Dry Grapes | డ్రై ఫ్రూట్స్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇందులో కిస్ మిస్ ఫ్రూట్స్‌ను పిల్లలకు ఇవ్వడం ద్వారా వారు పెరుగుదలకు ఉపకరిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎండు ద్రాక్ష(Raisins)ల్లో సుక్రోస్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్స్, అమినో యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువుగా ఉన్నట్లైతే ఎండుద్రాక్షాలను తీసుకోవడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. తద్వారా శరీరంలో రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.
పచ్చ కామెర్ల వ్యాధిగ్రస్తులు రోజు రెండు ఎండు ద్రాక్ష(Grapes)లను తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇందులో క్యాల్షియం పిల్లల్లో ఎముకల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలకు ఇచ్చే పాలను వేడిచేసేటప్పుడు రెండు ఎండు ద్రాక్షాలను నులిపి వేసి మరగించాలి. ఆ తర్వాత ఆ పాలను వడగట్టి పిల్లలకు ఇస్తే పుష్టిగా తయారువుతారు. పిల్లలు పెరుగుదలకు, గర్భిణీ మహిళలకు ఎండు ద్రాక్షలు ఎంతగానో మేలు చేస్తాయి. గుండెను పదిలం చేసే ఎండు ద్రాక్షల్లో విటమిన్ బి, ఫాస్పరస పుష్కలంగా ఉన్నందున వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Dry Grapes | ఎండు ద్రాక్ష మరికొని ప్రయోజనాలు!

ఎండు ద్రాక్షలు శరీరానికి కావాల్సిన బలాన్నిస్తాయి. ఎండుద్రాక్షలో ఫాస్పరస్, విటమిన్స్ ఎ, బి1, బీ2, బీ3, బీ6, బీ12, అమినో యాసిడ్స్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. పెరిగే పిల్లల్లో ఎండుద్రాక్ష బలాన్నిస్తాయి. ఇందులోని క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిల్లల దేహపుష్టికి రోజు నిద్రించే ముందు పాలలో ఎండు ద్రాక్షాల్ని వేసి మరిగించి తాగించాలి. ఇలా చేస్తే శరీరానికి తగిన శక్త లభించడంతో పాటు జీర్ణ సమస్యలు ఉండవు. గొంతునొప్పితో బాధపడేవారు పాలలో మిరియాల పొడి చిటికెడు, ఎండు ద్రాక్షల్ని వేసి మరిగించి తాగితే ఉపశమనం లభిస్తుంది. గర్భిణీ మహిళలు ఎండు ద్రాక్షల్ని పాలలో వేసి తీసుకుంటే గర్భస్థ శిశువుకు ఎంతో మేలు చేకూరుతుంది. ఎండు ద్రాక్షల్ని అలాగే తీసుకుంటే గుండె పల్స్ రేటు పెరుగుతుంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