Earn Money Motivation మనిషి బ్రతకటానికి కావాల్సినవి గాలి, నీరు, ఆహారం. ఇది బాల్యం నుండి మనకు నేర్పే పాఠం. చదువకునేటప్పుడు, చదువుకుని ఉద్యోగం కోసం వెతుకులాడుకునే జీవితమనే పాఠశాలలోకి అడుగు పెట్టినప్పుడు గానీ అర్థం కాదు. బాల్యంలో నేర్చుకున్న ఆ పాఠం పాక్షిక వాస్తవమని. కేవలం ముందు చెప్పిన మూడింటితో బ్రతకటం సాధ్యం కాదు. ఆ మూడింటికి తోడుగా కీలకమైన అంశం మరొకటి ఉంది. అది లేకుండా ఏదీ ముందుకు జరగదు. ఆ నాలుగో అంశమే డబ్బు. ఇది ఎక్కువ మంది గుర్తించని, గుర్తించినా అర్థం చేసుకోని (Earn Money Motivation)అంశం.

ప్రస్తుత ప్రపంచంలో బ్రతకాలంటే డబ్బు కావాలి. డబ్బు లేకపోతే జీవిచడం కష్టం. కాబట్టి ఆ డబ్బు సంపాదన( Earn Money)కు ఎక్కడా లేని ప్రాధాన్యతనిస్తారు. సంపాదన మీద భయంతో అతి త్వరగా ఎవరు డబ్బునిస్తారో, అతి సులభంగా ఆదాయం ఎక్కడుంటుందో అక్కడ పనిచేయటానికి సిద్ధపడతారు. నెల తిరిగే సరికి స్థిరమైన ఆదాయం కావాలి. అంతేగాని తన టాలెంట్(talent)కు తగిన ఉద్యోగం చేస్తున్నామా?, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో తృప్తి ఉన్నదా అనే ఆలోచన చేయం. నెల చివరికి వచ్చే జీతం ఆ జీతంతో వచ్చే భద్రతతో చాలా మంది తమ జీవితంలో ఎదగడం ఆపేస్తున్నారు.
ప్రతిభ అవసరం!
తమను తాము తక్కువ చేసుకుని బ్రతుకుతారు. అలా బ్రతకడం వల్ల వారిలో దాగి ఉన్న ప్రతిభ వృథా కావడమే కాకుండా జీవితం ఈడ్చుకుంటూ పోవడమే జరుగుతుంది. ఉదాహరణకు చిన్నతనంలో ప్రతి ఒకరూ సైకిల్ తొక్కడం నేర్చుకుంటారు. సైకిల్ తొక్కడం అంటే పెడల్ మీద కాలు వేసి బలంగా తొక్కడమేనా? కానే కాదు. అది సైకిల్(bicycle) తొక్కడం ఒక భాగం మాత్రమే. కేవలం అలా పెడల్ తొక్కడం ఒక్కటే చేస్తే సైకిల్ ముందుకు నడవదు. సైకిల్ హ్యాండిల్ మీద అదుపు ఉండాలి. సైకిల్ని బ్యాలెన్స్ చేయాలి. అవసరాన్ని బట్టి వేగం పెంచాలి. కుడి, ఎడమలకు తిప్పగలిగిన నేర్పు ఉండాలి. వెంటనే ఆపేందుకు బ్రేకులమీద పట్టు ఉండాలి. ఇన్ని చేస్తేగాని సైకిల్ తొక్కడం పూర్తి కాదు. సరిగా డబ్బు విషయం కూడా అంతే. మనలో ఉన్న ప్రతిభను వెలికితీస్తూ అవకాశం ఉన్నంత మేర వినియోగిస్తూ ఉండాలి.

