Earthenware

Earthenware : మ‌ట్టిపాత్రల వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలో!

Health News

Earthenware : మట్టి పాత్ర‌తో అన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా? మ‌ట్టి పాత్ర షుగ‌ర్‌కు కూడా విరుగుడు అందిస్తుందా? అస‌లు మ‌ట్టిపాత్ర‌కు షుగ‌ర్‌కు లింకేమిటి? ఇంత టెక్నాల‌జీ వ‌చ్చినా మ‌ళ్లీ మ‌ట్టి పాత్ర‌(Earthenware)ల వైపే ప్ర‌జ‌లు ఎందుకు వెళుతున్నారు. మ‌ట్టి పాత్ర‌కు ఉన్న ప్రాధాన్య‌త ఏమిటో తెలుసుకుందాం!

మ‌ట్టిపాత్ర‌(Earthenware)లో ఎప్పుడో మ‌న అమ్మ‌మ్మ‌లు ఇంకా చెప్పాలంటే వాళ్ల అమ్మ‌లు కాలంలో వంట చేసేవారంట‌. అని చెప్పుకునే రోజులు వ‌చ్చేవాయి. మ‌ట్టిపాత్ర‌లో వండుకోవాల్సిన క‌ర్మ మాకేమిటి అనేవాళ్లు ఈ కాలంలో లేక‌పోలేదు. అయితే అదంతా మ‌ట్టి పాత్ర‌లు గొప్ప‌త‌నం తెలియ‌కే? నాన్ స్టిక్ స్టైయ‌న్ లెస్ స్టీలు, అల్యూమినియం పాత్ర‌లు వాడ‌టం ద్వారా ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌డం లేదు. ప్ర‌స్తుతం కొంత మంది పెద్ద‌లు మ‌ట్టి పాత్ర‌ల్లోనే ఆహారాన్ని తీసుకోవ‌డం ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నార‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబ‌ట్టి అంద‌రూ మట్టి పాత్ర‌లు ద్వారా వంట చేయ‌డం ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు అంటున్నారు. నిజానికి మ‌ట్టి పాత్ర‌లో వంట చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ కాలం చెడిపోకుండా నిల్వ ఉంటాయి. కావాలంటే మీ అమ్మ‌మ్మ‌నో, నాయ‌న‌మ్మ‌నో అడ‌గండి.

మ‌న ఆరోగ్యానికి కావాల్సిన 18 ర‌కాల మైక్రో న్యూక్లియ‌న్స్ ఈ మ‌ట్టిలో ఉంటాయ‌ట‌. మ‌ట్టి పాత్ర‌లో ఆహారాన్ని వండ‌టం వ‌ల్ల వ‌చ్చిన రిపోర్టు ఏమిటంటే ఈ ప‌దార్థంలో ఒక్క మైక్రో న్యూట్రియ‌న్స్ కూడా త‌గ్గ‌లేదు. మామూలు పాత్ర‌లో వండి న ప‌దార్థాల‌లో 7%, 13% మాత్ర‌మే మైక్రో న్యూట్రియ‌న్స్ ఉన్నాయి. మ‌ట్టి పాత్ర‌లో మాత్ర‌ము 100% మైక్రో న్యూట్రియ‌న్స్ ఉన్నాయి. ఈ ప‌దార్థాల‌కి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే మ‌ట్టి పాత్ర‌ల‌ను త‌యారు చేసే బుర‌ద మ‌ట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్ కు వేడి త‌గ‌ల‌గానే ఇన్ప్రారెడ్ కంటికి క‌నిపించ‌ని కిర‌ణాలు అంటే ఇన్విజ‌బుల్ రేస్ ఉత్ప‌త్తి అవుతాయి. ఈ కిర‌ణాలు వెద‌జ‌ల్లిన ప్రాంత‌మంతా పూర్తి శుద్ధి చేయ‌బ‌డుతుంది.

