Easter Egg Festival 2022 | ఈస్టర్ ఆదివారం క్రైస్తవులకు పండుగ దినం. కుటుంబ సభ్యులతో కలిసి గుడ్లకు రంగులు వేయడం, చాక్లెట్‌తో బన్నీని తయారు చేసి దాని చెవులు తినడం, ఇంటి మూలల్లో దాచబడే విందుల కోసం వెతకడం, ఇలా తమకు నచ్చిన రీతిలో ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు సంతోషంగా ఈస్టర్ శుభదినాన్ని జరుపుకుంటారు. క్రైస్తవులు ఈస్టర్ గుడ్లను ఆనందానికి, వేడుకకు, కొత్త జీవితానికి, పునర్జీవనానికి సంకేతంగా భావిస్తారు. హాలోవీన్ తరువాత అత్యంత ఎక్కువుగా మిఠాయిలు వినియోగించే రోజుగా ఈస్టర్ని చెప్పుకుంటారు.
Easter Egg Festival 2022 | ప్రతి ఏడాది ఈస్టర్ రోజు వైట్‌హౌస్ ముందు ఉన్న పచ్చిక మైదానంలో ఈస్టర్ ఎగ్ రోల్స్‌ని దొర్లిస్తారు. ఈ సంప్రదాయం 1878లో అధ్యక్షుడు రూథర్‌ఫర్డ్ ప్రారంబించారు. ఈస్టర్ గుడ్లు పంచుకునే సంప్రదాయం ఈజిప్షియన్లు, పర్షియన్లు, గ్రీకులు, రోమన్ల కాలంలో ప్రారంభమైంది. గుడ్లను జీవితానికి చిహ్నంగా భావించేవారు. మధ్యయుగంలో (5వ శతాబ్ధం నుండి 15 శతాబ్ధం వరకు) చర్చి పాస్టర్ బాలుడిపై ఒక ఉడికించిన గుడ్డును విసిరేవారు. ఆ బాలుడు ఆ గుడ్డును తన బృందంలోని పక్క కుర్రాడి మీదికి విసిరేస్తాడు. ఇలా ఒకరి తరువాత ఒకరు ఆ గుడ్డును అందుకునేవారు.
గడియారం 12 గంటలు కొట్టినప్పుడు ఎవరి చేతిలోనైతే ఆ గుడ్డు ఉంటుందో అతడిని విజేతగా భావించి ఆ గుడ్డును అతడికే వదిలేస్తారు. గుడ్లు ఈస్టర్‌తో సంబంధం కలిగి ఉండటానికి కారణం వసంత కాలాన్ని పుట్టుక, పునరుద్ధరణలకు చిహ్నంగా భావంచడమే!.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!