Dwakra Mahila Sangam

Dwakra Mahila Sangam: రుణాలు తీసుకోలేదు! నోటీసు వ‌చ్చింది! అవ్వాక్కైన మ‌హిళా సంఘాలు!

Spread the love

Dwakra Mahila Sangam| గుంటూరు: పెద్ద పెద్ద వ్యాపారులు కోట్ల‌కు కోట్లు రుణాలు తీసుకొని ఎగ్గొట్టినా వారిని ఏమీ చేయ‌లేని బ్యాంకులు సాధార‌ణ మ‌హిళ‌లు, రైతులు మాత్రం రుణాలు తీసుకొని క‌ట్ట‌డం ఆల‌స్య‌మైతే ప‌రువు తీసినంత ప‌నిచేస్తుంటాయి. ఇదిలా పోతే ఇక ఎటువంటి రుణాలు తీసుకోక‌పోయిన‌ప్ప‌టికీ తిన్న‌గా బ్యాంకు నుండి నోటీసులు వ‌చ్చాయి. ఈ నోటీసులు చూసిన మ‌హిళా సంఘాలు అవాక్క‌య్యారు. మాకు ఎప్పుడు రుణాలు వ‌చ్చాయి? మేము ఎప్పుడు రుణాలు తీసుకున్నామ‌ని తిన్న‌గా బ్యాంకు వ‌ద్ద‌కు(Dwakra Mahila Sangam) వెళ్లారు.

రుణాలు పొందకుండా బ్యాంకు నుంచి నోటీసులు రావ‌డంతో గుంటూరు(Guntur) ప‌ట్ట‌ణంలోని ప‌లువురు పొదుపు సంఘాల మ‌హిళ‌లు అవాక్క‌య్యారు. బ్యాంకు ఎదుట సోమ‌వారం ఆందోళ‌న‌కు దిగారు. మాకు రుణాలు ఇవ్వ‌కుండా బ్యాంకు నోటీసులు ఎలా ఇస్తార‌ని అధికారుల‌ను నిల‌దీశారు. ప‌ట్ట‌ణంలోని ప్రకాశ్ న‌గ‌ర్‌లో ఉన్న గుంటూరు కేంద్ర స‌హ‌కార బ్యాంకు నుంచి తాము ఎలాంటి రుణాలు పొంద‌క‌పోయినా నోటీసులు పంపార‌ని బాధిత మ‌హిళ‌లు ఆరోపించారు.

ఇన్వెస్టిగేష‌న్‌

బ్యాంకు సిబ్బంది పనేనా?

అయితే త‌మ పేరుతో సుమారు రూ.30 ల‌క్ష‌లు నిధులు కాజేశార‌ని ఇది బ్యాంకు సిబ్బంది ప‌నే నంటూ ఆరోప‌ణ వ్య‌క్తం చేశారు. రుణాలు పొంద‌ని మాకు నోటీసులు రావ‌డ‌మేంట‌ని బ్యాంకు ఎదుట డ్వాక్రా మ‌హిళ‌లు నిర‌స‌న తెలిపారు. మా ఆధారాలు ఏమీ తీసుకోకుండా బ్యాంకు అధికారులు రుణాలు ఎలా మంజూరు చేశార‌ని బ్యాంకు సిబ్బందిని పొదుపు సంఘాల మ‌హిళ‌లు ప్ర‌శ్నించారు. బ్యాంకు అధికారుల‌తో కుమ్మ‌క్కై యానిమేట‌ర్ గౌరీ అనే మ‌హిళ న‌గ‌దు గోల్‌మాల్‌కు పాల్ప‌డిన‌ట్టు మ‌హిళ‌లు ఆరోపిస్తున్నారు. విష‌యంపై స్పందించిన బ్యాంకు మేనేజ‌ర్ బాల‌కృష్ణా రెడ్డి బ్యాంకు ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకు వెళ‌తాన‌న్నారు. మ‌హిళ‌ల‌కు న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని తెలిపారు.

Shaik Rasheed (vice-captain): సాధించాల‌నే ప‌ట్టుద‌ల నీలో ఉంది..శ‌భాష్‌!

Shaik Rasheed (vice-captain) | భార‌త అండ‌ర్ -19 క్రికెట్ జ‌ట్టు వైస్ కెప్టెన్ షేక్ ర‌షీద్ బుధ‌వారం గుంటూరు రూర‌ల్ ఎస్పీ విశాల్ గున్నిని త‌న Read more

Yadlapati Venkatarao: టిడిపి సీనియ‌ర్ నేత య‌డ్ల‌పాటి వెంక‌ట్‌రావు మృతి

Yadlapati Venkatarao | గుంటూరు జిల్లాలో పేరందిన ప్ర‌ముఖ టిడిపి సీనియ‌ర్ నేత య‌డ్ల‌పాటి వెంక‌ట్ రావు సోమ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. య‌డ్ల‌పాటి వెంక‌ట‌రావు 1967లో Read more

Beemla Nayak Hundi: థియేట‌ర్ల‌లో భీమ్లా హుండీలు ఏర్పాటు..అభిమానం అంటే ఇదేగా మ‌రి!

Beemla Nayak Hundi: గుంటూరు జిల్లా మాచ‌ర్ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. మాచ‌ర్ల‌లోని భీమ్లా నాయ‌క్ సినిమా ప్ర‌ద‌ర్శిస్తున్న థియేట‌ర్ల‌ల‌లో అభిమానులు, Read more

MLC Ashok Babu Arrest: టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు అర్ధ‌రాత్రి అరెస్టు

MLC Ashok Babu Arrest గుంటూరు: ప్ర‌భుత్వ స‌ర్వీసులో ఉన్న‌ప్పుడు ప‌దోన్న‌తి కోసం విద్యార్హ‌త‌ను త‌ప్పుగా చూపించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబును గురువారం అర్ధ‌రాత్రి Read more

Leave a Comment

Your email address will not be published.