drink cold water after eatingబాగా దాహం వేస్తున్నప్పుడు లేదా ఎండలో తిరిగి రాగానే చల్లటి నీళ్లు తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే చాలా మంది తమ ఇళ్లల్లో ఫ్రిజ్లో బాటిళ్లలో నీళ్లు నింపి పెట్టుకుంటూ ఉంటారు. కొంత మందికి బయట వాతావరణంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఫ్రిజ్లో నీళ్లే కావాలి. భోజనం చేసిన తర్వాత కూడా చల్లటి నీళ్లు తాగితే ఎంతోహాయిగా అనిపిస్తుంది. అయితే ఆహారం తీసుకున్న తరువాత చల్లటి నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది(drink cold water after eating) కాదని జపాన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది.
భోజనం చేయగానే చల్లటి నీరు తాగితే అది భోజనంలోని నూనెలతో కలిసి ఆహారాన్ని జిగటగా ఉండే ఘన పదార్థాలుగా చేస్తుంది. ఫలితంగా ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లకుండా ఆహార నాళంలో నుంచి కింది వరకూ అతుక్కుంటుంది. దీని వల్ల ఆహారం జీర్ణం కావడం ఆలస్యమవుతుంది. చల్లటి నీరు తాగడం కొన్ని సందర్భాల్లో కొవ్వు పదార్థాలు అధికంగా ఉత్పత్తి కావడానికి కారణమవుతుంది. ఆహారం తీసుకోగానే చల్లని నీరు తాగవద్దని, గోరు వెచ్చని నీటిని తాగమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గోరు వెచ్చని నీటిని తీసుకుంటే అది పదార్థాలలోని నూనెను కరిగించి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుందట.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?