Drusyam2 Launch :Hyderabad: దృశ్యం2 తెలుగు రీమేక్ మంగళవారం లాంచ్ అయ్యింది.:Hyderabad: దృశ్యం2 తెలుగు రీమేక్ మంగళవారం లాంచ్ అయ్యింది. ఈ సినిమాలో హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దృశ్యం2 సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మూవీ దర్శకుడు జీతు జోసెఫ్, నిర్మాత సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ మూవీ రాబోతుంది. కరోనా నేపథ్యంలో పరిమిత సిబ్బందితో షూటింగ్ నిర్వహించనున్నారు. విక్టరీ వెంకటేష్, మీనా ఆధ్వర్యంలో వచ్చిన దృశ్యం 1 సినిమా సూపర్ హిట్ ను అందుకుంది. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమా ప్రతి కుటుంబాన్ని ఆలోచింపజేసింది. దృశ్యం సినిమా మలయాళంలో మోహన్‌లాల్, మీనా ఆధ్వర్యంలో 2013లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గుర్తింపు తెచ్చుకుంది. ఇండియా సినిమాకు ఇంత క్రేజ్ ఉందా అనే రీతిలో మళయాళం దృశ్యం సినిమా అంచనాలను తిరగరాసింది. ఈ సినిమాను మళయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించారు.
దృశ్యం సినిమా పూర్తిగా భావోద్వేగాలతో కూడిన మర్డర్ మిస్టరీని జోడించి దర్శకుడు కథను తయారు చేశారు. ఈ సినిమాకు ఇండియా వ్యాప్తంగా ఫిదా అయ్యింది. సినిమా తెలుగు, కన్నడ, తమిళ, హిందీలో కూడా రీమేక్ అయ్యింది. తొలిభాగంలో నటించిన వాళ్లంతా రెండో భాగంలోనూ కంటిన్యూ అవుతున్నారు. మళయాళంలో ఈ సినిమాను కేవలం 46 రోజుల్లోనే పూర్తి చేశారు దర్శకుడు.
ఇది చదవండి:మయన్మార్ లో ఆగని నిరసనలు! నిర్భంధంలోనే సూచీ!
ఇది చదవండి:ముఖానికి కవర్‌తో నైట్రోజన్ గ్యాస్ పీల్చి యువకుడు ఆత్మహత్య
ఇది చదవండి: రూ.500 కే టివీ అంట..ఆరా దీస్తే!
ఇది చదవండి:సగటు వాలంటీర్ లోపల ఆవేదన ఇదేనేమో!?
ఇది చదవండి:వత్సవాయి : టిడిపి కార్యకర్త వాహనానికి నిప్పు!
ఇది చదవండి:దైవదర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదం