Core Web Vitals Assessment: dreams psychological facts: వ్యాయామ క‌ల‌తో దేహ‌దారుఢ్యం..ఇక చేయ‌క‌ప

dreams psychological facts: వ్యాయామ క‌ల‌తో దేహ‌దారుఢ్యం..ఇక చేయ‌క‌పోయినా ప‌ర్వాలేదేమో!

dreams psychological facts పొద్దున్నే లేచి వ్యాయామం చెయ్యాల‌నీ, ఆరు ప‌ల‌క‌ల దేహం సాధించాల‌ని ఎవ‌రికి ఉండ‌దు చెప్పండి? కానీ, గ‌బ‌గ‌బా త‌యారై, ర‌ద్దీ రోడ్డెక్కితేగాని స‌కాలంలో కార్యాల‌యాలు, క‌ళాశాల‌ల‌కు చేర‌లేం. ఇక వ్యాయామానికి వీలెక్క‌డిద‌ని? నిజ‌మేగానీ, ఇలాంటి వారి కోసం ప్ర‌త్యామ్నాయాన్ని చూపిస్తున్నారు ప‌రిశోధ‌కులు. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా వ్యాయామం చేస్తున్న‌ట్టు క‌ల‌గ‌నండి. క‌ళ్లు మూసుకుని, ఇష్ట‌మైన క‌స‌ర‌త్తుల‌పై దృష్టి పెట్టండి. ఉక్కు కండ‌రాలు సొంత‌మైన‌ట్టు ఊహించండి. కొద్ది రోజుల్లోనే మీకు కండ‌పుష్టిఖాయం అంటున్నారు. బ్రిట‌న్ (dreams psychological facts) శాస్త్ర‌వేత్త‌లు.

వ్యాయామం చేస్తున్న‌ట్టు ఊహించ‌డం ద్వారా కండ‌రాల్లో క‌లిగే మార్పుపై ల‌ఫ్‌బ‌రా విశ్వ‌విద్యాల‌యానికి చెందిన డా.మైకేల్ ఇందులో భాగంగా ఇటీవ‌ల అధ్య‌య‌నం సాగించింది. ఇందులో భాగంగా ఏడుగురితో వ్యాయామంపై మాన‌సిక అభ్యాసం చేయించారు. మొద‌ట యంత్రాల‌పై వారితో నిజంగానే క‌స‌ర‌త్తు చేయించారు. ఆ స‌మ‌యంలో వారి కండ‌రాల ప‌రిమాణం, శ‌క్తి ప్ర‌యోగాన్ని ఆల్ట్రాసౌండ్ సాయంతో కొలిచారు. ఆ త‌ర్వాతి నుంచి మాత్రం అవే క‌స‌ర‌త్తుల‌ను చేస్తున్న‌ట్లు మ‌న‌సులో ఊహించాల‌ని వారికి చెప్పారు.

ఇలా వారానికి ఐదు రోజుల చొప్పున‌, రోజూ పావుగంట సేపు వ్యాయామం చేస్తున్న‌ట్టు వారంతా ఊహించారు. నెల రోజుల త‌ర్వాత మ‌ళ్లీ ఆల్ట్రాసౌండ్ ప‌రీక్ష చేయ‌గా.. స‌గ‌టున ప్ర‌తి ఒక్క‌రూ 8% శ‌క్తి పొంద‌కున్నార‌ని, కొంద‌రిలో అది 33% న‌మోదైన‌ట్టు గుర్తించారు. ఇది ఊహించ‌ని ఫ‌లిత‌మ‌ని డా.మోస్లే విస్మ‌యం వ్య‌క్తం చేశారు. కండ‌లో మార్పు లేక‌పోయినా, వ్యాయామం చేసిన‌ప్పుడు క‌లిగే ఉత్తేజాన్ని, శ‌క్తిని మాత్రం వీరు పొందిన‌ట్టు చెప్పారు. మాన‌సిక శిక్ష‌ణ వ‌ల్ల మెద‌డు వ్యాయామాల గురించి ఆలోచిస్తుంద‌ని, త‌ద్వారా కండరాల‌పై ఆ ప్ర‌భావం ప‌డుతున్న‌ట్టు గుర్తించామ‌ని ఆయ‌న వివ‌రించారు.

