Rs.5 E-Books in Play Store : గూగుల్ ప్లేస్టోర్ నుండి ఈ – బుక్స్‌ను డౌన్లోడ్ చేసుకోండి!మనం ఉపయోగించే ఆండ్రాయడ్ మొబైల్ లో Google Play Store తప్పకుండా ఉంటుంది. అందులో మనకు నచ్చిన యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటాము. కొన్ని వెర్షన్లు ఫ్రీగా ఉంటాయి. మరికొన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. Google Play Store లో గేమ్స్, మ్యూజిక్, ఈ-బుక్స్, సినిమాలు, ఇంకా ఎడిటింగ్, క్రియేటివిటీ, మేకింగ్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే క్రింద ఇవ్వబడినవి కేవలం E-Books మాత్రమే. అవి పిల్లలకు, పెద్దలకు చాలా ఉపయోగపడవచ్చు. కేవలం రూ.5తోనే అవి పూర్తి E-Book డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాటిని ఒక్కసారి పరిశీలించండి.
Hard Work Never Fails
గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న Hard Work Never Fails బుక్ ప్రపంచంలోనే ఉత్తమ కథ పుస్తకాల్లో ఒకటిగా యాప్ సృష్టికర్త Mukesh Ravichandran పేర్కొంటున్నాడు. ఇందులో పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలకు నైతికంగా బోధించేందుకు, కుటుంబ సభ్యులు పిల్లలకు చెప్పేందుకు బోధన చాలా సులువుగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ముఖ్యమంగా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే మంచి విషయాలు ఈ Hard Work Never Fails యాప్‌లో ఉన్నాయి.
భవిష్యత్తులో ఉన్నత స్థానంలో పిల్లలు ఉండాలంటే వారికి చిన్నప్పటి నుంచే పుస్తకాలపై మక్కువను పెంచాలి. తద్వారా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవడంతో పాటు జీవితంలో విజయశిఖరాలు చేరుకునే అవకాశం ఉందని యాప్ సృష్టికర్త చెబుతున్నారు. ఈ యాప్ లోని పుస్తకంలో కొన్ని కథలు పిచ్చుకల ద్వారా పిల్లలకు నచ్చే విధంగా తెలియజేశారు. బొమ్మలు ద్వారా పిల్లలు ఏదైనా త్వరగా నేర్చుకునే అవకాశం ఉందనే ఐడియాతో ఈ Google Play Books ని తయారు చేశారు. ఇది ఫ్రీగా శాంపిల్ ఈ-బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బుక్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.5 చెల్లించాల్సి ఉంటుంది.
Self Help is the Best Help
Self Help is the best Help అనే E-Book ను బుక్ ప్రపంచంలోనే ఉత్తమ కథ పుస్తకాల్లో ఒకటిగా యాప్ సృష్టికర్త Mukesh Ravichandran పేర్కొంటున్నాడు. ఈ బుక్ కూడా పిల్లల కథలకు సంబంధించినది. స్వయం సహాయమే ఉత్తమ సహాయం అనే హెడ్డింగ్ ద్వారా దీనిని రూపొందంచారు.


ఇందులో కూడా పక్షుల ద్వారా పిల్లలకు అర్థమయ్యే రీతిలో కథలను తయారు చేశారు. ఈ పుస్తకం కూడా పిల్లలకు చాలా ఉపయోగపడవచ్చు. Google Play Store లో ఫ్రీగా శాంపిల్ ఈ-బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బుక్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.5 చెల్లించాల్సి ఉంటుంది.
Thoughts of Power E-Book ను Advaita Ashrama (రామకృష్ణ మఠం, బేలూర్ మఠం) ప్రచురించారు. ఈ E-Book లో స్వామి వివేకానంద సూక్తులు, ఆధ్యాత్మికత మాటలు పొందుపర్చారు. ప్రతి మనిషీ జీవితంలో ఏ విధంగా బ్రతకాలనేది తెలియజేశారు. మనస్సులోని ప్రశాంతత నెలకొనేందుకు, ఆత్మను పరిశీలన చేసుకునేందుకు E-Book చాలా ఉపయోగపడుతుందని బుక్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకునే ప్రతి వ్యక్తి దీనిని ఒకసారి చదవవచ్చు. నిరాశ, నిసృహలతో బాధపడుతున్న వారు ఈ స్వామివివేకానంద E-Book ను చదివితే ప్రశాంతమైన మనస్సు కలిగి ఉంటారని చెబుతున్నారు. E-Book శాంపిల్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక వేళ మీకు నచ్చితే కేవలం రూ.5 చెల్లించి పూర్తి E-Book ను Play Store నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Life-Changing Thoughts From Gita
Life Changing Thoughts From Gita అనే E-Book కేవలం భగవద్గీత పవిత్ర గ్రంథం మాత్రమే కాదు, జీవిత గ్రంథం కూడా అని E-Book సృష్టికర్త Birister Sharma తెలుపుతున్నారు. గీత అనే పదానికి పాట, పదం అని అర్థం, భగవత్ అంటే దేవుడు. మరియు భగవద్గీత అంటే దేవుని పాట అని అర్థం. భగవద్గీత అనేది జ్ఞానం యొక్క మహా సముద్రంగా చెప్పవచ్చు.
ఇది మనిషి యొక్క జీవిత కళను ప్రతికోణంలో బోధిస్తుంది. అతను పుట్టిన మొదటి క్షణం నుంచి అతని జీవితపు చివరి క్షణం వరకు ఎలా బ్రతకాలో అనేది ఈ E-Book ద్వారా తెలుసుకోవచ్చు. Google Play Store నుండి ఫ్రీ శాంపిల్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వాస్తవంగా రూ.15.34 ఉన్న ఈ -బుక్ 61% డిస్కౌంట్‌తో కేవలం రూ.5 లకే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
600+ General Science MCQs for RRB NTPC/JE/Group D/ALP
Google Play Store(Rs.5 E-Books in Play Store) లో ఈ E-Book ప్రస్తుతం ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల కోసం సాధన చేస్తున్న అభ్యర్థులకు, నిరుద్యోగులకు ఈ E-Book చాలా ఉపయోపడుతుంది. ఈ E-Book లో NTPS,JE, Group D & ALP కి సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. అన్ని పుస్తకాలతో పాటు ఈ E-Bookను కూడా ఒక్కసారి చదివి తెలియాల్సిన విషయాలను తెలుసుకోండి.Google Play Store లో E-Bookను ఫ్రీగా శాంపిల్ బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక వేళ పూర్తి బుక్ కావాలంటే కేవలం రూ.5.90 చెల్లించాల్సి ఉంటుంది.
ఇది చదవండి: చిగురించిన ప్రేమ చివరికి ఏమైంది?లవ్ స్టోరీ