Dove Letter Storie పారిస్ : ఒక్క క్లిక్.. ఒక్క షేర్… ప్రపంచం మొత్తం ఒక్క క్షణంలో మన సందేశాన్ని చూసి రిప్లై సెకన్లుల్లో ఇచ్చే ఆధునిక టెక్నాలజీ యుగంలో మనం ఉన్నాం. ఎంత టెక్నాలజీ ఉన్నా కొన్ని మధురాను సందర్భాలు, ప్రేమలు, ఆప్యాయతలు, మానవత్వం, బంధుత్వాలు అనే కొన్ని పదాలు కృతిమంగా, తాత్కాలికంగా రూపం మార్చు కున్నాయి. ఒక్కప్పుడు ఒక చిన్న ఉత్తరం ముక్క పై సొంతంగా అక్షరాలతో రాసి పోస్టు మాన్ ఇంటికి వచ్చి ఇస్తే ఆ థ్రిల్లే వేరు కదా. ఆ క్షణాలు అనుభవించిన వారికి మాత్రం మదిలో పదిలంగా ఉండే ఉంటాయి. అయితే విషయానికి వచ్చేద్దాం. ఉత్తరం ముక్క, పోస్ట్ మాన్కు ముందు పక్షులతో సందేశాలు పంపేవారు అని పాఠాల్లోనూ, సినిమాల్లోనూ చూశాం. (Dove Letter Storie) ఆ సందేశం ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చి వైరల్ అవుతుంది.
దుబాటులోకి వచ్చినప్పటికీ కీలక సమాచారాన్ని చేరవేడయం కోసం పావురాల మీద ఆధారపడేవారు. ఇప్పుడు ఇద్దంతా ఎందుకంటే దాదాపు వందేళ్ల క్రితం అంటే మొదటి ప్రపంచ యుద్దం నాటి పావురాయి సందేశం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తూర్పు ఫ్రాన్స్ కు చెందిన ఓ జంట వాకింగ్ కోసం బయటకు వెళ్లారు. వారికి ఓ చిన్న క్యాప్సిల్స్ కనిపించింది. వింతగా ఉండటంతో దాన్ని తెరిచి చూశారు.
ప్రష్యన్ సైనికుడు పావురం ద్వారా పంపిన సందేశం ఇది. కానీ దురదృష్టం కొద్ది అది తన గమ్యస్థానాన్ని చేరుకోలేక పోయింది. ఇక తూర్పు ఫ్రాన్స్ లోని ఓర్బీలోని లింగే మ్యూజియం క్యూరేటర్ డొమినిక్ జార్జి మాట్లాడుతూ.. ఇది మొదటి ప్రపంచ యుద్ధ(1914-10) కాలానికి చెందిన సందేశం. ఇంగర్‌షీమ్‌లోని ఓ పదాతిదళ సైనికుడు తన ఉన్నతాధికారిని ఉద్ధేశిస్తూ జర్మన్‌భాషలో స్వయంగా తన చేతితో రాసిన ఉత్తరం ఇది. దీనిలో అతడు కీలకమైన సైనిక విన్యాసాల గురించి వివరించాడు. అని తెలిపారు. ప్రస్తుతం తూర్పు ప్రాన్స్ లో భాగమైన ఇంగర్‌షీమ్ ఒకప్పుడు జర్మనీలో భాగంగా ఉండేది. ఇక ఈ ఉత్తరం ఈ ఏడాది సెప్టెంబర్ లో సదరు దంపతుల చేతికి చిక్కింది. వారు దీన్ని జార్డికి అందించారు. అతడు ఓ జర్మన్ స్నేహితుడి సాయంతో ఈ మెసేజ్‌ని డీకోడ్ చేశాడు. ఇక ఈ ఉత్తరాన్ని అపూర్వ మైనదిగా పేర్కొన్న జార్డి దాన్ని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాడు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