Praja Sangrama Yatraజోగిపేట: సీఎం కేసీఆర్ పతనానికి హుజూరాబాద్ ఉప ఎన్నికే నాంది అని బిజెపి నేత ఈటల రాజేందర్ అన్నారు. జిల్లాలోని జోగిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatraబహిరంగ సభ నిర్వహించారు. బాబూమోహన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు.
నోట్ల కట్టలు, మందు సీసాలు తమ గెలుపును ఆపలేవన్నారు. యుద్ధం మొదలైందన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. ప్రగతి భవన్లో కూర్చుని తన గొంతు పిసికేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తన సహచరుడు హరీష్ రావు ఆ కుట్రలను అమలు చేస్తున్నారని తెలిపారు.


దమ్ముంటే కేసీఆర్, హరీష్రావులే తన మీద పోటీకి రావాలని సవాల్ విసిరారు. ఒక వేళ తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు. కేంద్రంపై ఇక్కడ విమర్శలు చేస్తున్న కేసీఆర్, ఢిల్లీలో వంగి వంగి దండాలు పెడుతున్నారని ఈటల ఎద్దేవా చేశారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!