ఎవ‌రైనా పిల్ల‌లు బ‌ల‌హీనంగా , త‌క్కువ బ‌రువుతో పుట్టినా, పుట్టుక‌తోనే ప‌సిరిక‌లు లేక ఏదైనా అనారోగ్యంతో పుడితే అలాంటి శిశువుల‌ను ఇంక్యుబేట‌ర్ అనే ప‌రిక‌రంలో కొన్ని గంట‌లు పాటు ఉంచుతారు. అలా పెట్ట‌డం వ‌ల్ల ఆ ప‌రిక‌రంలో ఉండే లైట్ ద్వారా ఇన్ప్రారెడ్ కిర‌ణాలు ద్వారా ప్ర‌స‌రింప‌చేసి పుట్టిన పిల్ల‌ల శ‌రీరాన్ని పూర్తిగా శుద్ది చేస్తారు. కేవ‌లం కొద్ది గంట‌ల్లోనే శిశువుకు పూర్తి స్థాయి ఆరోగ్యాన్నిచ్చే శ‌క్తి ఈ కిర‌ణాల‌కే ఉంది. కాబ‌ట్టే మ‌ట్టి పాత్ర‌ల‌కు అంత శ‌క్తి టెక్నాల‌జీ ఉంద‌న్న‌మాట‌. జీవితాంతం మ‌న‌కు కావాల్సిన న్యూట్రియ‌న్స్ అందుతుంటే మ‌న ప‌నులు మ‌న‌మే చేసుకుంటూ ఎవ‌రిమీద ఆధార‌ప‌డ‌కుండా జీవించ‌గ‌లం. ఇది కూడా మ‌ట్టి పాత్ర‌లో వంట చేసి తిన‌డం ద్వారానే. షుగ‌ర్ వ్యాధి ఉన్న వారికి ఈ మ‌ట్టి పాత్ర‌లు ద్వారా వండిపెడితే కొన్ని నెల‌ల‌లోపే డ‌యాబిటీస్ నుండి విముక్తుల‌ను చేయ‌వ‌చ్చు.

మ‌ట్టి కుండ‌లోని నీళ్లు ఎంతో శ్రేయ‌స్క‌రం!

వేస‌వి కాలం వ‌చ్చింది. అంద‌రూ ఫ్రిజ్‌లో పెట్టిన వాట‌ర్ నే తాగుతుంటారు. కానీ మ‌ట్టి పాత్ర కంటే ఫ్రిజ్‌లో ఉంచిన నీరు అంత‌ప్ర‌యోజ‌న‌క‌రం కాదు. మ‌ట్టితో త‌యారు చేసిన కుండ‌ల్లో కొన్ని పోష‌కాలు నీటితో జ‌త‌క‌లిసి ఆరోగ్యానికి ఉప‌క‌రిస్తాయి. పూర్వ కాలం నుంచి ప్ర‌జ‌లు అన్ని కాలాల్లో మ‌ట్టితో చేసిన పాత్ర‌ల‌తోనే నీటిని చ‌ల్ల‌బ‌రుచుకునేవారు. దీని ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని క‌ల‌గ‌దు.

సాధార‌ణంగా ఫ్రిజ్‌లో గ్యాస్, విద్యుత్ ల‌ను ఉప‌యోగించి నీటిని చ‌ల్ల‌బ‌రుస్తారు. కానీ మ‌ట్టి పాత్ర‌ల్లో వాతావ‌ర‌ణంలో ఉండే గాలితో బాష్పోత్సేకం ప్ర‌క్రియ‌తో నీటిని చ‌ల్ల‌బ‌ర్చుకోవ‌డానికి మ‌ట్టిలోని సూక్ష్మ‌రంధ్రాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

మ‌ట్టి పాత్ర‌ల‌ను త‌యారు చేసే మ‌ట్టిలో ఉండే క్షార‌గుణం వ‌ల్ల మాన‌వ శ‌రీరానికి అసిడిటీ స‌మ‌స్య లేకుండా శ‌రీరంలోని పీహెచ్ నిల్వ‌ల‌ను స‌మ‌తుల్యంగా ఉంచుతుంది. మ‌ట్టి నీళ్ల వ‌ల్ల గ్యాస్ట్రిక్ నొప్పులు రాకుండా కాపాడుతుంది.

సాధార‌ణంగా ప్లాస్టిక్ పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ‌డం ద్వారా అందులో ఉండే ర‌సాయ‌నాల వ‌ల్ల మావ‌న శ‌రీరానికి స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. జీవ‌క్రియ స‌మ‌తూల్యంగా ఉండ‌దు. దీని మూలంగా అనారోగ్య స‌మ‌స్య‌లు చోటు చేసుకుంటాయి. కానీ మ‌ట్టి పాత్ర‌ల్లోని నీటిని తాగ‌డం వ‌ల్ల జీవ‌క్రియ మెరుగుబ‌డి టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్ప‌త్త‌వుతుంది.

ఎండ‌లో తిరిగి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లోని చ‌ల్ల‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లో బేధాలు ఏర్ప‌డి వ‌డ‌దెబ్బ త‌గిలే అవ‌కాశం ఉంది. కానీ మ‌ట్టి పాత్ర‌ల్లోని నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంపై ఎలాంటి వ‌డ‌దెబ్బ ప్ర‌భావం ఉండ‌దు.


Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *