోటీసు ముద్రించి పోస్టు చేయ‌డం జ‌రుగుతున్న ప్రక్రియ‌. కానీ వేరే నెంబ‌ర్ల‌తో తిరుగుతున్న వాహ‌నాల‌ను గుర్తించ‌డం ఎలా ఆపి చెక్ చేసి చూడాలి. ర‌ద్ధీ దృష్ట్యా అది అంత సులువైన విష‌యం కాదు. దీంతో పాటు ఫొటోలో నెంబ‌ర్ సిరీస్ స‌రిగా క‌నిపించ‌క‌పోవ‌డం లేదా నెంబ‌ర్ వేసే విధానంలో ఫ్యాన్సీ పోక‌డ‌ల వ‌ల్ల క‌న్ఫ్యూజ‌న్ త‌లెత్తుతోంది.

ఒక‌రిది ఒక‌రికి పోవ‌డం కొన్ని సార్లు ట్రాఫిక్ వ‌ల‌యాల్లో అమ‌ర్చిన కెమెరాల్లోని పిక్చ‌ర్ ఆధారంగా చ‌లాన్లు పంప‌డం వ‌ల్ల కూడా దీనికి కార‌ణ‌మ‌వుతోంది. కార‌ణం ఏదైనా చేయ‌ని త‌ప్పుల‌కు ఫైన్లు క‌ట్టాల్సి రావ‌డం ఒక బాధ అయితే, ఏదైనా అసాంఘిక కార్య‌క‌లాపాల‌తో స్టేష‌న్ల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తే ఆ బాధ చెప్ప‌లేనిది. ఈ విష‌యంలో ఉన్న‌తాధికారులు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా బాధితులు వేడుకుంటున్నారు.

ఇది చ‌ద‌వండి : అత్యంత దారుణంగా యువ‌తిని హ‌త్య చేసిన ప్రేమోన్మాది
ఇది చ‌ద‌వండి : తిట్ల మీద ఉన్న ప‌ట్టు శాఖ‌పై లేదు: అచ్చె‌న్నాయుడు
ఇది చ‌ద‌వండి : చెట్టుకు ఉరేసుకొని ప్రేమికుల ఆత్మ‌హ‌త్య‌

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *