Dwakra Mahila Sangam | దేశంలో ప్రతి స్త్రీ స్వయం సహాయకంగా జీవిస్తున్నారంటే అందులో ముఖ్యపాత్ర పోషించేది డ్వాక్రా మహిళా సంఘం, గ్రూపు అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క మహిళ తన కుటుంబ జీవనాధారానికై తన వంతు కష్టపడుతూ ఇలా పొదుపు సంఘాల్లో చేరి వారి కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈ Dwakra Group మహిళా సంఘాలకు ప్రధానంగా మేలు చేకూర్చేవి ప్రభుత్వాలు, బ్యాంకులు. ప్రభుత్వాలు సంక్షేమ పథకాల్లో భాగంగా డ్వాక్రా గ్రూపులకు సున్నా వడ్డీ పథకం లాంటివి ఏర్పాటు చేసి నగదును అందజేస్తున్నాయి. BANKలు తక్కువ వడ్డీతో లోన్లు ఇస్తుంటాయి.
Dwakra Mahila Sangamన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి?
డ్వాక్రా గ్రూపులో ఒక మహిళ చేరాలంటే ముందుగా మన మండల కేంద్రంలో ఉన్న డ్వాక్రా ఆఫీసుకు వెళ్లాలి. అక్కడ యానిమేటర్లు(Animator) ఈ గ్రూపుకు సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తారు. కొన్ని సార్లు వారు అందుబాటులో ఉండరు. అలాంటప్పుడు ఈ గ్రూపుకు సంబందించిన వివరాలు మనకు తెలియవు. కాబట్టి మాకు తెలిసిన కొంత సమాచారం మేరకు సాధ్యమైనంత వరకు Dwakra Mahila Sangam గురించి తెలియజేయాలనుకుంటున్నాం.
ముందుగా డ్వాక్రా గ్రూపు ఏర్పాటు చేసుకోవాలంటే 10 మంది Mahila సభ్యులు యూనిటీగా ఏర్పడాలి. వారందరూ కలిసి డ్వాక్రా గ్రూపు కేంద్రానికి వెళ్లి యానిమేటర్‌ను కలిసి మేము గ్రూపు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నా మని తెలియజేస్తే వారు డ్వాక్రాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తారు. డ్వాక్రా Groupలో జాయిన్ కావాలనుకునే వారికి మహిళకు 18 సంవత్సరాల నిండి ఉండాలి. గ్రూపులో ఉన్నవారికి కొనసాగింపులో ఏ మహిళకైనా 60 సంవత్సరాలు నిండితే వారిని గ్రూపులో నుండి తీసివేస్తారు.
10 మంది గ్రూపు సభ్యులకు సంబంధించిన Aadhar కార్డు, Ration కార్డు, బ్యాంకు Account, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, గ్రూపు Photo కావాల్సి ఉంటుంది. గతంలో బ్యాంకు అకౌంట్ నెంబర్లను లోన్ ఇచ్చేటప్పుడు తీసుకునేవారు. ఇప్పుడు అందరికీ బ్యాంకు అకౌంట్ ఖాతా ఉంటుంది కాబట్టి, గ్రూపులో జాయిన్ అయ్యేటప్పుడే తీసుకుంటున్నారు. డ్వాక్రా గ్రూపులో ఉన్నవారిలో తెల్ల(White) రేషన్ కార్డు ఉన్నవారికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రభుత్వం నుండి ఏ లోన్ వచ్చి వారికి వర్తిస్తాయి. ఇక గ్రూపుకు సంబంధించిన 10 మందికి కలిపి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఇందులో ప్రతి నెలా కొంత నగదును పొదుపు చేసుకుంటూ ఉండాలి.
ప్రతి నెలా గ్రూపులో ఒక సభ్యురాలు రూ.100 చెల్లించాలి, అలా 10 మంది కలిపి రూ.1000 చెల్లించాలి. ఇంకా ఇంతకన్నా ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. బ్యాంకు వారు సుమారు సంవత్సరం తర్వాత లోన్లు ఇస్తారు. ఒక వేళ మీరు పొదుపు చేసుకునే అమౌంట్ ఎక్కువుగా ఉంటే 6 నెలలకే లోన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఊరిలో కొన్ని గ్రూపుల వివరాలను ఎప్పటికప్పుడు Update చేయడానికి వి.ఓ(V.O) ఒకరు ఉంటారు. వారే ప్రస్తుతం గ్రూపుకు సంబంధించిన లోన్లు, అర్హతలు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. నెలకు రెండు సార్లు గ్రూపు సభ్యులు Meeting పెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రూపుకు సంబంధించి లీడర్‌ను, సెక్రెటరీని గ్రూపు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొని వారి ఆధ్వర్యంలో గ్రూపును నడిపించవచ్చు.
గ్రూపు నడిపే లీడర్, సెక్రటరీ అత్యంత న్యాయ బద్ధంగా, నీతివంతంగా నడిపించాల్సి ఉంటుంది. గ్రూపుకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం ప్రతిఒక్క సభ్యురాలికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గ్రూపులో ఉన్న సభ్యురాలికి వారు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. గ్రూపులో ఖర్చులు, పొదుపుల వివరాలు, గ్రూపు సభ్యుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఒక బుక్‌ను మెయింటెన్స్ చేయాల్సి ఉంటుంది. గ్రూపు సజావుగా సాగే బాధత్య లీడర్లదే. వారి మంచిగా గ్రూపును నడిపిస్తుంటే ఆ గ్రూపుకు మరింత ఉపాధి, ఆదాయం పెరుగుతుంది. బ్యాంకు వారు కూడా లోన్లు ఇవ్వడానికి సంకోచించరు.