DRDO : కరోనా వైరస్‌తో అల్లాడిపోతున్న భారత్ ప్రజలకు డిఆర్డిఓ మంచి శుభవార్త చెప్పింది. కరోనా వైరస్‌ను చంపే ఔషధం తయారు చేసినట్టు పేర్కొంది. ఇది త్వరలో అందరికీ అందుబాటులో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
DRDO : భారతదేశ రక్షణ సంస్థ అయిన DRDO తయారు చేస్తున్న కోవిడ్ మందు 2 – డిజి ని ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. మొదట విడతగా 10,000 వేల డోసులు విడుల అవుతున్నాయని తెలిపింది. త్వరలోనే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సహకారంతో ఈ మెడిసిన్ హైదరాబాద్‌లో తయారవ్వబోతున్నట్టు సమాచారం. ఇది ఎలా పనిచేస్తుందంటే మోసగాడ్నే మోసం చేయడం అనే పద్ధతిలో పని చేయబోతుంది. వాస్తవానికి మానవ శరీరంలోకి ఏ వైరస్సైనా ప్రవేశించినప్పుడు శరీరంలోని కణాలతో కలిసి పోతుంది. ఆ కణాలను మోసం చేసి ప్రోటీన్ వాడుకొని 10 వంతుల బలంగా తయారవుతుంది. ఇలా వైరస్ పెరిగేందుకు శరీరం నుంచి గ్లూకోజ్ కణాల అవసరం వైరస్‌కు తప్పకుండా ఉంటుంది. అందువల్ల ఈ చక్కెర అణువుల నుంచి వైరస్‌కు శక్తి వస్తుంది. ఆ శక్తితో మళ్లీ 10 వంతుల పెద్దవుతుంది. ఇలా రక్త భీజునిలా పెరుగుతున్న కణాలతో మన శరీరంలోని తెల్లకణాలు పోరాటం చేస్తాయి. పెరిగే వైరస్ ఎక్కువైనప్పుడు తెల్ల రక్త కణాలు ఓడిపోయి మనిషి మరణించే పరిస్థితి వస్తుంది. ఈ 2 – డిజి మందు వైరస్‌ను మోసం చేసి గ్లూకోజ్ అని భావించేలా చేస్తుంది. ఈ మందు అణువులను మింగిన వైరస్లు సన్నగిల్లి కొత్తవైరస్లను పుట్టించలేక పోతాయి. అదే సమయంలో తెల్లకణాలు మిగిలిన వైరస్‌లను నాశనం చేస్తాయి. ప్రస్తుతం అంచనా ప్రకారం కొన్ని గంటలలోనే కరోనా వైరస్ శక్తి జీరోకి పడిపోతుంది. ఒక వేళ పైన చెప్పిన విధంగా మందు పనిచేస్తే మాత్రం కరోనా వైరస్ ప్రమాదం తగ్గించవచ్చు.

- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి