double bedroom: ఖమ్మం: నియోజకవర్గంలో అర్హులు అయిన అందరికీ డబుల్ బెడ్ రూం (double bedroom)ఇళ్లు ఇవ్వాలని లేనియెడల ప్రజలు TRS ప్రజా ప్రతినిధులపై తిరుగుబాటు చేస్తారని CPM పార్టీ జిల్లా నాయకులు వై విక్రమ్ హెచ్చరించారు. ఆదివారం రమణగుట్టపై 57వ డివిజన్ CPM పార్టీ శాఖా మహాసభలు జరిగాయి.
ఈ సందర్భంగా పార్టీ జెండాను నగర నాయకులు బోడపట్ల సుదర్శన్ ఎగురవేశారు. అనంతం జరిగిన సభలో వై విక్రమ్ మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా గోడలపై బొమ్మల వేసి ఇదే అభివృద్ధి అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా తమకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని ఒకపక్క ప్రజలు ఆందోళన చేస్తుంటే గోడలపై బొమ్మలు వేసి చూపించడం కాకుండా గోడలతో కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు కనీసం పదిహేను వందల ఇళ్లు ఇవ్వలేని TRS ప్రజా ప్రతినిధులు మరో రెండు సంవత్సరాల్లో ఐదు వేల ఇళ్లు ఎప్పుడు కట్టి ఇస్తారని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంపికలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు అని ఆరోపించారు.
సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలో లబ్దిదారులు పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలని అయిన కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు డి. వీరబాబు, చిరంజీవి, కాంపాటి వెంకన్న, నాగేశ్వరరావు, పి వాసు, సత్యం, బాబు , కుమారి తదితరులు పాల్గొన్నారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?