Dry Dates Benefits: నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఖర్జూరాల మధురం గురించి మాటల్లో చెప్పలేం. ఇవి పదార్థాలకు అదనపు రుచిని అందించడమే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు. ఈ తియ్యని ఫలా లను అవగాహనతో తీసుకుంటే Dry Dates Benefits, ప్రయోజనాలు ఇంకెన్నో!.
రుచిగా ఉన్నాయి కదాని ఖర్జూరాలను ఎక్కువగా తినడం మంచిదికాదు. వీటిలో ఫ్రక్టోజ్ చక్కెర్ల శాతం అధికం. కాబట్టి లావుగా ఉన్నవారు చాలా మితంగా తినాలి. అలాంటి వారు రసంలా కాకుం డా రోజుకు రెండు చొప్పున తీసుకుంటే బరువు Weight, నియంత్రణలోకి వస్తుంది. చాలా మంది తెలియక ఆహారం, పాలు, మిఠాయిల తో కలిపి తీసుకుంటారు. కానీ దానివల్ల ఊబకాయం obesity, సమస్య బాధిస్తుంది. ఇక వీటిలో పీచు, పిండి పదా ర్థాలు, ప్రోటీన్లు ఉండటం వల్ల అరగానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి కడుపులో మంట, అజీర్తితో బాధపడేవారు చాలా తక్కువగా తీసుకోవాలి.
Dry Dates Benefits: వాడితే ఉపయోగాలివి!
నెలసరికి ముందు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. వీటిలోని ఖనిజాలు, మాంస కృత్తులు హార్మోన్లకు సహకరిస్తాయి. అయితే ఖర్జూరాల్లో దొరికే ఇనుము, క్యాల్షియం మాత్రం నెలసరి సమస్యలను, నడుము, నరాల నొప్పులను అదుపులో ఉంచుతాయి. బలహీనంగా ఉండే వారు భోజనానికి రెండుమూడు గంటల ముందు తింటే శరీరానికి సత్వర శక్తి అందుతుంది. అలానే మేక పాలల్లో నానబెట్టి తేనెతో తీసుకున్నా మంచిదే. ఇక, బరువు పెరగాలను కొన్న వారు భోజనా నంతరం తింటే ఫలితం ఉంటుంది.
గర్భిణులు రోజుకి ఎనిమిది నుంచి పది తీసుకుంటే నీరసం, రక్తాల్పత, క్యాల్షియం లోపాలు దూర మవుతాయి. పిండం ఎదుగుదల కూడా మెరుగ్గా ఉంటుంది. బాలింతలు భోజనానికి రెండు గంటల ముందు తీసుకుంటే పాలు బాగా పడతాయి. అంతేకాదు నడుము, నరాల నొప్పులు కూడా దూరమవుతాయి. నాలుగైదు పళ్ళను కరివేపాకులో కలిపి దంచి రసం తీసుకోవాలి. దీనిలో లభించే మెగ్నీషియం Magnesium, బీపీని నియంత్రణలో ఉంచుతుంది.
క్రీడాకారులు, Gym లో కుస్తీలు పట్టేవారు త్వరగా అలసిపోతుంటారు. అలాంటివారు వీటిని బాదం, అంజీర్‌తో తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. విరేచనాలతో బాధపడేవారు ఎండు ఖర్జూరాలను ఉడికించి ఆ రసం పాలలో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. జ్వరంగా ఉన్నప్పుడు తింటే తక్షణ శక్తి అందుతుంది. అదే బత్తాయి Battai, రసంతో తీసుకుంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
రక్త విరేచనాలు వేధిస్తుంటే రెండు ఖర్జూరాలను గుజ్జుగా చేసి అందులో చిటికెడు మిరియాల పొడి చల్లి తింటే చక్కటి ఫలితం ఉంటుంది. మలబద్ధకంతో బాధపడేవారు వీటిని అంజీర్ పళ్ళలో కలిపి నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి.
జాగ్రత్తలు: కడుపులో మంట ఉన్నవారు వీటిని తినకపోవడం మేలు. నిలవ ఉన్న వాటిని వేణ్నీళ్లలో ఉంచి పావుగంటయ్యాక నీళ్ళు ఒంపి తినాలి. ఇవి అరగడానికి మూడున్నర గంటలు పడుతుంది. దీనికి విరుగుడు వేడి, వాము నీళ్ళు.