don’t compare with others:ఇత‌రుల‌తో పోల్చుకోకు..ఒక వేళ పోల్చుకుంటే ఇది చూడు!

don't compare with others

don’t compare with othersకొంద‌ర‌మ్మాయిలు అందం, చ‌దువు, ఉద్యోగం.. ఇలా ఇత‌ర‌త్రా విష‌యాల్లో ఇత‌రుల‌తో పోల్చుకొని ఆత్మ‌న్యూన‌త‌కు లోన‌వుతుంటారు. ఇలాంటి ఆలోచ‌న‌లు ఉంటే ఏ రంగంలోనూ రాణించ‌లేర‌ని నిపుణులు చెబుతున్నారు. ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించాలంటే కొన్ని (don’t compare with others)జాగ్రత్త‌లు తీసుకోవాల్సిందే.

ఇతరుల‌తో పోల్చుకొని బాధ‌ప‌డ‌టం అంటే అది ఆత్మ‌విశ్వాస లేమిని సూచిస్తుంది. అలా కాకుండా మ‌న‌ల్ని మ‌నం ప్రేమించుకోవ‌డం మొద‌లు పెడితే ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. ఏదైనా చేయ‌గ‌ల‌ను అనే ధైర్యం వ‌స్తుంది. చ‌దువు విష‌యంలో ప‌క్క‌వారితో పోల్చుకున్నట్టైతే అది కొంత వ‌ర‌కూ మంచే చేస్తుంది. ఎందుకంటే ఇత‌రులెలా చ‌దువుతున్నారూ.. మ‌నం ఎలా ఉన్నామ‌న్న‌ది తెలుస్తుంది. కానీ ఆలోచ‌న‌లు అక్క‌డితో ఆగిపోకూడ‌దు. ఇత‌రుల‌కు ఎక్కువ మార్కులు ఎందుకొస్తున్నాయి. నాకెందుకు రావ‌ట్లేదు అనేది విశ్లేషించుకుంటే లోపాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. వాటిని స‌రిదిద్ధుకొనే దిశ‌గా ఆలోచిస్తే చ‌దువులో ముందుండ‌టం అంద‌రికీ సాధ్య‌మ‌వుతుంది.

కొంద‌ర‌మ్మాయిలు నేను అందంగా లేను అని బాధ‌ప‌డుతుంటారు. కానీ అందం అనేది ప్ర‌వ‌ర్త‌న‌లో, వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఉంటుంద‌ని అర్థం చేసుకొని న‌డుచుకోవ‌డం మంచిది. అలా బాధ‌ప‌డిన స‌మ‌యంలో అందంతో సంబంధం లేకుండా త‌మ శ‌క్తి సామ‌ర్థ్యాల‌తో ఎన్నో ప్ర‌తిషాత్మ‌క అవార్డులు అందుకున్న వారి గురించి చ‌దివితే ఆ భావ‌న దూర‌మ‌వుతుంది. ఏ విష‌యం గురించైనా, ఏ వ్య‌క్తుల గురించైనా సానుకూలంగా ఆలోచించ‌డం మొద‌లు పెడితే ఇత‌రుల‌తో పోలిక అనే భావ‌న ద‌రి చేర‌దు.

ఆడ‌వారికి కొన్ని స‌ల‌హాలు

  1. మంగ‌ళ సూత్ర‌ములో పిన్నేసులు వంటివి ఉండ‌రాదు.
  2. స్త్రీలు రెండు చేతుల‌కు స‌రిపంఖ్య‌లో గాజులు ధ‌రించాలి, మట్టి గాజులు మాత్రమే ధ‌రించ‌డం మంచిది.
  3. ఇంటిలో గుర్రం బొమ్మ ఉండ‌రాదు అని నేపాలీల న‌మ్మ‌కం, ఒక వేల ఉన్న డబ్బు నిలువ‌ద‌ని అభిప్రాయం.
  4. ఇంటిలో రాధా కృష్ణుని బొమ్మ ఉండుట చాలా మంచిది.
  5. వంట చేయునప్పుడు 2 బియ్య‌పు గింజ‌లు అగ్నికి స‌మ‌ర్పించుట మంచిది.
  6. భ‌ర్త‌ని తాగుడు మాన్పించుట‌కు ఉద‌యం మీ భ‌ర్త టిఫిన్ చేసిన త‌ర్వాత అర చెంచా మంచి క‌ర‌క్కాయ పౌడ‌ర్ 10 చంచెల నీటిలో క‌లిపి తాగించండి. ఇలా చేసిన 60 రోజుల‌లో భ‌ర్త తాగుడు మానుతాడు.
  7. ప‌సుపు రంగు, తెలుపు రంగు పూలు ధ‌రించుట చాలా మంచిది.
  8. ఏ తీర్థ‌ములో నైన రెండు తుల‌సి ఆకులు వేయ‌వ‌లెను.
  9. ఏ రక‌మైన ప‌దార్థ‌ములు ఇంటిలో లేన‌ప్పుడు, భ‌గ‌వంతునికి మంచి నీటిని నైవేద్యం గా పెట్ట‌వ‌చ్చు.
Share link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *