జాతీయం

driver love affair: మంత్రి కూతురితో ప్రేమాయాణం ప్రాణ‌హాని ఉంద‌ని డ్రైవ‌ర్ సెల్పీ వీడియో!

driver love affair

driver love affair: చెన్నై: ఇడియ‌ట్ సినిమా అంద‌రికీ గుర్తుంది క‌దా! అందులో ఒక డైలాగ్ ఉంటుంది. క‌మీష‌న‌ర్ కూతుళ్ల‌కు మొగుళ్లు రారా అని హీరో ర‌వితేజ చాలా వీరావేశంతో డైలాగ్స్ చెబుతాడు. క‌మీష‌న‌ర్ కూతురిని కానిస్టేబుల్ కొడుకు ప్రేమించాడ‌ని అత‌డిపై దాడి చేయిస్తాడు. అయిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు క‌మీష‌న‌ర్ కూతురినే పెళ్లి చేసుకొని త‌న ప్రేమ గ‌ట్టిద‌ని నిరూపిస్తాడు.

ఇప్పుడు ఇదే రీతిలో ఓ మంత్రి కూతురితో డ్రైవ‌ర్ ప్రేమ వ్య‌వ‌హారం(driver love affair) న‌డిపిన సంఘ‌ట‌న త‌మిళ‌నాడు లో చోటు చేసుకుంది. మంత్రి శేఖ‌ర్ బాబు కూతురును డ్రైవ‌ర్ స‌తీష్ కుమార్ ప్రేమించాడు. కొన్నాళ్ల‌పాడు సాగిన వీరి ప్రేమ వ్య‌వ‌హారం చివ‌ర‌కు మంత్రికి తెలిసింది. దీంతో మంత్రి ఆగ్ర‌హంతో డ్రైవ‌ర్ స‌తీష్‌ను కొట్టించిన‌ట్టు తెలుస్తోంది.

త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని తెలిసి డ్రైవ‌ర్ స‌తీష్ ఓ సెల్ఫీ వీడియో విడుద‌ల చేశారు. మంత్రి కూతురు నేను ఆరేళ్లుగా ప్రేమించుకున్నాం. మంత్రి శేఖ‌ర్ బాబు మా పెళ్లికి ఒప్పుకోవ‌డం లేదు. మా కుటుంబ స‌భ్యుల‌ను పోలీసుల‌తో కొట్టించారు. ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు. మంత్రి నుంచి నాకు ప్రాణ‌హాని ఉంది. అంటూ ఓ వీడియోలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

driver love affair with DMK minister’s daughter release selfie video

See also  School Closed : పంజాబ్‌లో స్కూళ్లు మూత

Comment here