Donate Blood Save Life : ర‌క్త‌దానం చేసేవారు దైవంతో స‌మానం!

0
18

Donate Blood Save Life : ప్ర‌పంచంలో ర‌క్తం స‌కాలంలో దొర‌క్క ఎంతో మంది మ‌నుషులు ప్రాణాలు విడుస్తున్నారు. రోడ్డు ప్ర‌మాదాలు, అనారోగ్య స‌మ‌స్య‌లు, ఆప‌రేష‌న్లు, గ‌ర్భిణులుకు అత్య‌వ‌స‌ర‌మైన స‌మ‌యంలో ర‌క్తం కావాల్సిన‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ స్పందించి ర‌క్తం దానం చేయ‌డం చాలా ప్ర‌ధానం.


Donate Blood Save Life : ర‌క్త దానం అనేది ఒక ప్రాణ దానం లాంటిదే. రోగ నివార‌ణ‌లో భాగంగా ఒకరి బ‌తికించేందుకు మ‌రొక‌రి ర‌క్తం ఇచ్చే విధానాన్నే ర‌క్త‌దానం అంటారు. వాస్త‌వానికి ర‌క్త‌దానం స్వ‌చ్ఛందంగా ఇవ్వాలి త‌ప్ప వ్యాపార దృష్టితో అమ్మ‌కూడ‌దు. ప్ర‌పంచంలో చాలా మంది త‌మ ర‌క్తాన్ని ఇత‌రుల‌కు అంద‌జేసి ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడుతున్నారు. ర‌క్త‌దానం సేవ మాత్ర‌మే కాదు. ప్ర‌తి పౌరుడు బాధ్య‌త హ‌క్కుగా భావించాలి. స‌మ‌యానికి ర‌క్తం అంద‌క ఎంతో మంది వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ప్రాణ‌పాయ స్థితిలో ఉన్న‌వారికి ర‌క్త‌దానం చేస్తే మాన‌వ‌త్వ‌మే మీకు పాదాభివంద‌నం చేస్తుంది.

ర‌క్త‌దానంపై అవ‌గాహ‌న‌!

ర‌క్తం ఎప్పుడు అవ‌స‌రం?
ఒక వ్య‌క్తి (ఆడ‌/మ‌గ‌) అనారోగ్యం కార‌ణంగా, ఆప‌రేష‌న్ స‌మ‌యంలోనూ, ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు ర‌క్తం కోల్పోతుంటారు. అలాంటి వ్య‌క్తుల జీవితాల‌ను నిల‌బెట్టేందుకు ర‌క్తం చాలా అవ‌స‌రం. దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యంలో ర‌క్తం దానం చేయ‌డంతో ఆ కుటుంబానికి మీరు ఎంతో గొప్ప‌వాళ్లు అవుతారు.

స్వ‌చ్ఛంద ర‌క్త‌దాత ఎవ‌రు?
ర‌క్తం ఇవ్వాల‌నే ఆశ‌, ద‌యాగుణం ఉన్న ఎవ‌రైనా కావ‌చ్చు. 18 సంవ‌త్స‌రాలు నుంచి 65 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వ‌య‌స్సు ఉన్న 45 కేజీల బ‌రువుకు త‌క్కువ కాకుండా, ఆరోగ్యంగా ఉండే వ్య‌క్తులు (పు / స్త్రీ) స్వ‌చ్ఛందంగా ర‌క్తం ఇవ్వ‌వ‌చ్చు.

మ‌న‌లో ఎంత ర‌క్తం ఉంటుంది?
మ‌గ‌వారిలో అయితే కేజీ బరువుకు 76 మిల్లీలీట‌ర్ల చొప్పున‌, ఆడ‌వారిలో 66 మిల్లీలీట‌ర్ల చొప్పున ఉంటుంది. కిలోగ్రాము శ‌రీర బ‌రువుకు 50 మిల్లీలీట‌ర్ల ర‌క్తం ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌కు అవ‌స‌రం. మిగిలింది అన‌వ‌రం.(అంటే దానం చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది)

ఎంత ర‌క్తాన్ని దానం చేయ‌వ‌చ్చు?
శ‌రీర బ‌రువులో కేజీకి 8 మిల్లీలీట‌ర్లు చొప్పున దానం చేయ‌వ‌చ్చు. అద‌నంగా ఉండే ర‌క్తంలో ఇది కొంత మాత్ర‌మే.

ఇండియాలోని వ్య‌క్తులు ఎంత ర‌క్తాన్ని దానం చేయ‌వ‌చ్చు?
బ‌రువును బ‌ట్టి ఒక‌సారికి 350/450 మిల్లీ లీట‌ర్లు వ‌ర‌కు ర‌క్త‌దానం చేయ‌వ‌చ్చు.

ర‌క్తంలో ఏముంటుంది?
ర‌క్తంలో ర‌క్త‌క‌ణాలు 45% శాతం, ప్లాస్మా 55% శాతం ఉంటుంది.

దానం చేసిన ర‌క్తాన్ని శ‌రీరం తిరిగి ఎన్ని రోజుల్లో త‌యారు చేసుకుంటుంది?
ద్ర‌వ భాగం రెండు రోజుల్లోనే స‌మ‌కూర్చుకుంటుంది. ర‌క్త‌క‌ణాలు త‌యారు కావ‌డానికి 21 రోజులు ప‌డుతుంది.