క‌ల‌ల‌ను అదుపుచేసే ప‌రిమ‌ళాలు

ఎటువంటి మూడ్ నైనా సువాస‌న‌భ‌రిత ప‌రిమ‌ళాలు ఇట్టే మార్చేస్తాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే సువాస‌న‌లు క‌ల‌ల‌ను అదుపు చేస్తాయంటే న‌మ్మ‌గ‌ల‌రా అవును అంటున్నారు ప‌రిశోధ‌క‌లు. పిల్ల‌ల నుంచి పెద్ద‌ల దాకా అంద‌ర్నీ ఈ క‌ల‌లు త‌న మాయాజాలంలో ప‌డేస్తాయి. ఒక్కోసారి క‌ల‌లు భ‌య‌పెడితే, ఇంకోసారి హాయినిస్తాయి. క‌ల‌లు నిజం కాక‌పోయినా ఆ కొద్దిసేప‌టికీ నిజంలా అనిపిస్తాయి. అందుకే క‌ల క‌లేన‌ని తెలిసినా ఎందుకో క‌ల‌లు కూడా మంచివే రావాల‌ని కోరుకుంటాం. కానీ క‌లల్ని మ‌న‌మెలా శాసిస్తాం చెప్పండి. మంచివి మాత్ర‌మే రావాల‌ని, చెడ్డ క‌ల‌లు రాకూడ‌ద‌ని క‌దా! కానీ కొంత‌వ‌ర‌కు ప్ర‌భావితం అయితే చెయ్యొచ్చు అంటున్నారు జ‌ర్మ‌నీకి చెందిన ప‌రిశోధ‌కులు.

మ‌నకొచ్చే క‌ల‌లు మనం పీల్చే వాస‌న‌ల మీద ఆధార‌ప‌డి ఉంటాయ‌ట‌. అంటే మంచి వాస‌న‌ల‌ను పీల్చిన‌ప్పుడు పాజిటివ్ క‌ల‌లు, చెడు వాస‌న‌లు పీల్చిన‌ప్పుడు నెగిటివ్ క‌ల‌లు వ‌స్తాయ‌ట‌. నిద్ర‌పోతున్న వారు అత్య‌ధిక గాఢ‌త క‌లిగిన మంచి, చెడు వాస‌న‌ల‌నూ పీల్చేలా చేసి, వారి క‌ల‌ల్లో త‌లెత్తే మార్పుల్ని ప‌రిశీలించారు జ‌ర్మ‌నీకి చెందిన హీడెల్ బ‌ర్గ్ యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు. శాస్త్ర‌వేత్త‌లు జ‌రిగిపిన ప‌రిశోధ న‌ల్లో భాగంగా మంచి నిద్ర‌లో ఉన్న వారికి కుళ్లిన కోడిగుడ్డు వాస‌న చూపించార‌ట‌. దీంతో ఆ వాస‌న పీల్చినప్పుడు వారికి ప్ర‌తికూల భావాలంటే క‌ల‌లు రావ‌డం గ‌మ‌నించారు. అలాగే గులాబీ పూల సువాస‌న పీల్చేలా చేసిన‌ప్పుడు సానుకూల‌మైన క‌ల‌లు రావ‌డం గుర్తించారు.

వాస‌న‌లు అవి క‌ల‌ల‌పై చూపించే ప్ర‌భావం గురించి ఇంత‌టి ప‌రిశోధ‌న ఎందుకు? అంటే స్వాంత‌న చేకూర్చ‌డానికి అంటున్నారు. అంటే, ఏ వాస‌న‌ల‌కి వారు ఎలా స్పందిస్తున్నారో వారి క‌ల‌ల‌ని బ‌ట్టి గుర్తించ‌వ‌చ్చు. దీంతో వారి భావోద్వేగాల‌ని సువాస‌న‌ల ద్వారా నియంత్రించ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు అంటున్నారు ప‌రిశోధ‌కులు. స‌హ‌జంగా కొంద‌రిలో తెలియ‌ని భ‌యాలు, అయిష్టాలు ఉంటాయి. వాటిని పోగొట్టు కోవ‌డం ఎలాగో తెలీక ఇబ్బందిప‌డ‌తారు. అలాంటి వారికి వాస‌న‌ల‌తో వాటిని నియంత్రించ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు అన్న‌ది ఆ ప‌రిశోధ‌న సారాంశం. ఆ దిశ‌గా మ‌రింత ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి కూడా. సువాస‌న‌ల ద్వారా మంచిభావాలు పెంపొందించేందుకు వీల‌యితే అంత‌క‌న్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి. ప్ర‌స్తుతానికైతే క‌ల‌ల‌తో స‌రిపెట్టుకుందాం. క‌నుక‌, ఈ రోజు నుంచి నిద్ర‌పోయే గ‌దిలో మంచి గులాబీల సువాస‌న‌లు వ‌చ్చేలా చూసుకోండి. మంచి మంచి క‌ల‌ల‌లో తేలిపోండి.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *