- బి వి కె జనరల్ మేనేజర్ వై శ్రీనివాసరావు
- వైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
DYFI Khammam: ఉద్యమాలకు ఊపిరి యువతరమే అని , నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలకు రావాలని బోడెపుడి విజ్ఞాన కేంద్రం జనరల్ మేనేజర్ వై శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన DYFI జిల్లా కమిటీ స్టడీ సర్కిల్లో వర్తమాన రాజకీయాలు- యువకుల పాత్ర అనే అంశంపై స్టడీ సర్కిల్ నిర్వహించారు.
ఈ Study Circle ను బోధించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీనివాసరావు మాట్లాడుతూ యువతరం లేకుండా రాజకీయాలు లేవని, ఉద్యమాలకు ఊపిరి యువతని నేటి యువత వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలకు రావాలని అన్నారు. ఆనాటి యువత చేసిన పోరాటాలను పూర్తిగా తీసుకొని నేడు అనేక రంగాల్లో జరుగుతున్న అన్యాయాల పై పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పోరాడితే పోయేదేమీ లేదని బానిస సంకెళ్లు లేనని , భయపడినంత కాలం బెదిరిస్తూనే ఉంటారని అందుకే ఎదిరించి పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
DYFI Khammam: యువత ఆశలు, ఆకాంక్షలు తీర్చలేకపోతున్న ప్రభుత్వాలు
ఏం సాధించాలన్న యుక్త వయసులో ఉన్నప్పుడే పునాదులు వేసుకోవాలని ఈ సందర్భంగా యూత్ గుర్తు చేశారు. ఈ స్టడీ సర్కిల్ సందర్భంగా DYFI జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చినప్పుడు అనేక వాగ్దానాలు చేస్తూ దండుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత యువత ఆశలు ఆకాంక్షలను నెరవేర్చకుండా వదిలి వేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలో రాష్ట్రంలో యువశక్తి నిర్వీర్యం అవుతుందని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని అందుకే భారతదేశం రోజు రోజుకు వెనుక పట్టు పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే యువత తమ ఆశలు ఆకాంక్షలు తీర్చుకోవాలంటే పోరాటాలు చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ స్టడీ సర్కిల్ కార్యక్రమంలో డివైఎఫ్ఐ (DYFI Khammam)జిల్లా ఉపాధ్యక్షులు సత్తనపల్లి నరేష్, భూక్య ఉపేందర్ నాయక్, గుమ్మ ముత్తారావు ,శీలం వీరబాబు, జిల్లా సహాయ కార్యదర్శులు చింతల రమేష్, కూరపాటి శ్రీను, దిండు మంగపతి, ఇంటూరి అశోక్ జిల్లా కమిటీ సభ్యులుకొంగర నవీన్,కారుమంచి పవన్, బొడ్డు మధు, యాట రాజేష్, రావులపాటి నాగరాజు, కనపర్తి గిరి, షేక్ నాగూర్ పాషా తదితరులు పాల్గొన్నారు.