Dried mango leaves కేరళ: మామిడి పండ్లను కొనేవారిని చూశాం. బాగా తినేవారినీ చూశాం. కానీ ఈ విచిత్రమేమిటో ఎండిపోయిన ఆకులను కొనేవారిని ఎప్పుడైనా చూశారా? ఇలా అనగానే బుర్ర తక్కువ వారేమో అని కూడా అనుకోవచ్చు. కానీ ఇది పచ్చి నిజమండీ బాబూ! కేరళలోని ఓ కంపెనీలోని మామిడి ఆకులను రూ.150 కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఆర్గానిక్ పళ్లపొడిని తయారు చేసేందుకు అంట. పేటెంట్ హక్కులు పొందిన ఈనో వెల్ నెస్ నికా అనే సంస్థ మామిడి ఆకులు కొంటామని బహిరంగంగా ప్రకటించింది. త్వరలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు ముడి సరుకు కొనుగోలుపై దృష్టి సారించింది. కన్నూర్, కాసర్ గోడ్ ప్రాంతాల్లోని గ్రామాలన్నింటికీ సిబ్బందిని పంపి ఎండిన మామిడి ఆకులను సేకరిస్తోంది ఈ సంస్థ. డబ్బులు వద్దనుకున్నవారికి ప్రతి రెండు కిలోల (Dried mango leaves)మామిడి ఆకులకు ఆ సంస్థలో ఒక షేరును కేటాయిస్తోంది.
ఇదేదో వ్యాపారం బాగానే ఉంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వుంటే మాత్రం ఈ పాటికి మామిడి చెట్ల కింద ఉన్న ఆకులు ఎప్పుడో పోగై తోటంతా శుభ్రమయ్యేది. ఏదైమనా ఇది కాస్త నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ ఎండిన మామిడి ఆకుల పళ్లపొడి వచ్చేదాకా మనం ఎదురు చూడాల్సిందే మరీ!.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