Duplicate Tea powder

Duplicate Tea powder: య‌ధేచ్చ‌గా న‌కిలీ టీపొడి వ్యాపారం సీజ్ చేసిన పోలీసులు

Andhra Pradesh
Share link

Duplicate Tea powder మండ‌పేట: ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా మండ‌పేటలో న‌కిలీ టీపొడి వ్యాపారం య‌థేచ్ఛ‌గా కొన‌సాగుతుంది. స్థానిక ప్ర‌జ‌ల ఫిర్యాదు మేర‌కు పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు. మండ‌పేట త‌ర్వాణిపేట టీచ‌ర్స్ వీధిలో ఓ ఇంట్లో భారీ ఎత్తున న‌కిలీ టీపొడి ఉన్న‌ట్టు ప్ర‌జ‌లు అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాన్ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్ర‌వారం టౌన్ సిఐ దుర్గా ప్ర‌సాద్ అక్క‌డికి చేరుకుని 35 కిలోల బ‌రువు గ‌ల 25 బ‌స్తాలు న‌కిలీ టీపొడిని గుర్తించి సీజ్ చేశారు. ఈ స‌మాచారాన్ని జిల్లా ఆహార క‌ల్తీ నిరోధ‌క అధికారుల‌కు (Duplicate Tea powder)అందించారు.

జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి బుర్ల శ్రీ‌నివాస్ మండ‌పేట‌లో న‌కిలీ టీపొడి స్థావ‌రాన్ని ప‌రిశీలించారు. అక్క‌డ శాంపిళ్లు సేక‌రించి హైద‌రాబాద్ ల్యాబ్‌కు పంపారు. అక్క‌డ నుంచి నివేదిక వ‌చ్చే వ‌ర‌కు స‌రుకును ఫ్రిజ్ చేసిన‌ట్టు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఆహార ప‌దార్థాలు క‌ల్తీ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

2006 చ‌ట్టం ప్రకారం క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని తెలిపారు. ఆరోగ్యానికి హానిక‌ర‌మైన రంగుల‌ను క‌లుపుతూ ప్ర‌జ‌ల‌కు హాని క‌లిగించే టీ పొడిని(Duplicate Tea powder) త‌యారు చేస్తున్నార‌ని కొంద‌రు చేసిన ఫిర్యాదు మేర‌కు స్థానిక 5వ వార్డులో టీచ‌ర్స్ వీధిలో మండా స‌త్యానారాయ‌ణ అనే వ్యాపారి వ‌ద్ద త‌నిఖీ చేశామ‌న్నారు. భారీ ఎత్తున టీ పొడి నిల్వ‌లు చేసిన‌ట్టు మండ‌పేట సీఐ దుర్గా ప్ర‌సాద్‌కు ఫిర్యాదు అందింద‌న్నారు. 35 కేజీల చొప్పున‌, ఇరువై సంచుల నుండి అనుమానిత టీపొడి న‌మూనాలను సేక‌రించామ‌న్నారు. నివేదిక వ‌చ్చిన అనంత‌రం వీటిని మార్కెట్‌కు పంపాల‌ని ఆదేశించారు.

న‌కిలీ భ‌ర‌తం ప‌డ‌తాం: క‌మిష‌న‌ర్‌

న‌కిలీ భ‌ర‌తం ప‌డ‌తామ‌ని ఆహార ప‌దార్థాల క‌ల్తీ నియంత్ర‌ణ క‌మిష‌న‌ర్ బుర్ల శ్రీ‌నివాస్ అన్నారు. త‌మ బృందంతో త‌నిఖీలు నిర్వ‌హించామ‌ని తెలిపారు. గ‌తంలో రెండు నెయ్యి త‌యారీ కేంద్రాలు, రెండు స్వీట్ షాపులు, రెండు హోల్ సేల్ రిటైల్ కిరాణా షాపులో త‌నిఖీలు చేశామ‌న్నారు. ఆహార ప‌దార్థాల న‌మూనాను ప‌రీక్ష‌ల నిమిత్తం హైద‌రాబాద్ త‌ర‌లించామ‌న్నారు. మండ‌పేట‌లో మొత్తం 23 శాంపిళ్ల‌ను సేక‌రించామ‌న్నారు. వాటిలో 8 శాంపిళ్ళు క‌ల్తీగా నిర్థార‌ణ అయిన‌ట్టు చెప్పారు.

రెండు శాంపిళ్లు సుర‌క్షితం కాద‌న్నారు. మిగ‌తా ఆరు నాసిర‌కం అని తేలింద‌ని పేర్కొన్నారు. మారేడుబాక శివారు పంట‌పొలాలులో ఉన్న నెయ్యి ఫ్యాక్ట‌రీలో నాలుగు శాంపిల్స్ సేక‌రించ‌గా నాసిర‌కంగా నివేదిక వ‌చ్చాయ‌ని ధ్రువీక‌రించారు. ఆ సంస్థ‌పై జిల్లా జెసి కోర్టులో కేసు న‌మోదు చేశామ‌న్నారు. త్వ‌ర‌లోనే ఆ సంస్థ‌కు జ‌రిమానా విధిస్తార‌ని తెలిపారు. కాగా ఇప్ప‌టికీ ఆయా నెయ్యి ఫ్యాక్ట‌రీలో య‌థేచ్ఛ‌గా క‌ల్తీ సాగుతోంద‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.

See also  Huge Explosion : క‌డ‌ప‌జిల్లాలో ఘోర ప్ర‌మాదం..ముగ్గురాళ్ల‌లో పేలుడుకు 10 మంది మృతి

Leave a Reply

Your email address will not be published.