Latest Post  Heart: గుండె ప‌దిల‌మైతే మ‌నిషి ఆరోగ్యం ప‌దిల‌మే!

ర‌క్త నిధిలో ర‌క్తాన్ని ఎన్ని రోజులు నిల్వ చేయ‌వ‌చ్చు?
ర‌క్తం నిల్వ చేసే సాంకేతిక ప‌రిజ్ఞానం ప్ర‌కారం 35 రోజులు / 42 రోజుల వ‌ర‌కు నిల్వ చేయ‌వ‌చ్చు.

దానం చేసిన త‌ర్వాత మందులు మ‌రియు విశ్రాంతి అవ‌స‌ర‌మా?
అవ‌స‌రం లేదు. సాధార‌ణ ఆహారం చాలు. ర‌క్తాన్ని దానం చేసిన అర‌గంట త‌ర్వాత య‌థావిధిగా విధులు నిర్వ‌ర్తించుకోవ‌చ్చు. ర‌క్త‌దానం చేసిన రోజున జిమ్‌, ప‌రిగెత్త‌డం, అధిక శ్ర‌మ చేయ‌రాదు.

ర‌క్త‌దానాల మ‌ధ్య కాల వ్య‌వ‌ధి ఎంత ఉండాలి?
ర‌క్ద‌దానం చేసిన 3 నెల‌ల త‌దుప‌రి తిరిగి ర‌క్తాన్ని దానం చేయ‌వ‌చ్చు. ఒక వ్య‌క్తి 18 సంవ‌త్స‌రాలు – 65 సంవత్స‌రాల మ‌ధ్య జీవిత‌కాలంలో 188 సార్లు ర‌క్తాన్ని దానం చేయ‌గ‌ల‌రు. ప్లేట్లెట్ ఫెరిసిస్ ద్వారా మ‌రీ ఎక్కువ సార్లు ఇవ్వ‌వ‌చ్చు.

ర‌క్తాన్ని ఇవ్వాల‌నుకున్న వ్య‌క్తి నేరుగా దానం చేయ‌వ‌చ్చా?
డాక్ట‌ర్ ప‌రీక్షించి ఆరోగ్య‌ప‌రంగా అర్హులు అని ఆమోదించిన త‌ర్వాత మాత్ర‌మే ర‌క్తం ఇవ్వ‌వ‌చ్చు. సొంత ఆలోచ‌న ప్ర‌కారం ఇవ్వ‌రాదు.

ర‌క్త‌దానం లో వాడే ప‌రిక‌రాల ద్వారా ఏవైనా అంటువ్యాధులు?
ఎలాంటి అంటు వ్యాధులు సోక‌వు. స్టెరిలైజ్ చేయ‌బ‌డి ఒక‌సారి వాడి ప‌డేసే సూదుల‌ను, ఇత‌ర వ‌స్తువుల‌ను వినియోగిస్తారు కావున వ్యాధులు సంక్ర‌మించ‌వు.

ర‌క్తం సేక‌ర‌ణ‌లో ఏఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు?
ర‌క్త గ్రూపు నిర్థార‌ణ‌, మ‌లేరియా, హెప‌టైటిస్‌, బి.సి. సిలిఫిస్ మ‌రియు ఎయిడ్స్ నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేస్తారు.

ర‌క్త‌దాత‌ల బాధ్య‌త‌లేమిటి?
త‌న ర‌క్తం ఏ గ్రూపుదో తెలుసుకుని స‌ర్టిఫికెట్ పొందాలి. ర‌క్త‌దాన ఉద్య‌మ ప్ర‌చారం చేయాలి. వ్యాపార ర‌క్త‌నిధి నుంచి కాకుండా ప్ర‌భుత్వ లేదా రెడ్ క్రాస్ వారు నిర్వ‌హించే ర‌క్త నిధుల నుంచే అవ‌స‌రానికి రక్తం తీసుకోవాలి. క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తి 3 నెల‌ల‌కు స్వ‌చ్ఛంద ర‌క్త‌దానం చేయాలి. ర‌క్త‌నిధి నుంచి ర‌క్తం ఎలా పొంద‌వ‌చ్చో తెలుసుకొని ప్రచారం చేయాలి.

ర‌క్తం కొర‌కు అవ‌స‌రాలు ఎలా ఉన్న‌వి?
2002 సంవ‌త్స‌రంలో గ‌ణాంకాల ప్ర‌కారం మ‌న దేశంలో సంవ‌త్స‌రానికి 70 ల‌క్ష‌ల యూనిట్ల ర‌క్తం అవ‌స‌రం ఉండ‌గా స్వ‌చ్ఛంద ర‌క్త‌దాత‌ల ద్వారా సేక‌రించింది కేవ‌లం 3 ల‌క్ష‌ల 12 వేల యూనిట్లు మాత్ర‌మే ఉంది. కావున పైన చ‌దివిన‌వి అర్థం చేసుకోని మీరు కూడా ర‌క్తం దానం చేయండి!.

Latest Post  How does Cord Blood Banking work

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here