Eddula Bandi Chakram: ఇప్పుడంటే మనకు బైకులు, కార్లు, ఇతర పెద్ద పెద్ద వాహనాలు ఉన్నాయి కానీ, పూర్వ కాలంలో ఎంత దూరం ప్రయాణం చేయాలన్నా ఎద్దుల బండి(Bullock cart) ఉండాల్సిందే. అప్పట్లో ఎద్దుల బండి ఉన్నవారు కాస్త ధనవంతులుగానే చూసేవారు. వేళమైళ్ల దూరాన్ని మనం ఇప్పుడు గంటల వ్యవధిలో చేధిస్తున్నాం. కానీ ఆ కాలంలో మన తాతలు, ముత్తాతలు, తండ్రులు అందరూ ఎద్దుల బండిపైన ప్రయాణం చేసినవారే.
Eddula Bandi Chakram విశేషాలు!
వారు ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్లాలన్నా, ఎవరైనా దింపి రావాలన్నా ఎద్దుల బండిపైన రోజుల తరబడి ప్రయాణం చేసేవారు. అప్పట్లో బండిని లాగే ఎద్దులు కూడా చాలా బలిష్టంగా ఉండేవి. వాటిని కూడా చాలా ఆరోగ్యకరంగా కుటుంబ సభ్యులుగా చూసుకునేవారు యజమానులు. ఇప్పుడు వాతావరణం మారి పశువులకు కనీసం తినడానికి గడ్డి కూడా దొరక్కుండా ఎక్కడికక్కడ Plots వెలిశాయి. నిన్న చూసిన పచ్చదనంలో రేపు కాంక్రీటు Building లు వెలుస్తున్నాయి.
Eddula Bandi Chakram వల్ల అప్పట్లో అన్ని పనులు పూర్తి చేసుకునేవారు. వ్యవసాయం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఆడపిల్లల్ని అత్తగారింటికి దింపి రావాలన్నా, గర్భిణీ స్త్రీలను, అనారోగ్యంగా ఉన్నవారిని ఇలా ప్రతి ఒక్కరూ ఎడ్ల బండిపైనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. అయితె ఎడ్ల బండికి కాలాను క్రమంగా ఇప్పుడు చక్రాల స్థానంలో టైర్లు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా ఎద్దుల బండ్లు ఉన్నప్పటికీ వాటిని ఇసుక తోలడానికి, వ్యవసాయం పనుల నిమిత్తం ఉపయోగిస్తున్నారు పల్లెటూర్లలో రైతులు.
అప్పట్లో పట్టణాల్లో సైతం రంగు రంగుల ఎద్దుల బండ్లు కనిపించేవి. వాటిని ప్రయాణికులను దింపడానికి కూడా ఉపయోగించేవారు. ఏ మెటీరియల్ తీసుకురావాలన్నా Eddula Bandi Chakram సహాయం ఉండాల్సిందే. అయితే ఎద్దుల బండి చేసే వండ్రుగులు కూడా ఇప్పుడు కరువయ్యారు. ఇప్పుడు అంతా ఇనుముతో చేసిన ఎద్దుల బండులు కనిపిస్తున్నాయి. చెక్కతో చేసినవి ఎప్పుడో గోడల వద్ద బోర్ల తిరిగి తాడుకు కట్టే పరిస్థితి వచ్చింది.
ఎద్దుల బండి చక్రాల కొలతలు!
ఎద్దుల బండి చక్రాలు కొలతలు ఇప్పుడున్న వారికి తెలిసో తెలియదో కానీ చెక్కతో తయారు చేసిన చక్రాలు అలవకొలవగా తిరిగేవి. వాటిని ఏమాత్రం కొలతల్లో తేడా రాకుండా అప్పటి వండ్రుగులు తయారు చేశారు. అందుకనే ఎంతటి బరువు వేసినా అప్పట్లో ఎద్దులు కట్టుకున్న బండిని సునాయాసనంగా లాగేవి. ఈ ఎద్దుల బండి చక్రం మధ్యలో 12 అడ్డ చెక్క (wood) లు ఉండేవి. చక్రం ఊడిపోకుండా చివరిలో ఇనుప చువ్వు (ఇరుసు) పెట్టేవారు. బండి చక్రం సులువుగా తిరగడానికి జనపనారను ఉపయోగించేవారు.
Eddula Bandi Chakram 2,048×1,536 కొలతలు ఉండేవి. చక్రంలో సమానమైన అడ్డు కొలతలు ఉండటం వల్ల ఎద్దులు లాగేటప్పుడు చక్రం సమతులమైన దారులలో నడిచేందుకు సులువుగా ఉంటుంది. అప్పట్లో ఎద్దుల బండి చక్రాలను రంగు రంగుల కాగితాలతో, కలర్స్‌తో అందంగా తీర్చిదిద్దేవారు. ఎక్కువుగా ఎద్దుల బండి చక్రాలపై ఎర్రటి బొట్టులు కూడా పెట్టేవారు. జాతర జరిగేటప్పుడు ఎద్దుల బండి అలంకరణ చూడటానికి వచ్చే జనాలు చాలా మంది ఉండేవారు. ప్రస్తుతం ఎద్దుల బండి చక్రం మూలన పడ్డాయి. అవి కనిపించడమే అరుదైంది.