easy exercise | వ్యాయామాలు చేసేందుకు తీరిక లేదని చెబుతుంటారు కొందరు. అలాంటి వారు ఇంటి పనుల్లో భాగంగానే వ్యాయామాలు చేయొచ్చు. అవి సులువుగా కూడా ఉంటాయి. సులవైన వ్యాయామాలు (easy exercise) అన్ని వయసుల వారూ పాటించవచ్చు. వాటి వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం మన సొంత మవుతుంది. ఈ సులువైన వ్యామాల్లో ఒకటి గోడ కుర్చీ. గోడ కుర్చీ అనగానే చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుతున్నప్పుడు హోం వర్క్ చేయకపోతే టీచర్ గారు వేయించేవారు. కానీ అప్పుడు అది కష్టంగా, అవమానంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఇష్టంగా గోడకుర్చీ వేయడం ఒక వ్యాయామం(easy exercise)గా మారింది.
సులువైన వ్యాయామం!
బట్టలు ఉతుకుతున్నప్పుడు నిటారుగా ఉండి, ఆ బకెట్ లేదా టబ్ ని భుజాల వరకూ ఎత్తి దింపేందుకు ప్రయత్నించండి. అలా కనీసం ఐదుసార్లు వేసినా చాలు. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చేతులు కూడా దృఢంగా ఉంటాయి. ఎప్పుడూ కుర్చీలోనే కూర్చుంటాం కదా, అందుకే ఈ సారి గోడకుర్చీ వేయండి. కాఫీ తాగుతున్నప్పుడు లేదా ఫోను మాట్లాడుతున్నప్పుడు అలా కనీసం పదిహేను సెకన్లు అయినా కూర్చోవడం వల్ల పిరుదుల దగ్గర కొవ్వు కరుగుతుంది.
అలాగే గ్లూట్ కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా వీలైనన్నిసార్లు చేస్తే మంచిది. నడుము కింది భాగం తగ్గాలా, అయితే కుదిరిప్పుడల్లా స్వ్కాట్స్ చేయండి. కేవలం కాళ్లను కాస్త ఎడంగా ఉంచి, కింద కూర్చునేందుకు ప్రయత్నిస్తే చాలు. ఇలా కనీసం ఇరువై సార్లు చేస్తే ఛాతీ భాగానికి, చేతులకు వ్యాయామం అందుతుంది.
పిల్లలు ఆడుతున్నా..బోర్లా పడుకుని కాళ్లు చేతుల్ని ఆసరా చేసుకుని ప్లాంక్ ఆకృతిలో ఉండేందుకు ప్రయత్నించండి. దీనివల్ల పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు తగ్గుతుంది. ఈ కండరాలు కూడా ఆరోగ్యంగా మారతాయి.