dry skin problem చర్మంలో తేమ ఉన్నప్పుడే ముఖం తాజాగా కనిపిస్తోంది. ఆ తేమ కోల్పోతే పొడిగా, ఎండిపోయినట్టు మారుతుంది. రోజులో ఎప్పుడు స్నానం చేసినా, ముఖం తుడుచుకున్నా వెంటనే మంచి మాయిశ్చరైజర్ క్రీంని రాసుకోవాలి. బాదం నూనె, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె దేనితోనైనా అప్పుడప్పుడు స్నానానికి ముందు శరీరానికి, ముఖానికి బాగా మర్దన చేసుకోవాలి. దీనివల్ల ఒంట్లో ఉన్న తేమ బయటకు పోదు. దీనివల్ల డీహైడ్రేషన్ సమస్య దరిచేరదు. చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. స్నానం చేసేటప్పుడు మరీ వేడినీటిని వాడటం మంచిది కాదు. గాఢత ఎక్కువుగా ఉండే సబ్బులూ, జెల్లు కూడా వాడకూడదు. వీటివల్ల చర్మం పొడిబారిపోయే అవకాశం(dry skin problem) ఉంది.


చలికి చర్మం పొడిబారడం వల్ల ఏర్పడే దురద, దద్దుర్లు వంటివి పోవాలంటే కొబ్బరినూనెలో కొన్ని మెంతులు వేసి మరగబెట్టి, గోరువెచ్చగా అయ్యాక ఒంటికి రాసుకోవాలి. స్నానం చేసే నీటిలో రెండు చుక్కల కొబ్బరి నూనె వేసినా మంచి ఫలితం ఉంటుంది. రెండు చెంచాల తులసిపొడి, చెంచా పాల మీగడ, సెనగపిండి కలిపి మరీ జారుగా కాకుండా చేసుకోవాలి. దురదతో ఇబ్బందిగా అనిపించిన ప్రదేశాల్లో ఈ మిశ్రమం రాసుకుంటే ఉపశమనం ఉంటుంది.
చలికాలంలో మాడు పొడిబారి దురదపెడుతుంది. కొబ్బరినూనెలో రెండు చుక్కల వెనిగర్ కలిపి ఆ మిశ్రమంలో దూది ముంచి రాసుకుంటే సరిపోతుంది. కలబంద గుజ్జులో అంతే పరిమాణంలో బొబ్బాయి గుజ్జుని కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి, జుట్టుకి రాసుకుని ఆరనివ్వాలి. దీని వల్ల చర్మంలో తేమ పెరిగి తాజాగా కనిపిస్తుంది. దురద సమస్య తప్పుతుంది


నల్లమచ్చలు: ఆముదంలో దూదిని ఉండలుగా చేసి ఉంచాలి. కాసేపయ్యాక ముఖం, మెడనూ ఆ దూదితో రుచ్చుకోవాలి. గంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మంపై నల్లమచ్చలూ గాయాలు, చర్మ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
తామర: దీంతో బాధపడేవారు మరిగించిన కొబ్బరి నూనెలో కొద్దిగా ఆముదం కలపాలి. దూదితో ఈ నూనెను ఆ ప్రాంతంలో రాసి, పైన కాస్త పొడి దూది ఉంచి ప్లాస్టర్ అంటించాలి. ఇలా చేస్తే మర్నాటికి దురదా, మంటా బాధించవు.
ముడతలు: ఆముదాన్ని గోరువెచ్చగా చేసి రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. కాసేపయ్యాక ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటే మర్నాటికి చర్మం మృదువుగా తయారవుతుంది. ముడతలు క్రమంగా తగ్గుతాయి.


యాక్నే : ఆముదంలో యాక్నేకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే గుణాలు ఎక్కువుగా ఉంటాయి. ఈ సమస్యతో బాధపడేవారు రోజూ రాత్రిపూట వేణ్నీళ్లతో ముఖం కడుక్కోవాలి. తరువాత ఆముదంతో గుండ్రంగా మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే చన్నీళ్లతో కడిగేసుకుంటే సరిపోతుంది.
పొడిచర్మం: పొడి చర్మం ఉన్నవారికి చర్మం పొట్టుగా రాలిపోతుంది. అలాంటి వారు ఆముదాన్ని స్నానానికి ఉపయోగించే నీళ్లలో నాలుగు చుక్కలు కలిపితే సరి! చర్మం మృదువుగా మారుతుంది.
జుట్టు: ముందురోజు రాత్రి తలకు ఆముదంతో మర్దన చేసుకుని మర్నాడు తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!