Eagle and fox Storie ఆకాశంలో ఒక గ్రద్ధ ఆహారం కోసం చూస్తుండగా ఒక నక్క ఎరలతో నిండిన బండి లాగుతూ వెళ్తోందట. పై నుండి దీన్ని చూసిన గ్రద్ధ రయ్యిమని ఆ నక్క ముందు వాలింది. ఆ ఎరలు కావాలని నక్కను అడిగిందట. అప్పుడు ఆ నక్క తప్పకుండా ఇస్తాను. కానీ కొంత వెల అవుతుంది అని అన్నదట. దానికి గ్రద్ధ ఏమివ్వాలి, ఎంతివ్వాలి? అని అడిగితే నీ రెండు ఈకలు ఇస్తే, నేను ఒక ఎరను ఇస్తాను అని నక్క అన్నదట. గ్రద్ధ తన రెండు ఈకలను (Eagle and fox Storie)పీకి ఇచ్చిందట.
ఆహా ఎంత రుచిగా ఉందో!
నక్కవాటిని తీసుకుని ఒక ఎరను తీసి ఇచ్చిందట. దాన్ని తింటూ ఆహా ఎంత రుచిగా ఉంది. మళ్లీ ఇంకొకటి తిందాం అని మళ్లీ నక్క దగ్గరకు వచ్చిందట. అలా రుచి మరిగి మళ్లీ మళ్లీ తన ఈకలనిచ్చి ఎరలను కొంటూ వచ్చిందట. చివరకు ఆ గ్రద్ధ ఈకలన్నీ అయిపోయాయి. అప్పుడు ఒక్కసారిగా నక్క పెద్దగా నవ్విందట. గ్రద్ధ తేరుకొని, నిజం తెలుసుకునే లోగా తన ఈకలన్నీ ఊడి, పైకి ఎగరలేకపోయింది. నక్క అమాంతం గ్రద్ధ పైబడి తీల్చి తినేసింది. విచక్షణ కోల్పోయి శక్తినంతా అమ్ముకుని, దేవుడిచ్చిన ఎగిరే శక్తిని కోల్పోయి చివరకు ప్రాణాలు విడిచింది.

సరిగ్గా మన జీవితంలో కూడా, మనల్ని ఆకర్షించి, ప్రలోభపెట్టి మనకు తాత్కాలిక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలే మన పాలిట విష ప్రాయాలై మన జీవితాలను విషాదంలో ముంచేస్తాయి. ఆకర్షల ప్రలోభాల కారణంగా మన దృష్టి మరల్చబడుతుంది. మనిషి యొక్క లక్ష్యాన్ని, ఏకాగ్రతను భగ్నం చేసే పరిస్థితులు ప్రలోభాలు అడుగడుగునా ఎదురవూతూనే ఉంటాయి. ఒక వ్యక్తి తన ముందున్న లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ఆకర్షణలు, ప్రలోభాల రూపంలో ఎదురవుతుంటాయి. ఎదుర్కొని తీరాల్సి వస్తుంది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!