Heroin drug : కోట్ల విలువ చేసే హెరాయిన్ ప‌ట్టివేత‌

Heroin drug : ముంబై : కోట్ల విలువ చేసే హెరాయిన్ ప‌ట్టివేత‌ముంబైలో భారీ మొత్తంలో హెరాయిన్ ప‌ట్టుబ‌డింది. ఆఫ్గ‌నిస్తాన్ నుంచి భార‌త‌దేశానికి అక్ర‌మంగా త‌ర‌లిస్తోన్న 293.81 కిలోల హెరాయిన్‌ను, డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) ముంబైలో ప‌ట్టుకుంది. అంత‌ర్జాతీయ మార్కెట్ లో దీని విలువ రూ.2,000 కోట్లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ఆఫ్గ‌నిస్తాన్ నుంచి భార‌త్‌లోని పంజాబ్ కు చెందిన ఓ సంస్థ రాళ్ల‌ను దిగుమ‌తి చేసుకుంటోంది. రాళ్లు త‌ర‌లించే లారీలో అక్ర‌మంగా హెరాయిన్‌ను త‌ర‌లిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌నిఖీలు నిర్వ‌హించిన డిఆర్ఐ బృందం 293.81 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న మాద‌క ద్ర‌వ్యాల‌ను సీజ్ చేసి ద‌ర్యాప్తు ప్రారంభించింది.

Share link

Leave a Comment