dumbu cortoonist చెన్నై: ప్రముఖ చిత్రకారుడు సుబ్బరాయశాస్త్రి(బుజ్జాయి) ఇక లేరు. సుప్రసిద్ధ రచయిత దేవులపల్లి కృష్ణ శాస్త్రి కుమారుడైన సుబ్బరాయశాస్త్రి చెన్నైలోని గురువారం రాత్రి మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలరు. ఆయన తన కుమారనికి తన తండ్రి పేరు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి అని పెట్టుకున్నారు. కూమారుడు కూడా రచయిత, బుజ్జాయి కుమార్తె రేఖ సుప్రియ సీనియర్ సినీనటుడు నరేష్ మాజీ భార్య. ఆమె కుమారుడు తేజ. bujjai రెండవ కుమార్తె లలిత రామ్ కూడా(dumbu cortoonist) తెలుగు రచయిత్రి.
1931 సంవత్సరంలో సెప్టెంబర్ 11 సుబ్బరాయశాస్త్రి జన్మించారు. అతను ఏ రోజునా పాఠశాలకు వెళ్లకపోయినా ఆయన తనకుంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ డుంబు సృష్టికర్త ఈయనే. పంచతంత్ర కథలకు ముచ్చటైన బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లిలో 1963 నుంచి 68 వరకూ సీరియల్‌గా ప్రచురించారు. ప్రస్తుతం సుబ్బరాయశాస్త్రి వయసు 91 సంవత్సరాలు. సుబ్బరాయశాస్త్రి మృతి పట్టల పలువురు ప్రముఖులు, చిత్రకారులు సంతాపం తెలుపుతూ నివాళి ప్రకటిస్తున్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!