dussehra storie 2022 | అకారాది క్షకారాంత వర్ణ నిర్మితమైన జగన్మాత రూపాలు అనతరం, ఆ పరాశక్తికి అనేక రూపాలు, అనేక నామాలూ ఉన్నప్పటికీ మార్కండేయ పురాణం అనుసరించి తల్లిని ఎక్కువ మంది దసరా నవరాత్రి ఉత్సవాల్లో నవ దుర్గల రూపాలలో పూజిస్తారు.
dussehra storie 2022: ధర్మస్థాపనే దసరా!
ఓ సారి దుష్టలు మితిమీరి సర్వలోకాలను అల్లకల్లోలం చేయసాగారు. త్రిమూర్తులు కూడా వారిని నిలువరించలేకపోయారు. అప్పుడు సర్వాధికారిణి అయిన అమ్మను త్రిమూర్తులు, దేవతలు ఆ త్రిగుణాతీతను స్తుతించారు. తల్లిని కాపాడమని వేనోళ్ల ఆర్థించారు. అప్పుడు ఆ తల్లి సంకల్పించింది. ఆ తల్లి సంకల్పం ప్రకారం బ్రహ్మమహేశ్వరుల నుంచి ఓ గొప్ప తేజము బయల్వెడింది. ఆ తేజము ఆ తేజోరాశిలో లీనం అయింది. ఆ తేజస్సుఅంతా ఓ శక్తి స్వరూపిణిగా స్త్రీ రూపాన్ని సంతరించుకుంది. ఆమేయ అఖండ శక్తివంతురాలిగా దివ్యతేజస్సును ఆ అమ్మ ప్రసరించింది.
ప్రసన్నముఖియైన ఆ దివ్యతేజోమయికి త్రిమూర్తులతో పాటు సర్వదేవతలు వారి వారి ఆయుధాలను సమర్పించారు. సకలాభరణాలు ధరించింది. త్రిమూర్తులకు సకల సృష్టికి అభయాన్ని ప్రసాదించిదా శక్తి. వెనువెంటనే బయలుదేరింది. లోకాలనే అతలాకుతలం చేసే దుష్టులపై క్రోదాన్ని చూపించింది. వివిధ రూపాలతో పలువుర్ని హింసించే దుష్టులను దుష్టసంహారిణియై దుసుమాడింది. సర్వశక్తులను క్షణకాలంలో తల్లికి వశీభూతమైయ్యాయి. దోషులు తోకముడవగా బతకాలనుకుంటే పాతాళానికి వెళ్లండి లేకుండే నా కరవాలానికి తలవంచండి అంటూ దుష్టులైన వారిని తాను సంహరించింది.
ఆనందరూపిణిగా..
సాధు సజ్జనులందరూ ఆనందచిత్తులై ఆనందరూపిణిగా అవతరించిమని క్రోధావేశాన్ని తగ్గించుకోమని అమ్మను అర్థించారు. అమ్మను వివిధస్తులతో పొగిడారు. అర్పించారు. అమ్మ శాంతించింది. తన బిడ్డలపై అమృతాన్ని వర్ణించింది. అమ్మను మంగళప్రదాయినిగా కీర్తించారు త్రిమూర్తులు. ఆ అమ్మనే నవరాత్రులలో నవాలంకారాలతో పూజిస్తారు.తిథి, వారం, వర్జ్యము, తారాబలం, గ్రహబలం, ముహూర్తం చూడకుండా ఏపనినైనా విజయదశిమి (dussehra storie 2022) నాడు ప్రారంభిస్తే ఆ పని నిర్విఘ్నంగా జరిగి విజయం చేకూరుతుందని చతుర్వర్గ చింతామణి చెప్తుంది.
ఉపాధ్యాయులు ఈ పండుగ (dussehra storie 2022) దినాలలో పిల్లల చేత విల్లంబులు చేయించి, బాణం చివరి భాగాన పూమడతలో బుక్కాపూలు ఉంచి, వారిని వారి వారి ఇండ్లకు తీసుకుని వెళ్తూ, బుక్కాలు చల్లిస్తూ అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు అంటూ పాటలు పాడించే సంప్రదాయమూ మనదే. కొందరు బొమ్మల కొలువు పేర్చి నలుగురికి పండు తాంబూలాలిచ్చి దీవెనలందుకుంటారు.