Core Web Vitals Assessment: eating garlic benefits:ఒక వెల్లుల్లి తింటే వంద రోగాలు మ‌టుమాయం తెలు

eating garlic benefits:ఒక వెల్లుల్లి తింటే వంద రోగాలు మ‌టుమాయం తెలుసుకోండి!

eating garlic benefitsమ‌నం వంట‌కాల్లో విరివిగా వెల్లుల్లిని వాడుతూనే ఉంటాం కదా!. ఇది ఆహార ప‌దార్థాల‌కు మంచి రుచిని తెచ్చి పెట్ట‌డ‌మే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉన్న ఔష‌ధ‌గుణాలు చెడ్డ కొలెస్ట్రాల్ (ldl) మోతాదులు త‌గ్గ‌డానికి తోడ్ప‌డ‌తాయ‌ని అనేక అధ్య‌య‌నాలు రుజువు చేశాయి. అయితే వెల్లుల్లి రెబ్బ‌ల‌ను చిత‌గొట్టి, కాసేప‌య్యాక ప‌చ్చిగా తింటే మ‌రింత ఫ‌లితం క‌న‌బ‌డుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లిలోని ర‌సాయ‌నాలు మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌ల‌గ‌జేస్తాయో (eating garlic benefits) తెలుసుకుందాం.

వెల్లుల్లి గంధ‌క ర‌సాయ‌నాలు పెద్ద‌మొత్తంలో ఉంటాయి. వీటికి ఒక ర‌క‌మైన ఘాటు వాస‌న‌ను తెచ్చిపెట్టేవి ఇవే. ఈ ర‌సాయ‌నాలు ర‌క్త‌నాళాల్లో గార‌(Plack) పేరుకోకుండా కాపాడ‌తాయి. ఒక దీనిలోని అజోమేన్ ర‌క్తం గ‌డ్డ‌లు క‌ట్ట‌కుండా కాపాడుతుంది. అలిసిన్ అనేది యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ పంగ‌ల్‌గా ప‌నిచేస్తుంది. ఇది ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంద‌న్న‌మాట‌. ర‌క్త‌నాళాలు ముడుచుక‌పోయేలా చేసే angiotensin అనే ప్రోటీన్ ప‌నితీరును అలిస‌న్ అడ్డుకుంటుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ సాఫీగా జ‌రిగేలా చూస్తుంది.

వీటిల్లోని Polysulfide శ‌రీరంలోకి వెళ్లాక హైడ్రోజ‌న్ స‌ల్పైడ్ వాయువుగా మార‌తాయి. ఇది ర‌క్త‌నాళాల‌ను సాగేలా చేసి ర‌క్త‌పోటు త‌గ్గ‌టానికి తోడ్ప‌డుతుంది. త‌రుచుగా జ‌లుబు బారిన‌ప‌డేవారు వెల్లుల్లిని రోజూ తీసుకుంటే మంచి ఫ‌లితం క‌న‌బ‌డుతుంది. మ‌న శ‌రీరం ఇనుమును గ్ర‌హించుకునేలా చేయ‌డంలో ఫెర్రోపోర్టిన్ అనే ప్రోటీన్ కీల‌క పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలోని డ‌యాలీస్ స‌ల్పైడ్లు ఈ ఫెర్రోపోర్టిన్ ప్రోటీన్ ఉత్ప‌త్తిని పెంచుతుంది. ఇది ఇనుము సంబంధ జీవ‌క్రియ‌లు మ‌రింత మెరుగ్గా సాగ‌డానికి తోడ్ప‌డుతుంది. వెల్లుల్లోని డ‌యాలీల్ స‌ల్పైడ్‌, థియాక్రెమోనోస్‌లు వాపు నివార‌కాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇల అలీల్ స‌ల్పైడ్లు కొన్ని ర‌కాల క్యాన్స‌ర్ల నివార‌ణ‌కు తోడ్ప‌డ‌తాయి.

జ‌లుబు, క‌ఫంల‌కు చెక్‌

సాధారణంగా వ‌ర్షాకాలం, చ‌లికాలంలో జ‌లుబు, క‌ఫం వంటివి వ‌స్తుంటాయి. కాని నేటి వాతావ‌ర‌ణ కాలుష్య ప్ర‌భావంతో కాలంలో సంబంధం లేకుండానే జ‌లుబు వ‌చ్చిప‌డుతుంది. దీంతో కొంత మంది ముక్క‌లు చీదుకుంటూ వైద్యుల వ‌ద్ద‌కు వెళ్లి ఇంగ్లీష్ మందుల‌ను తెచ్చుకుని వాడుతుంటారు. నిజానికి జ‌లుబు, క‌ఫం వంటి వాటిని వంటింట్లో ల‌భ్య‌మ‌య్యే వాటితోనే నివారించ‌వ‌చ్చు. జ‌లుబు, క‌ఫం ప‌ట్టిన‌ప్పుడు ఇంట్లో ఉండే వెల్లుల్లిని బాగా మెత్త‌గా న‌ల‌గ్గొట్టి గంట‌కొక‌సారి చొప్పున వాస‌న చూడాలి. అలాగే, నాలుగు గంట‌ల‌కొక‌సారి రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను న‌మిలి మింగిన‌ట్ల‌యితే వీటి నుంచి చాలా మేర‌కు ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *