Economy Current Affairs: పోటీ పరీక్షల ప్రత్యేకం ఎకానమీ ప్రశ్నలు – సమాధానాలు
Economy Current Affairs
1.మొదటిసారిగా మార్కెట్ స్నేహపూర్వక, సూచనాత్మక ప్రణాళికను ఏ ప్రణాళికలో అమలుపర్చారు?
జ.8
2.లార్డ్ కర్జన్ కమిషన్ బ్రిటిష్ కాలం దేనికి సంబంధించింది?
జ.క్షామ నివారణ
3.1855లో ఏ ప్రాంతంలో మొదటి జనపనార మిల్లు స్థాపించారు?
జ.రిష్రా
4.షేర్షా కాలంలో ప్రభుత్వానికి ఆదాయం దేని ద్వారా లభించేంది?
జ.జిజియా
5.శాశ్వతశిస్తు నిర్ణయ పద్ధతిని లార్డ్ కారన్ వాలీస్ ఎప్పుడు ప్రవేశపెట్టాడు?
జ.1793
6.షేర్షా కాలంలో తోడర్మల్ దేని ఆధారంగా భూమిని నాలుగు రకాలుగా విభజించాడు?
జ.భూసారం
7.బ్రిటీష్ పాలనా కాలంలో అధిక మొత్తంలో వేలం పాట పాడినవారికి శిస్తు వసూలు అధికారాన్ని ఇచ్చినవారు?
జ.వారన్ హేస్టింగ్స్
8.1765లో ఆంగ్లేయ కంపెనీ ఏ రాష్ట్రంలో రెవెన్యూ లేదా దివానీ అధికారాన్ని పొందింది?
జ.ఒడిశా
9.1853లో బొంబాయిలో మొదటి వస్త్ర మిల్లును ఏర్పాటు చేసినవారు?
జ.కవాజి నానాభారు
10.గంగా కాలువ పునరుద్ధరణ కోసం కృషి చేసినవారు?
జ.లార్డ్ ఆక్ లాండ్
11.గోల్కొండ రాజ్యంలో ప్రధాన పరిశ్రమ?
జ.చేనేత
12.1935-40 మధ్య కాలంలో భారత్ ఎగుమతుల్లో బ్రిటిష్ వాటాను ఎంతగా అంచనా వేశారు?
జ.25.2%
13.బ్రిటిష్ కాలంలో వ్యవసాయంపై ఆధారపడిన జనాభాకు సంబంధించి సరైంది?
జ.1921లో 73%
14.కాకతీయుల కాలంలో హన్మకొండ చెరువును నిర్మించిన వారు?
జ.గంగాధరుడు
15.ఎవరి కాలంలో సింధు నది మొదలుకొని తూర్పున బెంగాల్‌లోని సోనార్గావ్ వరకు రహదారి నిర్మితమైంది?
జ.షేర్షా
16.1943లో బెంగాల్లో కరువు కారణంగా అధికారిక అంచనాల ప్రకారం సంభవించిన ఆకలి చావుల సంఖ్య?
జ.10,50,000
17.కింది ఎవరి కాలంలో భారతదేశంలో రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టారు?
జ.లార్డ్ డల్హౌసి
18.పంజాబ్ భూ బదిలీ చట్టం తీసుకొచ్చిన సంవత్సరం?
జ.1901
19.బ్రిటిష్ కాలంలో రాయలసీమ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్న ప్రదేశం?
జ.వజ్రకరూరు
20.1901-39 మధ్య కాలంలో వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉండటానికి కారణం?
జ.సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు
21.దివాన్- ఇ- రియాసత్, షహనా-ఇ- మండి అనేవి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వేటికి సంబంధించినవి?
జ.ఉన్నత ఉద్యోగులు
22.1923లో ఫిస్కల్ కమిషన్ సిఫార్సు మేరకు ఏర్పాటైంది?
జ.వ్యవసాయ కమిషన్
23.దక్షిణ భారతదేశంలో గ్రామ దానాలు చేసినవారు?
జ.పల్లవులు
24.ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతం కత్తుల పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది?
జ.కూన సముద్రం
25.దివాన్ – ఇ- అలా లేదా వజీర్ అంటే?
జ.మొగల్ రాజ్య ఆదాయ శాఖాధిపతి
26.పరిపాలనా సౌలభ్యం కోసం తన సామ్రాజ్యాన్ని సుభాలు, సర్కార్లు, పరగణాలుగా విభజించినవారు?
జ.అక్బర్
27.జహంగీర్, షాజహాన్ల కాలంలో భారత దేశంలో వాడుకలో ఉన్న నాణేలు?
జ.పౌండ్ స్టెర్లింగ్
28.కాకతీయుల కాలంలో బయ్యారం చెరువును నిర్మించిన వారు?
జ.మైలమదేవి
29.బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించిన మొదటి పాలకుడు?
జ.ఫిరోజ్ తుగ్లక్
30.దివాన్-ఇ- కోహీ అనే వ్యవసాయశాఖను ఏర్పాటు చేసినవారు?
జ.మహమ్మద్ – బిన్- తుగ్లక్
31.1829-1861 మధ్య కాలంలో హోమ్ ఛార్జీల రూపంలో భారతదేశం నుంచి బ్రిటన్‌కు ఎంత మొత్తం
తరలి వెళ్లిందని నౌరోజీ పేర్కొన్నారు?
జ.10కోట్ల స్టెర్లిన్లు
32.వ్యవసాయ ధరల కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
జ.1965
33.మానవ వనరుల అభివృద్ధి ఏ ప్రణాళిక లక్ష్యం?
జ.8వ ప్రణాళిక
34.పదో ప్రణాళిక కాలంలో అప్పటి ప్రధాన వాజ్‌పేయి ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు?
జ.షట్సూత్ర
35.12వ ప్రణాళికలో వనరుల కేటాయింపులో ఏ రంగానికి ప్రాధాన్యత దక్కింది?
జ.సాంఘిక సేవలు
36.ఇండియా విజన్-2020లో పొందుపర్చిన అంశాలకు సంబంధించి సరికానది?
జ.2020 నాటికి జీడిపీలో సేవారంగం వాటా 70%
37.నీతి ఆయోగ్‌కు సంబంధించి సరైన అంశం?
జ.దేశం అభివృద్ధి పథంలో పయనించడానికి ఉన్న వాతావరణాన్ని గమనించి, అందుకు అనుగుణంగా కృషి చేయాలనే భావనతో ఏర్పాటైంది.
38.ఎం.ఆర్.టి.పి చట్టం తీరుతెన్నులను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షులు?
జ.సచార్
39.ప్రసూతి, శిశు మరణాలను తగ్గించడానికి ఉద్దేశించిన పథకం?
జ.యశోద
40.నూతనంగా ఎదురయ్యే పరిస్థితులను బట్టి ప్రణాళిక లక్ష్యాలను నిరంతరం మార్చడానికి అవకాశం కల్పించే ప్రణాళిక
జ.నిరంతర ప్రణాళిక
- ఎవరి కాలంలో నిష్క అనే నాణెం అమల్లో ఉండేది?
జ.కాకతీయులు
42.భారతదేశ సమస్యల పరిష్కారానికి స్వరాజ్యం ఒక్కటే శరణ్యమని 1905లో కింది ఏ కాంగ్రెస్ సమావేశంలో నౌరోజీ వ్యాఖ్యానించారు?
జ.బెనారస్
43.బ్రిటిష్ కాలంలో జరిగిన సంపద తరలింపు కారణంగా ప్రపంచంలోనే సంపన్న దేశం అత్యంత పేద దేశంగా మారిందని భారతదేశ ఆర్థిక చరిత్ర అనే గ్రంథంలో పేర్కొన్నవారు?
జ.ఆర్.సి.దత్
44.పరిశ్రమల అభివృద్ధి కోసం 1916లో ఏర్పాటైన కమిషన్?
జ.హాలెండ్ కమిషన్
45.1859లో మొదటి పాసింజర్ రైలును ఉత్తర భారత దేశంలో కింది ఏ ప్రాంతాల మధ్య ప్రారంభించాఉ?
జ.అలహాబాద్- కాన్పూర్
46.బ్రిటిష్ కాలంలో ఆధునిక పరిశ్రమలను ఏ ప్రాంతంలో స్థాపించారు?
జ.చెన్నై
47.ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
జ.1956
48.నాలుగో పంచవర్ష ప్రణాళిక రూపకర్త?
జ.డి.ఆర్.గాడ్గిల్
49.కింది ఏ కమిటీ సూచన మేరకు 1969లో లీడ్ బ్యాంక్ స్కీంను ప్రారంభించారు?
జ.నారిమన్
50.వ్యవసాయధార పరిశ్రమలు ఎక్కువుగా ఉన్న రాష్ట్రం?
జ.ఉత్తర ప్రదేశ్.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!