మేధస్సుకు పదును పెట్టాలి!
మన దేశంలో బిజినెస్ స్కూల్స్లో చదివేవారికి నేర్పేది జీతం కోసం పనిచేయడమే. వాస్తవానికి వ్యక్తిగతంగా వారు ఎదగవచ్చేమో కానీ తమ మేధస్సుకు తగిన పదును పెట్టడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే తమ ఆలోచనలతో కొత్త విధానాలతో పదిమంది జీవితాలను మెరుగుపరచగలిగిన నాయకులు మనకు కావాలి. ఆర్థిక రంగంలోనూ అటువంటి నాయకుల కోసమే దేశం ఎదురు చూస్తున్నది. సమాజానికి అవసరమైన కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం, కొత్త తరహా సేవలను అందించడం ద్వారా దేశానికి మేలు చేసినవారవుతారు. డబ్బు పట్ల సరైన దృక్పథం కలిగినప్పుడే అటువంటిది సాధ్యమవుతుంది. డబ్బును చూడగానే అదేదో పాపంతో కూడినదనో, మరో రకమైన భయంతోనో వ్యవహరించే వారి దగ్గరికి సంపద చేరదు.
నైపుణ్యం(skill) ముఖ్యం!
డబ్బు పట్ల సరైన అవగాహన కల్పించకపోవడమే మన దేశ విద్యావ్యవస్థ లోపం. మన విద్యావ్యవస్థల్లో డిగ్రీలు, మార్కులు తప్పించి నైపుణ్యాన్ని అందించే ప్రణాళికలు లేవు. డిగ్రీ అందుకుని బయటకు వచ్చే వరకు తాము చదివిన చదువు ఎంత పనికిమాలినదో తెలియని పరిస్థితి విద్యార్థులది. ఇంత డబ్బు పెట్టి చదివించినా తమ పిల్లలకు సరైన ఉద్యోగం లేని వ్యవస్థ మీద తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. ఫలితంగా యువతలో నిరాశనిస్పృహలు, ఏం చేయాలో తెలియక ఏదో ఒక పిచ్చిపని చేసి సమాజంపై తమ కసిని ప్రదర్శిస్తున్నారు. సమాజంలో పలు రకాల అలజడులకు, అశాంతులకు కారణం ఈ నిరాశనిండిన యువజీవితాలే. వారి శక్తి యుక్తులను సరైన మార్గంలో పెట్టగలిగిన విధానాలు లోపిస్తున్నాయి.
ఆర్థిక పుష్టి!
వ్యాపారమంటే మోసం కాదు. డబ్బు(Earn Money) అంటే భూతం కాదు. సంపద అశాంతిని తెచ్చిపెట్టదు. డబ్బుపట్ల దృక్పథం మార్చి నిజాయితీ వ్యాపారం. సమాజం పట్ల బాధ్యత, ప్రభుత్వం పట్ల ఉండే బాధ్యత వివరించగలిగితే కేవలం మూడు దశాబ్ధాల కాలంలో మనదేశ సమాజంలో ఆర్థికపరమైన మార్పులు వస్తాయి. కాని అటువంటి వ్యవస్థను ఏర్పాటుకు ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ప్రజల పేదరికం రాజకీయ పార్టీలకు ఎన్నికల అస్త్రం. నినాదాలు మారుతున్నాయే గాని పేదరికం పోవడం లేదు. పేదల సంఖ్య తగ్గడం లేదు. పేదలకు జ్ఞానోదయం కలిగితే రాజకీయ నాయకుల పప్పులుడకవు. డబ్బు పట్ల అవగాహన మార్చగలిగితే దేశంలో కొత్త విప్లవం సాధించినట్టే. కొత్తతరం, నేటి తరం విబేధాలన్నింటిని చేధించుకుని ముందుకు వస్తుంది. అటువంటి మరో ప్రపంచమే నేడు కావాల్సింది.

మార్పు రావాలి!
డబ్బు చెట్లకు కాయదు. దాని కోసమే కష్టపడాల్సిందే. అయితే నేడు లోపించినది కష్టించి పనిచేసే మనస్తత్వం అందుకే కొత్త రకం వ్యాపార మోడల్ వస్తున్నది. ఉద్యోగులు భాగస్వాముల్లాగా వ్యవహరించేలా ప్రోత్సహించే మోడల్స్ వస్తున్నాయి. తనకు ఉద్యోగమిచ్చి ఉపాధి కల్పిస్తున్న సంస్థకు ప్రతి నెల ప్రతి ఉద్యోగి కొంత డబ్బు చెల్లించి తన వాటా కొనుక్కునే ఏర్పాటు వచ్చింది. దీని వల్ల సంస్థ పట్ల, ఆ సంస్థ చేస్తున్న వ్యాపారం మీద ఉద్యోగికి బాధ్యత పెరుగుతుంది. సంస్థ ఎదుగుదలలో తానూ భాగాస్వామినేనన్న భావం ఏర్పడుతుంది. సంస్థ సాధించిన లాభాలలో అతనకీ వాటా ఉంటుంది. ఎంత కష్టించి పనిచేస్తే అంత లాభం ఉద్యోగికి ఉంటుంది. ఈ పద్ధతిలో ప్రతి ఒక్కరూ నూటికి నూరుశాతం తమ సమర్థతను ప్రదర్శిస్తున్నారు.
అందుకే విద్యార్థి దశలోనే డబ్బు పట్ల సరైన దృక్పథం కలిగించే విధానం రావాలి. అత్యంత తక్కువ సమయంలో అత్యధిక లాభాలను ఆర్జించే దోపిడీ మనస్థత్వం యువతకు నేర్పకూడదు. కంటికి కనిపించే వాటికన్నా కనిపించని వాటికి ఎక్కువ విలువనిస్తే అదే సంపదను పెంచుతుంది. పది మందికి లబ్ధి చేకూరుస్తుంది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి